Latest Updates
-
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం!
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి!
మే డే (మే 1) ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకోబడుతుంది. కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలను, వారు సాధించిన విజయాలను ఈ రోజు గుర్తుచేస్తుంది. 19వ శతాబ్దంలో కార్మికులు రోజుకు 15 నుండి 16 గంటల పాటు దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేసేవారు. దీనికి నిరసనగా, ఎనిమిది గంటల పని దినం డిమాండ్ తో 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేపట్టారు.
ఈ పోరాటంలో అనేకమంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలకు గుర్తుగా 1889 నుండి మే 1వ తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు. 2026 మే డే సందర్భంగా శ్రమ జీవులకు విషెస్, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి స్టేటస్ కోట్స్ ఇక్కడ చూడండి.

హృదయపూర్వక శుభాకాంక్షలు
-2026 మే డే సందర్భంగా శ్రమజీవులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-మీ కష్టానికి తగిన గుర్తింపు దక్కాలని, మీ జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ మే డే.
-రేపటి బంగారు భవిష్యత్తు కోసం నేడు శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ మే డే శుభాకాంక్షలు.
-దేశాభివృద్ధిలో భాగస్వాములైన కార్మిక సోదరసోదరీమణులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
-మీ స్వేదమే ఈ లోకానికి మకరందం. మే డే శుభాకాంక్షలు.
-పగలనక, రాత్రనక కష్టపడే ప్రతి జీవికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-హక్కుల సాధన కోసం పోరాడిన వీరులను స్మరించుకుంటూ.. 2026 మే డే శుభాకాంక్షలు.
-నీ విశ్రాంతి లేని శ్రమే.. నేడు మనందరి ప్రశాంత జీవితం. థ్యాంక్యు, హ్యాపీ మే డే.
-ప్రపంచ గమనానికి ఊపిరి పోసేది కార్మికుడి కండబలమే. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
స్ఫూర్తిదాయకమైన కోట్స్
-ప్రపంచాన్ని నడిపించే ఇంధనం కార్మికుడి చెమట. శ్రమజీవులందరికీ మే డే శుభాకాంక్షలు.
-కష్టపడే ప్రతి మనిషీ ఓ సైనికుడే.. పనిముట్లు పట్టిన చేతులు ప్రగతికి పతాకాలు. 2026 మే డే శుభాకాంక్షలు.
-శ్రమించనిదే ఏదీ సాధ్యం కాదు. శ్రమ దోపిడీ లేని సమాజమే నిజమైన స్వర్గం. హ్యాపీ మే డే.
-ప్రతి భవనం వెనుక, ప్రతి ఆవిష్కరణ వెనుక ఓ కార్మికుడి అలుపెరగని శ్రమ దాగి ఉంటుంది.
-పెట్టుబడి సృష్టిస్తే, శ్రమ దానికి ప్రాణం పోస్తుంది. కార్మికుడు లేనిదే సృష్టి లేదు.
-పని చేసే చేతులు దేవుని చేతులతో సమానం. నీ కష్టమే నీకు శ్రీరామరక్ష.
-చెమట చుక్కల పునాదుల మీదే దేశ ప్రగతి భవనాలు నిర్మించబడతాయి.
-నరనరాల్లో రక్తాన్ని ఇంధనంగా మార్చి దేశాన్ని నడుపుతున్న శ్రామికుడికి పాదాభివందనం.
వాట్సాప్, సోషల్ మీడియా స్టేటస్
-శ్రమ నీ ఆయుధం అయితే, విజయం నీ బానిస అవుతుంది. హ్యాపీ మే డే 2026.
-లోకాన్ని నడిపించే చక్రం.. కార్మికుడి కష్టం. హ్యాపీ మే డే.
-హక్కుల సాధనకు ప్రతీక ఈ మే డే.
-శ్రామిక వీరులకు జేజేలు. హ్యాపీ మే డే.
-స్వేద బిందువులే దేశ ప్రగతికి సింధువులు. అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-సృష్టికి మూలం శ్రమ.. ఆ శ్రమకు రూపం కార్మికుడు. హ్యాపీ మే డే.
-నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను... కార్మిక లోకానికి సలాం.
-పని దైవం, కష్టపడేవాడే కర్మయోగి. హ్యాపీ మే డే.
-ఎండను లెక్కచేయక, వానకు భయపడక శ్రమించే నీ చేతులకు వందనం.
-నా దేశ సంపద.. నా దేశ కార్మికుడి స్వేదం.

కవితాత్మక, ఎమోషనల్ విషెస్
-నువ్వు రాళ్ళు పేర్చితేనే గుడి అయ్యింది, నువ్వు ఇటుకలు పేర్చితేనే బడి అయ్యింది. ఓ శ్రామికుడా నీకు వందనం.
-అన్నం పండించే రైతు, ఆవిష్కరణలు చేసే కార్మికుడు.. ఇద్దరూ దేశానికి రెండు కళ్లు.
-చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, కార్మికుడిని చూసి కష్టపడటం నేర్చుకో.
-ఎర్రటి ఎండలో పచ్చటి పైరును చూసి మురిసే రైతులా, తన కష్టంతో రూపుదిద్దుకున్న వస్తువును చూసి మురిసే కార్మికుడికి సలాం.
-చేతులు కందిపోతున్నా, పెదవిపై చిరునవ్వుతో పనిచేసే కార్మికుడి ధైర్యానికి మే డే ఓ నివాళి.
-శ్రమదోపిడి లేని నవ సమాజ నిర్మాణమే కార్మికుడికి మనం ఇచ్చే నిజమైన గౌరవం.
-శ్రమకు కులం లేదు, మతం లేదు.. దానికి ఉన్న ఒకే ఒక్క జెండా స్వేదం.
-మన కళ్ళకు కనిపించే ప్రతి అద్భుతం వెనుక, కనిపించని కార్మికుడి కష్టం ఉంటుంది.
-బ్రతుకు పోరాటంలో అలసిపోని యోధుడు కార్మికుడు.
-కార్మికుడి కష్టం కన్నీరు కాకూడదు, వారి చెమట చుక్కలు వృధా కాకూడదు.



Click it and Unblock the Notifications