Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
బరువును తగ్గించే పన్నీర్ ఆనియన్ సూప్
సూప్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపయోగకరమైనది. భోజనంలో పాటు తీసుకోవచ్చు. లేదా సాయంత్ర సమయంలో ఈ సూప్ ను తీసుకోవచ్చు. సీజన్ బట్టి సూప్ లను తయారు చేసుకోవచ్చు. సూప్ ను తాగడం వల్ల బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సూప్స్ వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే అందులో పన్నీర్ మరియు ఉల్లిపాయతో తయారు చేసే సూప్ చాలా సులభం మరియు టేస్టీ, హెల్తీ కూడా.. ఒక సారీ మీరూ ప్రయత్నించి చూడండి..
కావలసిన పదార్థాలు
పన్నీర్: 250grms(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(గుజ్జులా తయారు చేసుకోవాలి)
ఫ్రైడ్ నూడిల్స్: 1cup
క్యాబేజి : 1/2cup(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
వెల్లుల్లి: 3రెబ్బలు(చితగొట్టుకోవాలి)
బ్రెడ్ స్లైస్: 3(చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
మంచూరియన్ సాస్: 1tsp
బ్లాక్ పెప్పర్ పొడి: 1tspl
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
నీళ్ళు: ½ cup
గార్నిష్ కోసం
కొత్తిమీర తరుగు: 1tbsp
ఉల్లిపాయ: ½ (చక్రాలుగా కట్ చేసినవి)
బట్టర్: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా కుక్కర్ లో క్యాబేజి ముక్కలు వేసి రెండు నిముషాలు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత నీరు వంపేసి మెత్తగా పాముకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో పన్నీరు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తర్వాత టమోటో గుజ్జు, వెల్లుల్లి , ఉడికించిన క్యాబేజిని కూడా వేసి మరో రెండు నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
3. తర్వాత అందులో ఉప్పు, బ్లాక్ పెప్పర్ మరియు మంచూరియన్ సాస్ వేసి, తగినన్ని నీరు పోసి బాగా ఉడికించాలి. సూప్ బాగా ఉడికి చిక్కబడే సమయం చూసి స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత అందులోనే పన్నీర్ ముక్కలను మరయిు ఉల్లిపాయ ముక్కలను వేసి సూప్ బౌల్ తీసుకోవాలి. అంతే పన్నీర్, ఆనియన్ సూప్ రెడీ. సర్వ్ చేసే ముందుగా ఫ్రైడ్ నూడిల్స్ ను ఆడ్ చేయాలి.
తర్వాత కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు , బట్టర్ వేసి మిక్స్ చేసి వేడి వేడిగా తినేసేయాలి అంతే. ఇష్టం ఉన్నవాళ్ళుబ్రెడ్ ముక్కలను కలుపాలి.



Click it and Unblock the Notifications