Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
పన్నీర్ పహాడి రిసిపి: రోటీ స్పెషల్
పనీర్ రిసిపి ఎప్పుడూ చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్స్ కు చాలా ఇష్టమైన వంట. పనీర్ తో వివిధ రకాల వంటలను తయారుచేయవచ్చు. అలాంటి వంటల్లో పన్నీర్ పహాడి ఒకటి. దీనికి కొన్ని హెర్బ్స్ జోడించి ఆర్డినరీ డిష్ గా తయారుచేస్తే, ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. మరి ఫ్రెష్ గ్రీన్ హెర్బ్స్ ఉపయోగించి తయారుచేసే పన్నీర్ రిసిపిని ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.
పనీర్ పహాడి హిల్ ప్రదేశాల్లో ఎక్కువగా తయారుచేస్తారు. ఈ వెజిటేరియన్ రిసిపిని పుదీనా, కొత్తిమీర మరియు ఇండియన్ మసాలా దినుసులను ఉపయోగించి ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పనీర్: 250grm
క్యాప్సికమ్: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
పుదీనా : 1/4cup(సన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తరుగు: 1tbsp
కార్న్ ఫ్లోర్: 1tbsp
పచ్చిమిర్చి: 4
వెల్లుల్లి రెబ్బలు: 4
పెరుగు: 2tbsp
ఉప్పు: రుచికిసరిపడా
ధనియాలా పొడి : 1tsp+1tsp
జీలకర్ర పొడి : 1tsp
ఛాట్ మసాలా: 1tsp+2tsp
తందూరి మసాలా : 1tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2 tsp
కారం: 1/2tsp
నూనె: 4tbsp
స్కీవర్స్
తయారుచేయు విధానం:
1. ముందుగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలపొడి, జీలకర్ర, పెరుగు మరయిు ఉప్పు వేసి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ లో సగం తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు కార్న్ ఫ్లోర్, తందూరి మసాలా, ఛాట్ మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు కారం , ముందుగా తయారుచేసుకొన్న పేస్ట్ లో సగం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని పనీర్ , క్యాప్సికమ్ కు మరియు ఉల్లిపాయలకు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు వీటిని స్కీవర్స్ కు గుచ్చి రిఫ్రిజరేటర్ లో పెట్టాలి.
4. తర్వాత పాన్ లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేసి , పన్నీర్ ను మీడియం ఫ్లేమ్ మీద 20 నిముషాల గ్రిల్ చేయాలి. ఇది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఉంటే బ్రౌన్ కలర్లో కి మారి పనీర్ తో పాటు వెజిటేబుల్స్ మెత్తగా ఉడుకుతాయి.
5. ఇవి ఫ్రై అయ్యి, మెత్తగా ఉడికిన తర్వాత ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.
6. ఇప్పుడు పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పుదీనా పేస్ట్ వేసి కలర్ మారే వరకూ ఫ్రై చేయాలి.
7. ఇప్పుడు జీలకర్రపొడి, ఛాట్ మసాలా మరియు ధనియాల పొడి వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి .
8. ఇప్పుడు ఈ గ్రేవీని పనీర్ స్కీవర్స్ మీద వేసి సర్వ్ చేయాలి. అంతే పనీర్ పహాడి రెడీ. ఈ స్పెషల్ పనీర్ పహాడి రిసిపిని రోటీలతో సర్వ్ చేస్తారు.



Click it and Unblock the Notifications