Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
పంప్కిన్(గుమ్మడి)కర్రీ: నవరాత్రి స్పెషల్
నవరాత్రి. వసంత నవరాత్రుల్లో ఈ రోజు 4వ రోజు మరియు ఉపవాసం రోజు. ఉపవాసం ఉన్న సమయంలో ఉపవాసం తీర్చుకోవడానికి రోజుకో కొత్త వంటను కనుక్కోవడం లేదా తయారుచేయడం ఒక కొంచెం కష్టమే. ప్రతి రోజూ ఒకే రకమైన ఆలూ సబ్జీ తినడం బోరుకొడుతుంది. కాబట్టి, చాలా సింపుల్ అండ్ ట్యాంగీ పంప్కిన్ కర్రీతో మీ టేస్ట్ బడ్స్ ను రుచిచూపించండి.
ఈ స్పెషల్ పంప్కిన్ కర్రీ, ముఖ్యంగా నవరాత్రి వ్రత సమయంలో తయారుచేసేటప్పుడు, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా తయారుచేస్తారు . ఈ టేస్ట్ కోసం ఇందులో బెల్లం తురుము మరియు డ్రై మ్యాంగో పౌడర్ ను ఉపయోగిస్తారు. మరి మీరు కూడా ఈ స్పెషల్ టేస్ట్ ను రుచి చూడాలంటే, ఒక సారి ట్రై చేయండి....

కావల్సిన పదార్థాలు :
గుమ్మడికాయ-1 (మీడియం సైజ్, ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మెంతులు: 1tbsp
పసుపు: ½tsp
జీలకర్ర పొడి: 1tsp
డ్రై మామిడి పొడి: 2tsp
బెల్లం: 1tbsp (తురిమిన)
రాక్ సాల్ట్(ఉప్పు): రుచికి సరిపడా
నూనె: 1tbsp
నీళ్ళు: 1cup
కొత్తిమీర తరుగు: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మీకు కావల్సిన సైజ్ లో గుమ్మడికాయను ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో మెంతులు వేసి ఒక సెకను ఫ్రై చేసుకోవాలి.
3. మెంతులు వేగుతున్నప్పుడే, అందులో గుమ్మడి ముక్కలు వేసి, 5నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి.
4. 5నిముషాల తర్వాత అందులో జీలకర్ర పొడి, రాక్ సాల్ట్, డ్రై మ్యాంగ్ పౌడర్, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. ఇలా ఫ్రై చేసుకొన్న తర్వాత ఇందులో బెల్లం తురుము మరియు కొద్దిగా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
6. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట మీద 5-10ఉడికించుకోవాలి. గుమ్మడి ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే స్వీట్ అండ్ ట్యాంగా పంప్కిన్ కర్రీ రెడీ. ఈ కర్రీని నవరాత్రి స్పెషల్ గా తినవచ్చు. సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications