బెంగాలీ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్-రాధా భల్లవి

రాధా భల్లవి ఓ అద్భుతమైన పూరి రిసిపి. చిలా సింపుల్ గా తయారు చేసే ఒక లోక్యాలరీ బ్రేక్ ఫాస్ట్ అంతే కాదు ఇందులో న్యూట్రీషినల్ విలువలు మెండుగా ఉంటాయి. రాధా భల్లవి బెంగాలి వంటకం. ఇది బాగా పాపులర్ అయినటువంటి వంటకం.

ఈ వంటకాన్ని అన్ని కార్యక్రమాలను ప్రత్యేకంగా వండుకుంటారు. చాలా మంది వంటకాన్ని ఇష్టపడుతారు అంతే కాదు. చాలా సులభంగా అతి తక్కువ సమయంలో వీటిని తయారు చేస్తారు . ఈ బ్రేక్ ఫాస్ట్ రిపిపికి ముఖ్యంగా మైద, పెరుగు, ఉద్దిపప్పు అవసరం అవుతుంది. మరి ఈ స్పెషల్ లోక్యాలరీ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
మైదా: 3-4cups
పెరుగు: 3-4tbsp
జీలకర్ర: 1tsp
ఉద్దిపప్పు: 2cups(ఉడికించుకోవాలి)
ఇంగువ: 1/4tsp
వెజిటేబుల్ ఆయిల్: 7-8tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైద, పెరుగు, నెయ్యి, కొద్దిగా ఉప్పు మరియు సరిపడా నీళ్ళు పోసి మెత్తగా పూరీల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

2. ఉడికించి పెట్టుకొన్న ఉద్దిపప్పును తీసుకొని బాగా మ్యాష్ చేయాలి.

3. ఇప్పడుు డీప్ బాటమ్ పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి అందులో సరిపడా నూనె వేసి కాగిన తర్వాత అందు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత ఉడికించుకొన్న ఉద్దిపప్పు వేసి ఒకటి రెండు నిముషాల పాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి.

4. తర్వాత అందులోనే ఇంగువ వేసి మరో ఒక నిముషం పాటు వేగించి, స్టౌ ఆఫ్ చేసేయాలి.

5. ఇప్పడు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, చిన్న చిన్న పూరీల్లా వత్తుకోవాలి.

6. మరో పాన్ స్టౌ మీద పెట్టి నూనె పోసి బాగా కాగిన తర్వాత వత్తుకొన్న పూరీలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అతి తక్కువ మంట మీద వేగించుకోవాలి. మిగిలిన పూరీలను కూడా కాల్చుకొని తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే మీ రాధాభల్లవి స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ రెడీ

Desktop Bottom Promotion