Latest Updates
-
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే
సింపుల్ ఫాస్ట్ అండ్ టేస్టీ కర్డ్ రైస్

పాలు : రెండు లీటర్లు
బియ్యం :1cup
పచ్చిమిర్చి: 4
ఉల్లిపాయ: 2
అల్లం : చిన్న ముక్క
కేరెట్ :1
ఆవాలు: 2tsp
జీలకర్ర: 2tsp
సెనగ పప్పు: 3tsp
మినపప్పు: 2tsp
జీడి పప్పు : 6
ఎండు మిర్చి:2
కరివేపాకు : 2 రెమ్మలు
ఉప్పు : రుచికి తగినంత
కొత్తిమీర : ఒక కట్ట
తయారు చేయు విధానం :
1. అన్నం మెత్తగా వండాలి. పాలు కూడా కాచి తోడు వేసి పెరుగు పులుపు రాకుండా రెడీ చేసుకోవాలి.
2. ఇప్పుడు వండుకున్న అన్నాన్ని బాగా చల్లారబెట్టాలి.ఇప్పుడు ఈ అన్నంలో అప్పుడే తోడుకున్న పెరుగుని వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు ఈ పెరుగు అన్నంలో తగినంత ఉప్పు, చిన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురిమిన కేరెట్ వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో ముందుగా నూనె వేసి, అది కాగిన తరువాత అందులో సెనగపప్పు, మినపప్పు, జీడిపప్పు వేసి అవి దోరగా వేగిన తరువాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, చివరిగా కరివేపాకు వేసి దోరగా వేయించాలి. అవి బాగా వేగిన తరువాత దించి పక్కన పెట్టి చల్లార్చి చల్లారిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేయించి పెట్టుకున్న తాలింపును నూనె రాకుండా జాగ్రతగా వేయాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిసేలా పెరుగు అన్నాన్ని బాగా కలపాలి.
5. ఇప్పుడు దాని తరిగిన కొత్తిమీర తో పైన అలంకరిస్తే కర్డ్ రైస్ రెడీ.



Click it and Unblock the Notifications