స్పానిష్ రైస్

Spanish Rice
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2cups
టమోటా: 3
కాప్సికమ్: 2
క్యారెట్:100grm
బీన్స్:100grm
పచ్చి బఠాణీలు: 50grm
బంగాళదుంపలు: 2
ఉల్లిపాయ:1
ఛీజ్ తురుము:100grm
పచ్చిమిర్చి పేస్ట్: 2spn
వెన్న:1 spn
వెల్లుల్లి రెబ్బలు:12
ఎండు మిరపకాయలు: 4
పెరుగు:1cup
నెయ్యి: 2 spn
గరం మసాలా:1spn
మిరియాల పొడి:1spn
జీడిపప్పు: 50grm
ఉప్పు: రుచికితగినంత

తయారు చేయు విధానం:
1. బాస్మతి బియ్యాన్ని ముందుగానే ఉడికించి పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత కూరగాయలన్నిటినీ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
3. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
4. పాన్ స్టౌపై ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి, తర్వాత ఎండు మిరపకాయలు వెల్లుల్లి ముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేగించాలి.
5. ఇందులో పెరుగు, కూరగాయ ముక్కలు, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, వేసి మరి కొంత సేపు వేగించాలి. తర్వాత వెన్న చేర్చి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచాలి.
6. చివరగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నం, ఛీజ్ తురుము వేసి 15:20 నిమిషాలు ఉడికించాలి. దించే ముందు పైన జీడిపప్పు గార్నిష్ గా అలకరించాలి అంతే స్పానిష్ రైస్ రెడీ.

Story first published: Thursday, February 10, 2011, 14:59 [IST]
Desktop Bottom Promotion