Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
స్పైసీ కోకనట్ కచోరీ -బ్రేక్ ఫాస్ట్ రిసిపి
బ్రేక్ ఫాస్ట్ లలో వెరైటీగా, చూస్తానే తినేయాలనిపించి, నోరూరించే వంటకం కోకోనట్ కచోరి. కచోరి అనేది నార్త్ ఇండియన్ వైపు పాపులర్ స్నాక్. సింపుల్ డీప్ ఫ్రై ఇండియన్ బ్రెడ్. కచోరి అంటే గుండ్రంగా అందులో మిశ్రమ పదార్థాలతో నిండుగా నింపి టేస్టీ గా ఉండే స్టఫ్డ్ ఇండియన్ బ్రెడ్ లాంటిది అనుకోవచ్చు. అయితే బ్రెడ్ కాదండోయ్.... కచోరీలను కొన్ని వరైటీలతో నింపి చేసుకొంటారు. కోకోనట్ మిశ్రమానికి బదులు, ఆలూ మిశ్రమం తో కూడా చేసుకొంటారు. అయితే కొబ్బరి మిశ్రమంతో తయారు చేసే అన్ని వంటలు చాలా పాపులర్ వంటకాలు కాబట్టి అదే ఫ్లేవర్ తో మరో వెరైటీ వంటకం బ్రేక్ ఫాస్ట్ మీ కోసం...
క్రిస్పి కోకనట్ కచోరి తయారు చేయడం చాలా సులభం మరియు ఈ వంటకు ఎక్కువ వస్తువులు కూడా అవసరం లేదు. ఈ గోధుముపిండికి కొబ్బరి మిశ్రమాన్నిస్టఫ్ చేసి డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక సారి ట్రై చేయండి..
కావల్సిన పదార్థాలు:
కొబ్బరి తురుము: 1cup
పచ్చిమిర్చి: 4
పంచదార: 1/2tsp
అజ్వైన్: 1/2tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా పౌడర్: 1tsp
జీలకరపొడి: 1tsp
మైదా: 3cups
నెయ్యి: 1tsp
నూనె: 1cup(డీప్ ఫ్రై కొరకు)
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా కొబ్బరి తురుము మరియు పచ్చిమిర్చి రెండూ చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక టీస్పూన్ నూనె పాన్ లో వేసి అజ్వైన్(ఇంగువ)వేయాలి. ఒక సెకన్ తర్వాత కొబ్బరి మరియు పచ్చిమిర్చి పేస్ట్ ను వేసి రెండు నిముషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే అన్ని మసాల పౌడర్లు (జీలకరపొడి, ధనియాల పొడి మరియు గరం మసాలా పౌడర్ వేసి, బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే పంచదార మరియు ఉప్పు కూడా వేసి మరో 4-5నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి ఈ మసాలాను చల్లారనివ్వాలి.
5. అంతలోపు పిండిని కలుపుకోవాలి. అందుకు ఒక బౌల్లో మైద, నెయ్యి, నీళ్ళు పోసి మ్రుదువుగా పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని ఒక తడి బట్టతో కప్పి ఉంచి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
6. అరగంట తర్వాత ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ ఉండలను అరచేతిలో పెట్టుకొని వత్తుకోవాలి. తర్వాత పిండి మధ్యలో ముందుగా తయారు చేసుకొన్న కొబ్బరి మసాలా ముద్దను పెట్టి, తర్వాత మడిచి అన్ని వైపులా కవర్ చేయాలి.
7. తర్వాత ఈ స్టఫ్ చేసి మైద ముద్దను చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకోవాలి.
8. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కగానే కచోరీలను కాగే నూనెలో వేయాలి.
9. కచోరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించి, తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
ఈ కోకనట్ కచోరిని చట్నీ లేదా ఆలూ సబ్జీతో సర్వ్ చేయాలి. అంతే కోకనట్ కచోరీ రెడీ.



Click it and Unblock the Notifications
