Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్పైసీ అండ్ స్వీట్ పొటాటో పాన్ కేక్ : బ్రేక్ ఫాస్ట్ రిసిపి
చాలా మంది ఉదయం తీసుకొనే అల్పాహారాన్ని చాలా సింపుల్ గా తీసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఆ తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరమైన ఆహారమై ఉండాలని కూడా కోరుకుంటారు. ప్రతి రోజూ తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ తోనే ఆరోజంతా ఆరోగ్యకరంగా నడుస్తుంది. అంతే కాదు సరైన సమయంలో అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన వాటిలో పొటాటో పాన్ కేక్ ఒకటి. ఇది కడుపు నిండేలా చేయడమే కాకుండా, చాలా సింపుల్ గా తయారవుతుంది. ఇంకా ఈ అల్పహారంలో తగినన్ని పోషకాలు శరీరానికి అందిస్తుంది. మరి ఈ స్వీట్ పొటాటో పాన్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావల్సిన పదార్థాలు:
స్వీట్ పొటాటో : 2 పెద్దవి(పొట్టు తీసి, మైక్రోవోవెన్ లో ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకోవాలి)
బట్టర్: 2tbsp(కరిగించుకోవాలి)
పుదీనా: 2tsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
గుడ్డు : 1(అవసరం అనుకుంటేనే)
మైదా: 1cup
బ్రెడ్ పొడి: 1/2cup
బేకింగ్ పౌడర్ : 1tsp
వెజిటేబుల్ ఆయిల్ : ఫ్రై చేయడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప, బటర్, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, మైదా, బ్రెడ్ పొడి, బేకింగ్ పౌడర్ ను వేసి మెత్తగా మృదువుగా కలుపుకోవాలి.
2. ఇప్పుడు ఒక సాస్ పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక దాని మీద వెజిటేబుల్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో పొటాటో మిశ్రమాన్ని దోసెలాగా వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పాన్ కేక్ మీద కొద్దిగా నూనె చిలకరించుకోవాలి. రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి . అంతే స్పైసీ అండ్ స్వీట్ పొటాటో పాన్ కేక్ రెడీ.
3. అంతే ఈ వేడి వేడి పొటాటో పాన్ కేక్ కు సాస్ మరియు బట్టర్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపికి రెడీ అయిపోవండి...



Click it and Unblock the Notifications