Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
హెల్తీ పాలక్ పులావ్-హెల్తీ మీల్ రిసిపి
గ్రీన్ లీఫ్స్(ఆకు కూరలో)ఆరోగ్య విషయంలో మరియు న్యూట్రిషినల్ బెనిఫిట్స్ అందించే విషయంలో ఎప్పటికి ఎవర్ గ్రీనే. ఎందుకంటే ఆకుకూరల్లో డైటేరియన్ ఫైబర్ ఫుష్కలంగా ఉండి, జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. జీర్ణం మాత్రమే కాదు, ఇందులో లోక్యాలరీలు కలిగి ఉంటుంది కాబట్టి హార్ట్ ఫ్రెండ్లీ ఆహారంగా చెప్పవచ్చు. ఆకు కూరల్లో ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్స్ విటమిన్ సి పుష్కలంగా ఉండి మొత్తం ఆరోగ్యానికే సహాయపడుతుంది.
ఆకు కూరలతో తయారు చేసే వంటలు వివిధ రకాలున్నాయి. ఆకు కూరల్లో పాలకు కూరకు ప్రత్యేక స్థానం ఉంది. పాలకూరలో అనేక వ్యాధులను నివారించే లక్షణాలతో పాటు భయంకరమైన క్యాన్సర్ నివారిణికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పాలక్ తో కర్రీస్ మాత్రమే కాదు పాలక్ తో డిఫరెంట్ రైస్ కూడా తయారు చేయవచ్చు. మరి ఈ హెల్తీ పాలక్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
బియ్యం:1 cup
ఆకు కూర(పాలకూర): ½ cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయ:1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
క్యారెట్: 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి:2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
చెక్క :1 చిన్న ముక్క
లవంగాలు: 2
జీలకర్ర: ½ tsp
బిర్యాని ఆకు:1
కారం: 1 tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్:1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20-30నిముషాలు నానబెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ మైక్రోవోవెన్ డిష్ లో కొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర, బిర్యాని ఆకు, చెక్క, లవంగాలు, వేసి ఒక నిముషంతర్వాత ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
3. తర్వాత మైక్రోవొవెన్ లో మూత పెట్టకుండా మూడు నిముషాలు పెట్టాలి. ఇప్పడు కట్ చేసిపెట్టుకొన్న క్యారెట్ మరియు ఆకుకూర వేయాలి. మిశ్రమాన్నంతటిని బాగా మిక్స్ చేసి మరో మూడు నిముషాలు ఉడికించాలి.
4. ఇప్పుడు అందులో ఉప్పు మరియు కారం మరియు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత అందులోనే శుభ్రం చేసి పెట్టుకొన్న నానబెట్టి పెట్టుకొన్ని బియ్యాన్ని నీరు వంపేసి అందులో వేసి సరిపడా నీళ్ళు పోసి, బాగా కలియబెట్టి మైక్రోవోవెన్ మూత పెట్టి 15-20 నిముషాల పాటు ఉడికించుకోవాలి. అంతే పాలక్ పులావ్ రెడీ. ఈ పాలక్ పులావ్ కు రైతా లేదా మీకు నచ్చిన పికెల్ తో సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications