Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
స్వీట్ వెజిటబుల్ బాత్

కాలీఫ్లవర్: 1 (చిన్నది)
బీన్స్: 1cup
కాప్సికమ్: 2
ఉల్లిపాయ: 2(చిన్న సైజు చక్రాల్లా కట్ చేయాలి)
పైనాపిల్: 1/2cup(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
కార్న్ ఫ్లోర్: 3tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
క్యారెట్: 2
టొమాటో కెచప్: 2tsp
చిల్లీ సాస్: 2tsp
చింత పండు రసం: 1tsp
ఆరెంజ్ జ్యూస్: 2tsp
తయారు చేసే విధానం:
1. కాలీఫ్లవర్ ను కొద్దిగా కాడతో కట్ చేసు కోవాలి. వాటిని ఉప్పు నీటిలో కాని వేడి నీటి లో కాని వేసుకుని ఒక పావు గంట ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి తడిపోయే వరకు ఆరబెట్టాలి.
2. క్యారెట్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను రౌండ్ గా కట్ చేసుకోవాలి. కాప్సికమ్ ను కూడా చిన్నవిగా, పొడువుగా కట్ చేసుకోవా లి.
3. కార్న్ ఫ్లోర్ మూడు టీస్పూన్లు కొంచెం వేడి నీటిలో కలుపుకుని పేస్టులా తయారుచేసు కోవాలి. స్వీట్ పేస్ట్ కొంచెం చేయాలి.
4. స్టౌ మీద పాన్ వుంచి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. వేడి అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి అందులో ఈ స్వీట్ పేస్ట్‌ని వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. అన్నింటిని సన్నని సెగ మీద వేగనివ్వాలి. పావు గంట తర్వాత దించుకుని చల్లారనివ్వాలి.
5. అది ఈ మగ్గిన కూరగాయలలో, కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసి కలపాలి. మళ్లీ అన్నిటిని కలిపి ఒక గిన్నెలో వేసుకుని 2 లేదా 3 నిమిషాలు స్టౌ మీద మూతపెట్టి వుడకనివ్వాలి. 6. ఉడికిన తర్వాత దించుకుని పైన చెప్పిన పేస్ట్ వేయాలి. రెండు స్పూన్ల టొమాటో కెచెప్, చిల్లీసాస్, ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, చింత పండు రసం వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి.
7. కూరలు ఉడికిన తర్వాత దించుకుని అందులో కలుపున్న జ్యూస్ మిశ్రమాన్ని కొంత పక్కకు పెట్టుకుని మిగిలినది వేసి మళ్లీ రెండు నిమిషాలు స్టౌ మీద ఉంచాలి. దాన్ని దించుకుని ఆ మొత్తాన్ని ఒక వెడల్పాటి డిష్‌లోకి వంచుకుని పైన మిగిలిన జ్యూస్‌ని కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇది తియ్యగా, కారంగా, పుల్లగా ఎంతో టేస్ట్‌గా వుంటుంది. అంతే స్వీట్ వెజిటబుల్ బాత్ రెడీ.



Click it and Unblock the Notifications