Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
ట్యాంగీ ఆలూ టమాటర్ : సైడ్ డిష్ రిసిపి
బంగాళదుంపలు ప్రతి ఇంటి వంటగదిలో నిల్వచేసుకోవడానికి చూస్తూనే ఉంటాం. చాలా మంది ఇల్లలో బంగాళదుంప వంటలేకుండా వారి భోజనం పూర్తి కాదు. బంగాళదుంపతో తయారుచేసే సైడ్ డిష్ కానీ, లేదా సబ్జీ కానీ ఒక ప్రదేశానికి మరో ప్రదేశాని చాలా తేడా ఉంటుంది. భోజనానికి ఆలూతో వివిధ రకాలుగా వంట వండవచ్చు .
ఉద్యోగస్తులైతే సమయం లేక ఏదో ఒకటి సులభంగా తయారయ్యే వంటలను చేసుకుంటుంటారు. అటువంటి వంట్లో ఇది కూడా ఒకటి. ఈ వంటను చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారుచేయవచ్చు.బంగాళదుంపలను ఉడికించి, టమోటోతో ఫ్రై చేయడం వల్ల, కాస్త పుల్లగా ఉంటుంది. కానీ, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సింపుల్ సైడ్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బంగాళ దుంపలు: 4-5
టమోటో: 2 (మధ్య స్థాయి ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా: ½ tsp
జీలకర్ర: ½ tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఒక్కో బంగాళదుంపను 4బాగాలుగా కట్ చేయాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో నీళ్ళు పోసి, కడిగిన బంగాళదుంపలు అందులో వేసి, చిటికెడు ఉప్పు వేసి 2,3విజిల్స్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. అంతలోపు, ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి వేయించాలి.
4. తర్వాత జీలకర్ర వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి, మరియు టమటో ముక్కలు వేసి మిక్స్ చేస్తూ 5నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి.
5. మరో వైపు ప్రెజర్ కుక్కర్ ఆవిరి తగ్గినతర్వాత మూత తీసి, బంగాళదుంప యొక్క పొటు తీసి, పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో పసుపు, మరియు కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి.
7. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ధనియాల పొడి మరియు గరం మసాలా వేసి వేయించుకోవాలి.
8. తర్వాత ఉడికించి, పొట్టుతీసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలను వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. మీకు సెమీ గ్రెవీ కావాలనుకుంటే, కొద్దిగా నీళ్ళు జోడించి ఉడికించుకోవచ్చు. అయితే గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే ట్యాంగీ ఆలూ రెడీ. ఈ వంటను రైస్ కు సైడ్ డిష్ గా లేదా రోటీలకు కాంబినేషన్ గా వండించవచ్చు.



Click it and Unblock the Notifications