Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
నోట్లో నీరూరించే మాగాయ రుచి మహా గొప్పది...!
సాధారణంగా మార్కెట్లో పచ్చిమామిడికాయలు కనబడితే చాలు. నోట్లో నీళ్ళూరాల్సిందే. ఇక పచ్చిమామిడికాయ ముక్క మీద ఉప్పు, ఎర్రని కారం చల్లితే ఇక అంతే తినేవరకూ చూపు పక్కకు మరలదు. ఇక ఊరగాయ సంగతి సరేసరి. లొట్టలేయాల్సిందే. పచ్చిమామిడికాయలు మార్కెట్లో మెళ్ళి మెళ్ళిగా అడుగుపెడుతున్నాయి. సీజన్ మొదలైయింది. ఆవకాయ ప్రియుల ఎప్పుడెప్పుడా కొత్తఆవకాయ తిందామని ఎదురుచూస్తున్నారు.
పచ్చిమామిడికాయతో వివిధ రకాల వంటలు, మామిడి పులిహోర, పచ్చిమామిడికాయ పచ్చడి, పచ్చిమామిడికాయ తొక్క ఆవకాయ ఇలా సీజన్ అంతా తయారు చేసి రుచిచూస్తుంటారు. కానీ ఆవకాయ తరువాత అంతగానూ ఇష్టపడి తినే పచ్చడి మాగాయ. మాగాయ మహాపచ్చడి, మాగాయ రుచి మహా గొప్పది . ఏ కూరలు చేసే ఓపిక లేనప్పుడు , పెరుగన్నం లో మాగాయ కలుపుకుని తిన్నామనుకోండి , గిన్నెడన్నమూ ఒక్కరికి కూడా సరి పోదు ! అంత రుచిగా ఉండే ఈ పచ్చడి ఎలా చెయ్యాలో చూద్దాం. ఈపచ్చడికి స్పెషల్ గా రసాలు, జలాలు అంటూ వెతకవలసిన అవసరం లేదు. మామూలు కాయలైనా పుల్లగా ఉంటే చాలు చేసెయ్యొచ్చు.

కావలసిన పదార్ధాలు :
మామిడికాయలు : 2
కారం : 3tbsp
ఉప్పు: రుచికి తగినంత
ఆవపిండి : 1tsp
మెంతిపిండి : 1/2tsp
నూనె: 1cup
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
తాలింపుకు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిరెబ్బలు
తయారు చేయు విధానం:
1. ముందుగా మామిడికాయను చెక్కుతీసి కడిగి తుడిచి వాలికలుగా ముక్కలు కొయ్యాలి.
2. తర్వాత ఈ ముక్కలలో ఒక స్పూన్ ఉప్పు,చిటికెడు పసుపు వేసి బాగా కలిపి రెండు మూడు గంటలు ఉంచాలి.
3. ఇప్పుడు ఊరిన రసంలో నుండి ముక్కలు వేరుచేసి ఎండలో పెట్టాలి. మంచి ఎండలో రెండు గంటలు ఉంచితే చాలు.
4. ఈ మామిడి రసంలో కారం, ఆవపిండి, మెంతి పిండి, తగినంత ఉప్పు వేసి, చివరగా మామిడి ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.
5. నూనె వేడి చేసి తాలింపు వేసి, చిదిమిన వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు వేసి, ఈ తాలింపును పచ్చడిలో కలిపితే ఎర్రగా నోరూరిస్తూ మాగాయపచ్చడి రెడీ. ఇష్టం ఉన్నవారు తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications