Latest Updates
-
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్

కావలసిన పదార్థాలు:
రైస్: 2cups
గుడ్లు: 4
వెజిటేబుల్స్(కూరగాయలు): 1cup(క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, ముక్కలు)
ఉల్లిపాయ(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి): 2 లేదా 3
పచ్చిమిర్చి: 6-8
గరం మసాలా పౌడర్: 1tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp
నూనె: తగినంత
సోయా సాస్: 1tsp
వెనిగర్: 1/2tsp
అజినామోటో: చిటికెడు
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. అన్నం ముందే వండి పెట్టుకొని ఉంటే సరి లేదంటే బియ్యంను బాగా శుభ్రం చేసి సరిపడా నీళ్ళు పోసి అన్నం వండుకోవాలి.
2. తర్వాత వండు కొన్న అన్నం ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి.
3. అంతలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. (వెజిటేబుల్స్ చాలా చిన్నగా కట్ చేసుకొంటే ఒకే సారి నూనెలోనే కట్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే కొంచెం పెద్ద కట్ చేసుకొంటే కొన్ని నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి).
4. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
5. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే వెజిటేబుల్స్ కూడా వేసి రెండు నిమిషాలు వేయించి లైట్ గా ఉప్పు చల్లి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించుకోవాలి.
6. వెజిటేబుల్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత గుడ్లును పగులగొట్టి అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఐదు నిమిషాల తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, పసుపు వేసి బాగా కలిపుతూ ఫ్రై చేయాల్సి ఉంటుంది.
7. ఇప్పుడు ఈ ఫ్రైడ్ మిశ్రమంలో చల్లారబెట్టుకొన్న అన్నం వేసి బాగా కలగలపాలి. చివరగా సోయా సాస్ మరియు వెనిగర్, అజినామాటో వేసి మరోసారి బాగా కలపాలి. తర్వాత కొత్తమిర తురుముతో గార్నిష్ చేసి హాట్ హాట్ గా సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.



Click it and Unblock the Notifications