Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి
వెజిటేబుల్ కడీ-రైస్&రోటీ కాంబినేషన్
కడీ, పాపులర్ ఇండియన్ డిష్. దీన్ని శెనగపిండి మరియు పుల్లని పెరుగుతో తయారుచేస్తారు. ఈ వంటలో వివిధ రకాలున్నాయి. అయితే, ఈ రోజు తయారుచేస్తున్న కడీ రిసిపికి కొన్ని రకాల వెజిటేబుల్స్ ను మిక్స్ చేసి మరింత ఆరోగ్యకరంగా మరియు రుచికరంగా తయారుచేస్తున్నాం..
ఈ వంటను తయారుచేయడానికి వింటర్ చాలా మంచి సమయం. ఎందుకంటే, కడీకి కావల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి . ఈ కడి రిసిపికి మీకు కావల్సిన వెజిటేబుల్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. మరి ఈ కడి వంటను ఎలా తయారుచేయాలో చేద్దాం..

కావల్సిన పదార్థాలు:
శనగపిండి : ½ cup
పుల్లని పెరుగు: 2cup
నీరు: 5-6 cups
ఆయిల్: 2tbsp
మెంతి ఆకులు/ మెంతులు: 1tsp
ఆవాలు : 1tsp
జీలకర్ర: 1tsp
ఇంగువ: ¼ tsp
కరివేపాకు: 10-12
ఎండుమిర్చి : 3-4
ఉల్లిపాయ: 1cup (చాలా సన్నగా కట్ చేసినవి)
గ్రీన్ బటానీలు-¼cup
బెండకాయలు: 6-8 (3-4 ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కాలీఫ్లవర్-¼cup(చిన్న చిన్న ప్లవర్స్ గా కట్ చేసుకోవాలి)
బంగాళాదుంప: ¼cup ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు : ½tsp
కారం : ½tsp
ధనియాల పొడి: 2tsp
పోపుకోసం:
ఆయిల్: 1tbsp
ఆవాలు ½tsp
కరివేపాకు: 8-10
కారం: ½tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పెరుగును బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో శెనగపిండి వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులో నీళ్ళు పోసి, జారుడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. మందగా ఉన్న పాన్ స్టై మీద పెట్టి, నూనె వేసి, వేడయ్యకా అందులో మెంతులు వేయాలి.
4. మెంతులు వేగుతుండగా, అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి మరియు కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి, వేయించుకోవాలి.
5. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారగానే, అందులో వెజిటేబుల్ ముక్కలు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
6. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాల పొడి వేసి మరో నిముషం వేగించుకోవాలి .
7. ఇప్పుడు ఈ మిశ్రమంలో పెరుగులో కలిపి పెట్టుకొన్న శెనగపిండి మిశ్రమాన్ని పోయాలి.
8. పెరుగు మిశ్రమాన్ని పోసిన తర్వాత, మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, తక్కువ మంట మీద అరగంట పాటు ఉడికించుకోవాలి.
9. నీరు సరిపడా మిక్స్ చేసుకోవాలి.
పోపుకోసం :
10. స్టౌమీద పాన్ పెట్టి, నూనె వేసి, వేడిచేయాలి.
11. తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి .
12. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడ వేసి, ఒక నిముషం వేగించిన తర్వాత ఈ పోపును ఉడుకుతున్న పెరుగు, వెజిటేబుల్ మిశ్రమంలో పోయాలి. అంతు వెజిటేబుల్ కడీ రిసిపి రెడీ. దీన్ని రైస్ లేదా చపాతీతో సర్వ్ చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications