గోధుమ దోస: హెల్తీ అండ్ టేస్టీ

మీరు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మీ దినచర్యను ప్రారంభించాలను కోరుకుంటున్నారా? అయితే ఈరోజు మీకోసం ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను పరిచయం చేస్తున్నాం. అది గోధుమ దోసె రిసిపి. ఈ వెజిటేరియన్ రిసిపి తయారుచేయడానికి కొద్దిగా సమయం పట్టినా దీన్ని తయారుచేసుకోవడం రుచిగా మరియు హెల్తీ కూడా .

పనిచేసే ఉద్యోగినులకు ఇది ఒక హెల్త్ ఫుల్ ఫిల్లింగ్ బ్రేక్ ఫాస్ట్ . పిల్లలకు కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి టిఫిన్ గా అందివ్వొచ్చు. దీన్ని తినడం వల్ల త్వరగా ఆకలి అనిపించదు కాబట్టి, బరువు తగ్గాలనుకొనే వారు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ పిండిని తయారుచేసేప్పుడు, పిండి మరీ చిక్కగా లేకుండా చూసుకోవాలి. చిక్కగా ఉండే దోసె ఉండలు కడుతుంది. కాబట్టి, పిండిని సాధ్యమైనంత పల్చగా వేసుకోవాలి. మరి దీన్ని ఎలా తయారుచేయాలి, దీనికి కావల్సిన పదార్థాలేంటో ఒకసారి చూద్దాం....

Whole Wheat Dosa Recipe

కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 2cups
కొబ్బరి : 2tbsp
నీళ్ళు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా

గోధుమ రవ్వ ఉప్మా-లో క్యాలరీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

తయారుచేయు విధానం:
1. ముందుగా గోధుమలను నీళ్ళలో వేసి బాగా కడగాలి. తర్వాత గోధుమల నుండి నీరు బాగా వంపేసి ఒక అరగంట గోధుమలు పక్కన పెడితే, నీరు మొత్తం కారిపోయి డ్రై అవుతాయి.

2. తర్వాత అరగంట తర్వాత ఈ గోధుమలను మిక్సీ జార్ లో వేసి రఫ్ గా పొడి చేసుకోవాలి.. మీ దోసె పౌడర్ రెడీ.

3. ఇప్పుడు దోసె పిండిని తయారుచేసుకోవాలి. పిండిని మిక్సీలో వేసి, పిండితో పాటు, కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్ళు పోసి దోసె పిండిలా గ్రైడ్ చేసుకోవాలి .

4. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వంపుకోని అందులో రుచికి సరిపడా ఉప్పువేసి బాగా మిక్స్ చేయాలి.

గోధుమల్లో మీకు తెలియని కొన్నిఉత్తమ ఆరోగ్యప్రయోజనాలు

5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె రాసి వేడి అయ్యాకో గోధుపిండిని దోసెలా వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి .

6. అంతే దోసె రెడీ అవ్వగానే గ్రీన్ చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయండి చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా కరివేపాకు చట్నీకి కూడా బాగుంటుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా ఆరోగ్యం మరియు రుచికరం.

Story first published: Saturday, June 13, 2015, 10:22 [IST]
Desktop Bottom Promotion