Latest Updates
-
Gas saving tips: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరి బూరెలు.. అరిసెలను మించే రుచితో.! -
ప్రపంచ దోమల నివారణ దినోత్సవం: దోమకాటు తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు.! -
Honey Rose: హనీరోజ్ పై నెటిజన్ల ప్రశంసలు..ఎందుకో చూడండి.. -
IAS Tukaram Mundhe: తుకారం ముండే..వ్యవస్థను వణికిస్తున్న రియల్ హీరో..నెటిజన్ల ప్రశంసల వర్షం -
ఆరోగ్యానికి, బలానికి బూస్టింగ్ ఫుడ్.. కమ్మనైన స్వీట్ కొబ్బరి రొట్టె.. రోటీ కంటే హెల్తీగా.! -
ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు.. ఇడ్లీలు, దోశలు ఎన్ని తింటారో లెక్కే ఉండదు! -
రక్తహీనతతో బాధపడేవారికి ఈ జ్యూస్ ఒక వరం.. డైలీ ఒక్క గ్లాస్ తాగితే చాలు.! -
షుగర్ వచ్చే ముందు మీ బాడీ చూపించే 5 సంకేతాలు ఏంటో తెలుసా! -
బుధ అస్తమయం: సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశుల వారికి గడ్డుకాలమే..ఆఫీసులో, వ్యాపారంలో ఊహించని కుట్రలు!
గుంటూరు స్టైల్ కాకరకాయ కారం ఇలా చేస్తే.. కూర మొత్తం ఒక్కరే తినేస్తారు, గ్యారెంటీ!
కాకరకాయ..ఈ పేరు వింటే చాలు చాలామంది అబ్బే అస్సలు వద్దు,నేనస్సలు తినను, నాకు నచ్చదు, అలవాటు లేదు అని అంటుంటారు. అయితే అలాంటి వాళ్లు కూడా ఒక్కసారి గుంటూరు స్టైల్ కాకరకాయ కారం రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలని బతిమాలి మరీ ఇంట్లో చేయించుకుంటారు. వేడి అన్నంతో అమృతంలా ఉంటుంది.
గుంటూరు స్టైల్ లో చేసే కాకరకాయ కారం స్పెషాలిటీ అది. అంత రుచికరంగా, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చేదు అనేది అస్సలు తగలదు. దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా ఈజీ. గుంటూరు స్టైల్ లో కాకరకాయ కారం మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కాకరకాయ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
-కాకరకాయలు
-నూనె
-చింతపండు
-ఉప్పు
-పసుపు
-కారం
-పల్లీలు
-ఎండుకొబ్బరి ముక్కలు
-పుట్నాల పప్పు
-పల్లీలు
-ధనియాలు
-జీలకర్ర
-ఎండుమిరపకాయలు
-వెల్లుల్లి
-తాలింపు గింజలు
ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు.. ఇడ్లీలు, దోశలు ఎన్ని తింటారో లెక్కే ఉండదు!
కాకరకాయ కారం తయారీ విధానం
-ముందుగా 300 గ్రాముల చిన్న సైజు కాకరకాయలను తీసుకోండి.
-కాకరకాయలను శుభ్రంగా కడిగి వాటిపైన గరుకుగా ఉండే వాటిని తొలగించండి. మరీ ఎక్కువగా తరుముకోనక్కర్లేదు. లైట్ గా తురిమితే చాలు.
-ఇప్పుడు కాకరకాయల తొడియలను కట్ చేసి కాయ మధ్యలో చాకుతో గాటులా పెట్టుకోండి. స్పూన్ లేదా చాకుతో కాయలోపలి గింజలను తీసి పక్కన ఉంచుకోండి. ఒకవేళ కాకరకాయలోని గింజలు ఎర్రగా అయ్యి ఉంటే ఆ కాయను వాడకూడదు.
-ఇప్పుడు గింజలు తీసేసిన కాకరకాయలను క ప్లేట్ లోకి తీసుకోండి. వీటిమీద అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి కాకరకాయ లోపల, బయట ఉప్పు, పసుపు బాగా పట్టేలా చేతులతో రుద్దించాలి. తర్వాత వీటిపై ప్లేట్ పెట్టి 20 నిమిషాల సేపు పక్కన ఉంచుకోండి. దీంతో కాకరకాయలోని నీరు ఊరుతుంది.
-ఇప్పుడు కాకరకాయ గింజలను చాకుతో వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి.
-20 నిమిషాల తర్వాత చూస్తే కాకరకాయలపై నీరు ఊరుతుంది. అప్పుడు చేత్తో ఆ కాయల నీరుని పిండేసి కాయలను ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల పల్లీలు(వేరుశెనగ గుళ్లు) వేసి మీడియం మీద బాగా వేయించాక అందులోనే 1 టేబుల్ స్పూన్ పుట్నాలు(శెనగపప్పు), 2 టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 8 గుంటూరు ఎండు మిరపకాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాక వీటన్నింటిని పక్కకు తీసుకొని పెట్టుకోండి.
-ఇప్పుడు అదే బాండీలో 4- 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో కాకరకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించాలి. బాగా వేగిన కాకరకాయలను ఓ ప్లేట్ లోకి తీసుకొని స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు వేయించిన పల్లీల మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే 2 రెబ్బల చింతపండు, 12 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీస్పూన్ల కారం, పావు టీస్పూన్ పసుపు కూడా వేసి మొత్తాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్!
-తర్వాత వేయించిన కాకరకాయల్లోకి గ్రైండ్ చేసిన పొడిని స్టఫ్ గా పెట్టుకోండి. మిగిలిన పొడిని పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో ఉన్న మిగిలిన ఆయిల్ లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో పోపు దినుసులు(తాలింపు గింజలు)అన్నింటిని అర టీస్పూన్ చొప్పున వేసి లైట్ గా వేగాక అందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి.
-ఉల్లిపాయలు సగం వరకు వేగాక అందులో 4 చితకొట్టిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ లైట్ గా కలర్ మారుతున్నప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ గింజలు వేసి మరో 3 నిమిషాలు వేయించాలి. కొంచెం ముదురు ఎరుపు రంగులోకి వచ్చేదాకా వేయించాక అందులో స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకొని 2 నిమిషాలు వేయించాలి.
-తర్వాత ముందుగా మిగిలిపోయిన కారం పొడి మిశ్రమాన్ని మొత్తాన్ని కాకరకాయల మీద చల్లుకొని మరో 2 నిమిషాలు మీడియం మంట మీద వేయిస్తే చాలు.
-అంతే గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం రెడీ. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. బయట పెట్టుకుంటే 3 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications