చుక్క నూనె, నెయ్యి లేకుండానే నోరూరించే రాజ్మా కర్రీ..ఈ ట్రిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Posted By:

సాధారణంగా రాజ్మా కర్రీ అనగానే నూనె, నెయ్యి పుష్కలంగా వేసి చేస్తారు. కానీ రుచి ఏమాత్రం తగ్గకుండా, ఒక్క చుక్క నూనె లేదా నెయ్యి వాడకుండా ఘుమఘుమలాడే, స్పైసీగా ఉండే రాజ్మా మసాలాను తయారు చేసుకోవచ్చు. ఆహారం విషయంలో శ్రద్ధ వహించేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్. నూనె లేకుండా రుచికరమైన రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాజ్మా తయారీకి కావలసిన పదార్థాలు

-6 గంటలు నానబెట్టిన రాజ్మా 250 గ్రాములు
-3 ఉల్లిపాయలు
-4 టమాటాలు
-2 పచ్చిమిరపకాయలు
-10 వెల్లుల్లి రెబ్బలు
-తురిమిన అల్లం
-2 దాల్చినచెక్కలు
-1 నల్ల యాలకు
-2 బిర్యానీ ఆకులు
-1 టీస్పూన్ జీలకర్ర
-1 టీస్పూన్ ఉప్పు
-పసుపు పొడి
-1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం
-2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి
-అర టీస్పూన్ గరం మసాలా
-3 కప్పుల నీరు

Zero Oil Creamy Rajma Curry Recipe in Telugu High Protein Low Calorie Dish for Fitness Lovers

కూరగాయల ప్యూరీ కోసం :

-గుమ్మడికాయ 100 గ్రాములు
-సొరకాయ 100 గ్రాములు
-క్యారెట్ 100 గ్రాములు
-వేడినీరు
-చిటికెడు వేయించిన కసూరి మెంతి పొడి
-గుప్పెడు కొత్తిమీర

రోజుకు 2 స్పూన్లు చాలు..చలికాలంలో ఉక్కులాంటి బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్,సీడ్స్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే..

రాజ్మా కర్రీ తయారీ విధానం

-ముందుగా రాజ్మాను(కిడ్నీ బీన్స్) శుభ్రంగా కడిగి 6-8 గంటల పాటు నానబెట్టండి. నానబెట్టిన కిడ్నీ బీన్స్‌ ను ప్రెషర్ కుక్కర్‌ లో వేసి, అందులో ముతకగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, చీల్చిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, తురిమిన అల్లం కలపండి. ఆ తర్వాత దాల్చినచెక్క, నల్ల యాలకులు, బిర్యానీ ఆకులు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కాశ్మీరీ కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి, తర్వాత మంట తగ్గించి 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి.

-కుక్కర్‌ లో రాజ్మా ఉడుకుతున్న సమయంలోనే, గుమ్మడికాయ, సొరకాయ, క్యారెట్ ముక్కలను ఒక స్టీమింగ్ ట్రేలో ఉంచి 12-15 నిమిషాల పాటు లేదా అవి పూర్తిగా మెత్తబడే వరకు ఆవిరి మీద ఉడికించండి. ఆ తర్వాత కూరగాయలను బయటకు తీసి, బ్లెండర్ ఉపయోగించి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోండి.

-కుక్కర్ ఆవిరి పూర్తిగా బయటకు పోయిన తర్వాత మూత తీసి, మెత్తబడిన టమాటా తొక్కలను,మొత్తం మసాలా దినుసులను తీసివేయండి. వెల్లుల్లి పూర్తిగా మెత్తబడి, కిడ్నీ బీన్స్ బాగా ఉడికాయని నిర్ధారించుకున్నాక తయారు చేసుకున్న కూరగాయల ప్యూరీని వేసి బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా వేడినీరు పోస్తూ, మధ్యమధ్యలో కలుపుతూ 10-12 నిమిషాల పాటు ఉడికించండి.

-చివరగా కొద్దిగా గరం మసాలా, వేయించిన కసూరి మెంతి పొడి, కొత్తిమీర ఆకులు వేసి బాగా కలపండి.

-అంతే నోరూరించే, ఆరోగ్యకరమైన నూనె లేని ప్రెషర్ కుక్కర్ రాజ్మా రెడీ. వేడివేడి అన్నం లేదా రోటీతో వడ్డించి ఆస్వాదించండి.

[ of 5 - Users]
Story first published: Monday, November 23, 2026, 12:14 [IST]
Desktop Bottom Promotion