For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బహుమతులు వద్దు - ఒక్కరోజు విశ్రాంతి చాలు!

ఈ నెల 13వ తేదీన ‘మదర్స్ డే’ అంటే... తల్లుల రోజు ఆచరించబడుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక తాజా సర్వే మేరకు తల్లులకుగల పెద్ద కోరిక మదర్స్ డే రోజున పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, తిరిగి మరోమారు శక్తి

By Super Admin
|

Mother’s Day: Mums want day off from everything
ఈ నెల 13వ తేదీన 'మదర్స్ డే’ అంటే... తల్లుల రోజు ఆచరించబడుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక తాజా సర్వే మేరకు తల్లులకుగల పెద్ద కోరిక మదర్స్ డే రోజున పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, తిరిగి మరోమారు శక్తి పొందాలని కోరుకుంటున్నారట. అన్ని భాధ్యతలనుండి స్వేఛ్చ పొంది దినమంతా హాయిగా విశ్రాంతి కావాలని వీరు కోరుతున్నారట.

ఈ సర్వే ని షుమారు 19 వేల మంది మహిళా తల్లులపై నిర్వహించారు. ప్రతి పదిమంది తల్లులలోను ఎనిమిదిమంది మదర్స్ డే రోజున హాయిగా నిద్రించాలని బయటకు ఎక్కడికి వెళ్ళ రాదని భావిస్తున్నారు. ప్రతి ముగ్గురు తల్లులలోను ఒకరు మాత్రం తాము ఏదేని వారాంతపు విశ్రాంతికి వెళ్ళాలని రహస్యంగా తెలిపారట.

మరి మీ పిల్లలు మీకు ఏ రకం బహుమతినివ్వాలని కోరుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు 48 శాతంమంది తల్లులు అన్నిటికంటే ఉత్తమంగా వారికి ఆ రోజంతా ఒక స్పా లేదా వ్యాయామ కేంద్రంలో గడపాలని వున్నట్లు తెలిపారట. అయితే, పురుషులు మాత్రం తమ పార్టనర్లకు పూవులు, నగలు ప్రధానంగా భావించారట. స్పా అనేది మూడవ స్ధానంలో పెట్టారట. మదర్స్ డే రోజున ఏ రకమైన బహుమానాలు వారికి అవసరపడతాయి అనే విషయం మరో సంస్ధ సర్వే చేస్తే అందులో కూడా కొంచెం ఇంచుమించుగా ఇవే రకమైన అభిప్రాయాలు తల్లులు వెలిబుచ్చారట.

ఒక మహిళ తనకు ఒక రోజు పూర్తి విశ్రాంతి కావాలని తెలిపినట్లు ప్రముఖ హఫింగ్టన్ వార్తా పత్రిక వెల్లడించింది. ట్విట్టర్ వినియోగదారులు సైతం తమకు ఒక రోజు విశ్రాంతి కావాలనే కోర్కెనే తెలిపారు. బహుమానాలు వద్దు, ప్రశాంతత కావాలి అంటున్నారు కొత్తగా ప్రస్తుత పరిస్ధితులలో తల్లులందరూ. మరి ఇంత బిజీ, బిజీగా వుండే షెడ్యూల్స్ లో తల్లులు కోరే 'ఒక్క రోజు విశ్రాంతి’ ఎంతో సమంజసం అనిపిస్తోంది.

English summary

Mother’s Day: Mums want day off from everything | మాతృదేవో భవ - తల్లులకు విశ్రాంతి కావాలి!

Moms' greatest wish for this year's Mother's Day, which is on May 13th, is a little rest and recuperation - ideally an entire day off from all responsibilities, new surveys have revealed.Even Twitter users were in sync with the desire for a day of rest. "No presents, just peace," MelbHab wrote.
Desktop Bottom Promotion