Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
భర్త అయి తండ్రి అవటమా? తండ్రి అయి భర్త అవటమా?

ఇక పిల్లల విషయానికి వస్తే, వారిని ఎవరు సాకాలి, ఎవరు స్నానం చేయించాలి? లేదా ఐస్ క్రీం కొనిపెట్టాలి? విద్యాబుద్ధులు, వంటి అంశాలు కూడా ఇక వుండవని భావిస్తారు. బహుశ ఈ రకంగా గతంలో వుండేది. గతంలో విడాకులంటే పిల్లలను తల్లుల సంరక్షణకు ఇచ్చేవారు. తండ్రి ఎపుడైనా వచ్చి చూడటం జరిగేది. అయితే ఆ రోజులు ఇపుడు మరి లేవని కుటుంబ చట్టాలు, నిబంధనలు మార్పు చేసుకుంటున్నాయని తల్లి లేదా తండ్రి అనే పదవి సమాన భాధ్యత కలిగి వుందని, సిడ్నీ యూనివర్శిటీ లా ప్రొఫెసర్ పేట్రిక్ పార్కిన్సన్ ఆయన వ్రాసిన ఫ్యామిలీ లా అండ్ ది ఇన్ డిస్సోల్యుబులిటీ ఆఫ్ పేరెంట్ హుడ్ అనే పుస్తకంలో చెపుతారు.
పాశ్చాత్య దేశాలలో ఈ కుటుంబ చట్టాలను గురించి అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. విడాకుల చట్టానికి సంస్కరణలు 1960లు 1970 లలో కూడా చేయబడ్డాయి. ఒక సారి డైవోర్సు తీసుకొని ఆస్తులు, పిల్లలు విభజించబడితే, గతంలో అది ఒక ఏ బాదరబందీ లేని విధంగా వుండేది. అయితే, ఇపుడు పరిస్ధితులు మారాయి. పెళ్ళిళ్ళు అయి విడాకులు తీసుకున్నా లేక, కలసి వుండి విడాకులు తీసుకున్నా సంబంధం పూర్తిగా తెగిపోవటం లేదని, ఇంకా అతనికి లేదా ఆమెకు అన్నింటిలోను పరస్పర సంప్రదింపులు వుంటూనే వున్నయని, వున్న సంబంధమే మరోమారు పునర్నిర్మాణం చేయబడుతోందని ఈ రీసెర్చర్లుచెపుతున్నారు.
డైవోర్సు పొందినప్పటికి వివాహజీవితం కొనసాగుతున్నట్లే వుందని కూడా కొన్ని జంటలు భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, వివాహ జీవితం సుఖంగా లేనివారు మాత్రం, డైవోర్సు ను పునర్నిర్మాణ సంబంధంగా చూడటం లేదని, సంబంధం వదిలించుకొని వేరే ప్రదేశాలకు కూడా వలసపోవటానికి ఇష్టపడుతున్నారని పార్కిన్సన్ తెలిపారు. అయితే, పిల్లలు వున్నట్లయితే, వివాహజీవితం రద్దయినట్లేనని భావించినప్పటికి, ఒక తల్లిగా లేదా తండ్రిగా మాత్రం కొనసాగుతూనే వున్నారని, పిల్లల బాగోగులు పట్టించుకుంటూనే వున్నారని వీరు తెలిపారు.
కుటుంబ కోర్టులలో జరిగే ఈ విడాకుల యుద్ధాలకు అసలు సమస్య తండ్రి. గతంలో తండ్రి పూర్తిగా విడాకుల తర్వాత అసలు వుండేవాడు కాదు. అయితే, విడాకులు కొంతమంది తండ్రులను మరోమారు వారి ప్రాధాన్యతలు ఆలోచించుకునేలా చేస్తున్నాయి. తమ పిల్లలతో సంబంధాలు కొనసాగేలా చేస్తున్నాయి. దానికి కారణం తండ్రులకు పిల్లల జీవితాలలో తాము వేరు పడినప్పటికి జోక్యం కోరుతూనే వున్నారు. ఈప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా నడుస్తూనే వుంది.
తండ్రులు, విడాకులు పొందినప్పటికి, తమ పిల్లలతో కొనసాగటానికి కోరుతున్నారు. పిల్లలు కూడా తల్లుల పూర్తి భాధ్యతనే కాక తండ్రుల జోక్యం కూడా కోరుతున్నారు. తండ్రులు ఈ రకంగా ముందుకు వచ్చి తమ పిల్లల భాధ్యతలు చేపడుతూండటంతో, విడాకుల శాతం అమెరికాలో 3 శాతం తగ్గినట్లు గణాంకాలు చెపుతున్నాయని అమెరికా రీసెర్చర్లు తెలిపారు.
వైవాహిక జీవితంలో జంటలు విడాకులు పొంది తమ సంబంధం వేరైందని భావించినప్పటికి, పిల్లలు వున్నట్లయితే, తండ్రులు వారి విద్యాబుద్ధులు ఎప్పటికపుడు విచారిస్తూ, భాధ్యతలు చేపడుతున్నారని పిల్లల కారణంగా కూడా జంటలు మరోసారి కలిసి సహజీవనం చేసే అవకావాలుంటున్నాయని వీరు భావిస్తున్నారు. మరోసారి తాజాగా సంబంధాలను ఏర్పరచుకోవడం, కొనసాగించడం వంటివి విడాకులు పొందిన జంటలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
