Latest Updates
-
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.!
మీ ప్రేమికుడు స్వార్ధపరుడా?

మీ ప్రేయసి లేదా ప్రియుడు స్వార్ధపరుడు అనటానికి 5 గుర్తులు
1. అతడు మీతో ఎల్లపుడూ ఆహారం పంచుకోడు. మీరు ఒక రెస్టరెంట్ కు వెళతారు. అక్కడ ఇద్దరూ ఇష్టమైన డిష్ లు ఆర్డర్ చేస్తారు. అయితే రుచి చూడమంటూ ఒకరికొకరు వాటిని బదలాయించుకుంటారు. అయితే, స్వార్ధపరుడైన లవర్ మాత్రం ఈ పని చేయడు.
2. అతడు లేదా ఆమె మీ డిన్నర్ కొరకు వేచి వుండరు. డిన్నర్ కలసి భోజనంచేయటం ఎంతో రొమాంటిక్. కాని స్వార్ధపూరిత పార్టనర్ మీరు ఇంటికి చేరే సరికి డిన్నర్ ముగించి నిద్రపోతారు. ఇక మీరు ఒంటరిగా కూర్చొని హేపీ అనుభవించాల్సిందే.
3. స్వార్ధపూరత పార్టనర్ మీ సౌకర్యం కొరకు తన ప్రణాళికలు మార్చుకోడు. మనలో చాలామంది మన ఇష్టులకొరకు ఎన్నో మార్పులు చేసుకుంటాం. కాని స్వార్ధపరుడైతే, తన ప్రణాళికలు మీ కొరకు మార్చుకోడు. మీకు బయటి తిండ్లు పడవని చెప్పినప్పటికి ఒత్తిడి చేసి తినిపిస్తాడు.
4. మీరు జబ్బు పడినపుడు మీ పార్టనర్ ఎంత స్వార్ధపరుడో తెలిసిపోతుంది. జబ్బుపడిన మిమ్మల్ని వదిలిపెట్టి తన కార్యక్రమాలను చేసుకుంటాడు. పనికి సెలవు పెట్టడు. డిన్నర్ పార్టీలకు వెళ్ళిపోతాడు. మరల వచ్చినపుడు కూడా మీ గురించిన సమాచారం పెద్దగా తెలుసుకోడు.
5. మీరు కనుక స్వార్ధపరుడితో ప్రేమలో వుంటే, అతడు లేదా ఆమె మీకు సహాయం చేయరు. అతడు మిమ్మల్ని ఆఫీస్ నుండి పిక్ అప్ చేస్తాడని, లేదా డ్రాప్ చేస్తాడని ఆశించకండి. మీరు అర్ధరాత్రి బస్ లేక నిలబడిపోయను అన్నప్పటికి ఏదో ఒక రకంగా ఇంటికి వచ్చేయ్ అంటాడే కాని తననుండి ప్రయత్నం పెట్టడు.
చాలామంది జంటలకు ఈ రకమైనస్వభావాలతో సర్దుకుపోవలసి వస్తుంది. వీటిలో రెండిటికి మించితే మాత్రం అతను స్వార్ధపరుడిగా గుర్తించండి. అయిదు గుణాలు అతనికి వుంటే, మీరు అతనిని వదిలేయటం మంచిది.



Click it and Unblock the Notifications
