Latest Updates
-
శుక్ర గ్రహ గోచారం.. ఈ మూడు రాశుల వారికి కెరీర్లో కొత్త అవకాశాలు.! -
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.! -
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్గా సాగేందుకు టిప్స్.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.! -
మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం! -
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.! -
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు!
మంచి భర్త అనిపించుకోవాలంటే ఏం చేయాలి...!

1. ఇంటికి సరిపడా సరుకులు అన్నీ మగవా రేతేనవసరం లేదు. కొన్ని సార్లు ఆడవారికి కూడా అవకాశం కల్పించండి. అవసరం అనుకుంటే సరుకులలో ఆవిడ డబ్బులు మిగిల్చారనుకోండి... ఆప్యాయంగా ఆ డబ్బులు ఆమెనే ఖర్చు చేసుకోమని చెప్పండి.
2. అప్పుడప్పుడు ఆమె ఆరోగ్యం గురించి అడుగుతుండండి. ఆమె మూడ్ ను బట్టి శృంగార కార్యకలాపాలలో పాల్గొనాలి. అంతేగానీ ఆమెకు ఇష్టం లేకుండా ఉన్నప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టొద్దు.
3. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి షాపింగ్ లకు... సినిమాలకు లేదా దగ్గరలో ఉన్న ఏ పబ్లిక్ పార్క్ కో... కనీసం ఏ గుడికో వెళ్లడం మరిచిపోకండి.
4. ఇద్దరూ... కలిసి ఇంటి సమస్యలేమైనా ఉంటే కలిసి చర్చించుకోవాలి. లేదా ఏదైనా ఇంట్లో చేయబోయే ఫంక్షన్ గురించో... ఏమీ లేకపోతే ఇద్దరూ మీ తీయని అనుభూతులను ఆప్యాయంగా ఒకరికొకరు చెప్పుకోవాలి.
5. పబ్లిక్ స్థలంలో అంతా చూస్తున్నప్పుడు మీరు మీ భార్య చెయ్యిపట్టుకుని నడవండి. లేదా... ఆమె భుజంపై చెయ్యి వేసి నడవండి. మీ భార్యలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
6. చీటికిమాటికీ ఆమెను చికాకుపెట్టకండి. ఒక వేళ ఆమె చికాకుగా ఉన్నప్పుడు తొందరపడి ఏదైనా మాట అన్నా... టేకిట్ ఈజీగా తీసుకోండి. ఆ తర్వాత తప్పుతెలుసుకుని ఆమే బాధపడుతుంది.
7. ఇంటి పనుల్లో అప్పుడప్పుడు ఆమెకు ఇష్టం అయితే మీరు కూడా వచ్చిరాని వంటలు ఎప్పుడైనా సెలవు రోజుల్లో ప్రాక్టీస్ చేయండి.
8. ఇంటిని శుభ్రం చేయడంలో ఆమెకు సహకరించండి. సాయంత్ర ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఏవైనా చిన్ని చిన్న పనులు చేసి పెట్టండి. అలాగే వీకెండ్స్ లో కూడా మీకు చేతనైన సహాయం చేస్తూ పూర్తిగా ఆమెతో గడపడానికి ట్రై చేయండి. ఏవైనా మీ ఆఫీస్ కు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా మీరు సెపరేట్ గా ఏదైనా ర్యాక్ లో పెట్టుకోండి. చీటికీమాటికీ అవి, ఇవీ కనబడటంలేదని ఆమెను సతాయించకండి.
9. కనీసం అప్పుడప్పుడైనా నీ లాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అని మెచ్చుకోండి... ఇలా చేస్తే మీరు బంగారం లాంటి భర్త అని తప్పక అనిపించుకుంటారు. ఇంక ఆలస్యమెందుకు ఈ రోజు నుంచే ఈ సూత్రాలు పాటించండి.
10. నెలకి ఒకసారైనా ఇద్దరూ కలిసి ఏదైనా రెస్టారెంటుకో... మంచి హోటల్ కో వెళ్లాలి. అక్కడ ఆమెకు ఇష్టమైనదానినే మీరు కూడా ఆర్డర్ ఇచ్చి... ఇద్దరూ ముచ్చట్లు చెప్పు కుంటూ కాలక్షేపం చేయాలి.
11. నలుగురిలో భార్యను కించపరిచినట్లు మాట్లాడకండి. అవసరం అయితే భార్య సహకారంతోనే మీరు ఇంతవారయ్యారని తెలియజెప్పండి.
12. నగలు, చీరలు కావాలని మంకుపట్టుపట్టే ఆడవారికి మీ ఆదాయం ఎంతో వివరంగా తెలియజేయండి. సాధ్యమైనంతవరకూ ఆమెను కన్విన్స్ చేయండి.
13. అప్పుడప్పుడు ఆమె చేసిన పనులకు గుర్తింపుగా ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇవ్వండి. అంతకంటే ఆమె కష్టపడి చేసిన పనిని కనీసం మెచ్చుకోవడానికైనా ప్రయత్నించండి. ఆమెను ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవకండి. ఆమెకు మీకు ఇష్టమైన నిక్ నేమ్ తో పిలువండి ఎంత కోపంలో ఉన్నా మీరు పిలవగానే కరిగిపోతుంది. అలాగే ఆమెను అడగ కుండానే ఆమెకు ఇష్టమైనవి అప్పుడప్పుడు తెచ్చి సర్ఫ్రైజ్ చేయాలి. మీరు గిప్ట్ ఇవ్వడానికి సందర్భమే అవసరం లేదు మీరు ఎప్పుడు ఏ గిప్ట్ ఇచ్చిని ఆమెకు అదే ఓ ప్రత్యేకమైన సందర్భంగానే ఫీల్ అవుతుంది.
14. ఎంత సంపాదిస్తున్నారో... ఏ ఉద్యోగం చేస్తున్నారో మీ భార్యకు అవసరం లేకున్నా తెలియజేయండి. ఒక్కోక్కో సందర్భంలో మీ లక్ష్యం ఏమిటో వివరించండి. మీకు ఇష్టమైన రుచులు, మీకిష్టమైన స్టోరీలను ఆమెతో షేర్ చేసుకోండి. మీ సమస్యలను కూడా వారి పంచుకోండి. మీ సమస్యలను ఆమె తీర్చలేకపోవచ్చు అయితే వాటికి ఇచ్చే సలహాలను ఇష్టమైతే స్వీకరించవచ్చు.
15. ముఖ్యంగా ఆడవారు మెన్సెస్ కు మందు... చాలా చిరాకుగా ఉంటారు. అటువంటప్పుడు వారికి భరించలేనంత చికాకు ఉంటుంది. ఆ సమయంలో వాళ్లను కదిలించకుండా ఉండటమే మంచిది. అవసరమైతే ఆమెకు ఆ సమయంలో ఇంటిపనులలో మీరు పూర్తిగా సహకరించాలి. ఆ మూడు రోజులు ఆమెకు పూర్తి రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఆమె లేదా మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. ఏ చిన్న తలనొప్పి నుండి మరే సమస్య వచ్చిన ఆమె పట్ల జాలి చూపండి. నీకు నేనున్నాన్న దైర్యం ఆమెకు ఇవ్వండి.



Click it and Unblock the Notifications