Latest Updates
-
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
సానుకూలంగా ఆలోచించడం ఎలా?
సానుకూల ఆలోచన కేవలం "జీవించే కళ" (ఆర్ట్ ఆఫ్ లివింగ్) బోధించే గురువులకు మాత్రమే సొంతం కాదు.
ఇది అందరికీ అందుబాటులో ఉంది. కీడునెంచు స్వభావము యొక్క విత్తనాలు సులభంగా మనుషుల మనస్సులలో పెరుగుతున్న ఈ రోజుల్లో, సానుకూల ఆలోచన ఒక్కటే పట్టుకు దొరికే ఆధారం. ఇక్కడ మీరు సానుకూల ఆలోచనపరుడుగా మారడానికి కొన్ని చర్యలు అందిస్తున్నాం:

1. మీ వైఖరిని నియంత్రించుకోండి
కొన్నిసార్లు జాగరూకతో మీరు ప్రతికూలంగా ఆలోచించకూడదని, మీ చుట్టూ ఉన్న వ్యతిరేకతను జయించాలనే నిర్ణయం తీసుకోవడం, జీవితం పట్ల మీ దృక్పథం రూపొందించడంలో సహాయ పడుతుంది. ప్రజలు తరచుగా ఇతరులకు లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితులకు వారి జీవితాన్ని శాసించే అవకాశం ఇచ్చి తప్పు చేస్తారు. మీరు దీన్ని ఎలాగైనా నివారించి, కీలకమైన నిర్ణయాలు సొంతంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి.
2. ధ్యానం చేయండి
పురాతన కాలపు సన్యాసులు మోక్షాన్ని కోరి శతాబ్దాల తరబడి ధ్యానం చేశారు. అందువలన , ధ్యానం మనతో మనల్ని అనుసంధానించడానికి ఒక ప్రాచీన ఉపాయం. ధ్యాన సమయంలో, మనస్సు ఒక నిర్దిష్ట ఆలోచన స్రవంతి మీద దృష్టి పెడితే, అది ఒక నిర్దిష్ట రకమైన శక్తిని ప్రసరించటం మొదలపెడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ శక్తి, ప్రజలకు జీవితంలో సమస్యలును ఎదుర్కోవడానికి, వాటిని అధిగమించడానికి సన్నద్ధం చేస్తుంది. ప్రతి రోజు 10 నిమిషాలు ధ్యానం చెయ్యడానికి ప్రయత్నించండి. ఎటువంటి భంగం కలగని ఒక చీకటి గదిని ఎంచుకోండి, మీ కళ్లు మూసివేసి, బలంగా ఊపిరి తీసుకోండి. మీ మనసులోంచి అన్ని ఆలోచనలను తొలగించడానికి ప్రయత్నించండి. ఇది ప్రారంభంలో మీకు కష్టంగా అనిపిస్తుంది, అయితే కొంత అభ్యాసం తర్వాత, చాలా సులభతరం అవుతుంది.
3. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులను కలుసుకోండి
ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి విశ్వ సామూహిక ఆలోచన ప్రక్రియకు తోడ్పడే ఏదో ఒక విషయం కలిగి ఉంటాడు. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులను కలుసుకోవడం వల్ల, మీ ఆలోచనలు మరియు లక్ష్యాలు ఒక సానుకూల దిశలో ముందుకు వెళతాయి, ప్రతికూల భావాలు ఉన్న వ్యక్తులు మీ జీవితం నుండి సానుకూల శక్తిని మొత్తం హరించేస్తారు. సానుకూలత ప్రసరించే వ్యక్తుల సాహచర్యం కోరుకోవటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు.
4. మీ లక్ష్యాల వైపు నడవండి
మీ హృదయ ఆశయాలకు అనుగుణంగా ఉండే లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిపై నమ్మకం ఉంచి, వాటిని సాధించడానికి కృషి చేయండి. ప్రపంచం ఎన్నో తాజా దృక్కోణాలు అందించడానికి సిద్ధంగా ఉంది. మీరు బహిరంగ మరియు సానుకూల మనసుతో, అటువంటి తాజా దృక్కోణాలు స్వీకరిస్తే మీ జీవితం చక్కటి మలుపు తిరుగుతుంది. కష్టపడి పని చేసి, మీ లక్ష్యాలను చేరుకనే దిశగా అడుగులు వేయండి. ఒకసారి మీరు వాటిని సాధించిన తర్వాత, సరికొత్త సాహసలకు పూనుకోవడానికి ప్రేరణగా ఉంటుంది. సాధించిన ప్రతి లక్ష్యం, అది ఎంత చిన్నదయినా, మీకు శక్తిని మరియు మీ సామర్థ్యాలపై నమ్మకానికి కలిగిస్తుంది.
5. మీ మానసిక నిర్మాణాన్నిమార్చుకోండి
మీరు జీవితంలోని కొన్ని సందర్భాలలో స్పందించే తీరు మీ మొత్తం ఆలోచన సామర్ధ్యాల తయారీలో తేడా చూపిస్తుంది. ఇబ్బందులకు సానుకూలంగా స్పందించడం కష్టకాలాన్ని భరించే బలం ఇస్తుంది. అయితే, ప్రతికూల ఆలోచనా ప్రక్రియ, కష్టాలను ఉన్నవాటి కంటే కంటే పెద్దవిగా చూపిస్తుంది. మీ దృక్పథంలో మార్పు మీరు ప్రపంచాన్ని కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. మీరు జీవితంలో ఉన్నదని ఎన్నడూ భావించని అందాన్ని అది చూపించగలదు.
6. మీ ప్రవర్తనను ప్రశ్నించుకోండి
ఎటువంటి మార్పునైనా ప్రతిఘటించడం మనిషి సహజ లక్షణం. అయితే, మీరు వెనక్కి తిరిగి, మీ ప్రతిఘటనకు కారణాలు వెతికితే, మీరు ముందు ఊహించినదాని కంటే చాలా చిన్న సమస్యగా కనిపిస్తుంది.. అందువలన, మీ ఉద్దేశాలను మీరు ప్రశ్నించుకోవడం, మీ రక్షణాత్మకతను తొలగించి, మీరు మరిన్ని అనుభవాలు పొందే అవకాశాలకు సిద్ధంగా ఉండేందుకు సహాయం చేస్తుంది.
సానుకూలత సానుకూలతను ఆకర్షిస్తుంది , ప్రతికూలత ప్రతికూలతను మాత్రమే ఆకర్షిస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. అందువలన, సానుకూలంగా ఆలోచించడం ద్వారా, మీరు కొత్త అవకాశాలను మరియు అనుభవాలను ఆహ్వానిస్తూ, మీ జీవితాన్ని మరింత నిండుగా గడపడానికి దోహదపడతారు.



Click it and Unblock the Notifications