Latest Updates
-
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు? -
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.! -
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.!
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి!
అవతలి వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నారు? నన్ను ఇష్టపడుతున్నారా? లేక నాపై ఏమైనా పగ పెంచుకున్నారా?..ఈ ఆలోచన మనలో చాలా మందిని నిత్యం తొలిచేస్తుంటుంది. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఇతరులు తమని ఇష్టపడాలని, మెచ్చుకోవాలని మనసారా కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు మనకు తెలియకుండానే చేసే చిన్న చిన్న ప్రవర్తనాపరమైన పొరపాట్లు, మనం అడిగే కొన్ని ప్రశ్నలు ఎదుటివారి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి.

మనం సరదాగా, లేదా ఆప్యాయతతో అడిగే మాటలే వారిలో మన పట్ల వ్యతిరేకతను, కోపాన్ని పెంచుతాయి. మన మాట తీరు వల్లే చాలా బంధాలు దూరమవుతుంటాయి. ఎదుటివారికి చికాకు తెప్పించి, వారిని మానసికంగా బాధపెట్టే ఆ ప్రశ్నలు ఏమిటో ఇక్కడ చూడండి
పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావ్?
పైకి చూడటానికి ఇది చాలా సాధారణమైన ప్రశ్నలా కనిపిస్తుంది. స్నేహితులు సరదాగా ఆటపట్టిస్తూ అడుగుతుంటారు. ఇక కుటుంబంలోని పెద్దలు, బంధువులు కలిసినప్పుడల్లా పలకరింపులో భాగంగా ఈ ప్రశ్నను సంధిస్తుంటారు. కానీ, ఒకే ప్రశ్నను పదే పదే వినడం వల్ల ఎదుటి వ్యక్తికి ఎంతో విసుగు, చికాకు కలుగుతాయి. ఎందుకంటే, పెళ్లి చేసుకోకపోవడానికి వారి జీవితంలో అనేక కారణాలు ఉండొచ్చు. కుటుంబ బాధ్యతలు, కెరీర్, లేదా ఇతరులతో సులభంగా పంచుకోలేని మరెన్నో వ్యక్తిగత సమస్యలు వారిని వెంటాడుతుండవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలతో వారిని ఇరుకున పెట్టకపోవడమే మంచిది.
ఇంటికి కొత్త అతిథి ఎప్పుడు వస్తున్నారు?
వివాహం ఎంత వ్యక్తిగతమైనదో, పిల్లలను కనడం అనేది భార్యాభర్తల మధ్య అంతే సున్నితమైన, అత్యంత వ్యక్తిగతమైన విషయం. పిల్లలు కలగకపోవడానికి శారీరక లోపాల నుండి ఆర్థిక ఇబ్బందుల వరకు అనేక కారణాలు ఉండవచ్చు. కొందరు తమ మానసిక బాధను బయటకు చెప్పుకోలేక అంతర్ముఖులుగా మారిపోతారు. అలాంటి వారిని చూసి పిల్లలు ఎప్పుడు? అని అడిగితే వారు పైకి చిరునవ్వుతో సమాధానం చెప్పినా, లోపల మాత్రం ఆ మాట వారి గుండెను కోసేస్తుంది. వారిని మానసికంగా తీవ్రంగా కుంగదీస్తుంది.

నీ జీతం,నీ సంపాదన ఎంత?
చాలా మందికి ఎదుటి వారి ఆర్థిక స్థోమత తెలుసుకోవాలన్న విపరీతమైన కుతూహలం ఉంటుంది. కానీ, తెలియకుండానే అడిగే ఈ ప్రశ్న అవతలి వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు కేవలం డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని చాలామంది భావిస్తుంటారు. కాబట్టి, సంపాదన తక్కువగా ఉన్నవారు ఈ ప్రశ్న ఎదురైనప్పుడు తీవ్రమైన న్యూనతా భావానికి (Insecurity) గురవుతారు. అంతేకాకుండా, ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక, దాటవేయలేక వారు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు.
ఏంటి.. ఇంత సన్నగా,లావుగా,నల్లగా అయిపోయావ్?
చాలా రోజులకు ఎవరినైనా కలిసినప్పుడు కుశలప్రశ్నలు అడగాల్సింది పోయి, నేరుగా వారి శారీరక మార్పుల గురించి కామెంట్లు చేయడం చాలామందికి అలవాటు. వాస్తవానికి ప్రతి ఒక్కరూ తమ రూపం గురించి ఎప్పుడూ స్పృహలోనే ఉంటారు. అనారోగ్యం వల్లో, మానసిక ఒత్తిడి వల్లో వారి శరీరంలో మార్పులు రావచ్చు. అలాంటి సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడిగితే, అది వారి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. సామాజిక సంబంధాలలో అసౌకర్యాన్ని పెంచి వారు నలుగురిలో కలవడానికి కూడా భయపడేలా చేస్తుంది.
నిపుణులు ఏమంటున్నారంటే..
మనం మనసులో ఏమనుకుంటున్నాం అనేదాని కంటే, మన నోటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి అనేదే ముఖ్యమని సంబంధాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మీ ఉద్దేశం ఎంత మంచిదైనా సరే, మీ మాట ఎదుటివారి మనసును నొప్పించేలా ఉంటే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆప్యాయత పేరుతో ఇతరుల సున్నితమైన, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
