Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే!
వివాహ బంధం నమ్మకం అనే పునాదిపైనే నిలబడుతుంది. ఏదైనా తప్పును దాచడానికి చెప్పే అబద్ధం ఎప్పటికైనా బంధాన్ని బలి తీసుకుంటుంది. కానీ వాస్తవం ఏమిటంటే.. కొన్నిసార్లు కఠినమైన నిజాల కంటే, చిన్న చిన్న తీపి అబద్ధాలే బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి.

అతిగా నిజాయితీగా ఉండటం కూడా ఒక్కోసారి ఎదుటివారి మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. మీ భాగస్వామి ముఖంలో చిరునవ్వులు పూయించడానికి, వారిని మానసిక క్షోభ నుండి కాపాడటానికి అప్పుడప్పుడు చెప్పే చిన్నపాటి అబద్ధాల వల్ల ఎలాంటి నష్టమూ లేదు. అయితే ఈ అబద్ధాలు మీ తప్పులను, మోసాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రం వాడకూడదు. మీ బంధాన్ని మరింత మధురంగా మార్చే ఆ అందమైన అబద్ధాలు ఏంటో ఇక్కడ చూడండి.
బహుమతులను మనస్ఫూర్తిగా అభినందించడం
మీ భాగస్వామి ఎంతో ఇష్టంగా, సర్ ప్రైజ్ చేస్తూ మీకు ఒక బహుమతి ఇచ్చారంటే.. అందులో వారి ప్రేమ, సమయం దాగి ఉంటాయి. ఒకవేళ ఆ వస్తువు లేదా దాని రంగు మీకు అస్సలు నచ్చకపోయినా, ఆ విషయాన్ని మొహం మీదే చెప్పేయకండి. అది వారి ఉత్సాహాన్ని నీరుగారుస్తుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది, నా జీవితంలో దొరికిన బెస్ట్ గిఫ్ట్ ఇది అని చెప్పి చూడండి. అప్పుడు వారి కళ్లలో కనిపించే ఆనందం ముందు మీకసలు ఆ బహుమతితో పనే ఉండదు.
మనోధైర్యాన్ని పెంచే రెండు మాటలు
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీసు, ఇల్లు రెండూ బ్యాలెన్స్ చేయడం ఎవరికైనా కష్టమే. కొన్నిసార్లు వారు ఒత్తిడికి లోనై బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోవచ్చు. అలాంటి సమయంలో వారి తప్పులు ఎంచకుండా..నువ్వు చాలా గ్రేట్, అన్నిటినీ ఎంత పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్నావో అని అబద్ధం చెప్పండి. ఈ ఒక్క మాట వారిలో కొండంత ధైర్యాన్ని, రెట్టింపు శక్తిని నింపుతుంది.
వంటలో ప్రేమను రుచి చూడండి
మీ కోసం మీ భాగస్వామి ఎంతో ప్రేమగా, కష్టపడి వంట చేసినప్పుడు అందులో రుచి కొంచెం అటూ ఇటూ అవ్వొచ్చు. ఉప్పు తగ్గడమో, కారం పెరగడమో జరగొచ్చు. దానిని పట్టుకుని విమర్శించకుండా, వంట అద్భుతంగా ఉందిఅని ప్రశంసించండి. వారు పడిన శ్రమను గుర్తించి మీరు చెప్పే ఈ అబద్ధం.. వారికి మీరు చూపిస్తున్న గొప్ప గౌరవం.

రూపాన్ని, అలంకరణను మెచ్చుకోవడం
ఎవరైనా కొత్తగా రెడీ అయినప్పుడు తమ భాగస్వామి మెచ్చుకోవాలని ఆరాటపడతారు. మీ భాగస్వామి వేసుకున్న కొత్త డ్రెస్ లేదా చేయించుకున్న కొత్త హెయిర్ స్టైల్ మీకు నచ్చకపోయినా, ఆ క్షణంలో వారిని ఎగతాళి చేయకండి. చాలా అందంగా ఉన్నావు అని పొగడండి. ఆ తర్వాత, సరదాగా మాట్లాడుతున్నప్పుడు, ఆ బ్లూ కలర్ డ్రెస్ లో అయితే నువ్వు ఇంకా అద్భుతంగా ఉంటావు అని సున్నితంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి.
నిన్ను మిస్ అవుతున్నాను అనే మాయాజాలం
పనుల్లో పడిపోయి ఎప్పుడూ ఒకరినొకరు తలుచుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ తీరిక దొరికినప్పుడు ఫోన్ చేసి నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పండి. ఈ చిన్న అబద్ధం లేదా మాట.. వారు మీకు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. కొన్నిసార్లు పెద్ద పెద్ద గొడవలను కూడా ఈ ఒక్క మాట ఇట్టే మాయం చేస్తుంది.



Click it and Unblock the Notifications
