Latest Updates
-
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా..
ప్రేమ పేరిట జైలు జీవితం గడుపుతున్నారా? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే అది విషపూరిత బంధమే!
భార్యాభర్తల బంధం లేదా ప్రేమికుల మధ్య అనుబంధం అనేది ఎంతో పవిత్రమైనది, ఆనందాన్ని ఇచ్చేది. కానీ ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఇద్దరి మధ్య అకస్మాత్తుగా ఊహించని దూరం పెరుగుతుందంటే దానికి ప్రధాన కారణం ఆ బంధంలో విషం(టాక్సిసిటీ) నిండటమే. చాలామంది టాక్సిక్ సంబంధం అనగానే కేవలం చేయి చేసుకోవడం, శారీరకంగా హింసించడం మాత్రమే అని పొరబడుతుంటారు. కానీ అది నిజం కాదు. కంటికి కనిపించని మానసిక హింస మనిషిని లోలోపల మరింత దారుణంగా కుంగదీస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీరు కూడా ఇలాంటి విషపూరిత వాతావరణంలో బతుకుతున్నారా? అయితే మీ భాగస్వామి ప్రవర్తనలో కనిపించే కొన్ని ప్రమాద ఘంటికలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకండి.

చిన్న విషయాలకే చిందులు తొక్కడం
ప్రేమ ఉన్న చోట అప్పుడప్పుడూ కోపం ఉండటం సహజమే. కానీ ప్రతి చిన్న విషయానికే విపరీతంగా అరిచి గీపెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. మీ భాగస్వామి ఊరికే కోపగించుకుంటూ ఉంటే, ఆ కోపాన్ని లేదా వారి అరుపులను ఎదుర్కోలేక మీరు ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంటే.. అది ఆరోగ్యకరమైన బంధం కాదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతకడం అనేది మానసిక హింస కిందకే వస్తుంది. ఇలాంటి బంధంలో మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉండలేరని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిదానికీ మిమ్మల్నే నిందించడం
ఏదైనా తప్పు జరిగినప్పుడు దానిని అంగీకరించి సరిదిద్దుకోవడం ఉత్తమమైన వ్యక్తిత్వం. కానీ మీ భాగస్వామి ఎన్నడూ తమ తప్పులకు బాధ్యత తీసుకోకుండా, ప్రతి చిన్న లోపానికీ మిమ్మల్నే నిందిస్తున్నారా? నువ్వు ఇలా చేయడం వల్లే నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది అంటూ తమ తప్పును కూడా మీ ఖాతాలోనే వేస్తున్నారా? దీన్నే సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారు. క్రమంగా మీరు మీపైనే నమ్మకాన్ని కోల్పోయేలా చేసే అత్యంత ప్రమాదకరమైన, భావోద్వేగపరమైన విషపూరిత ప్రవర్తన ఇదని నిపుణులు తెలిపారు.
మనసు విప్పి మాట్లాడకపోవడం
ఏ బంధానికైనా కమ్యూనికేషన్ అనేది పునాది లాంటిది. మీ భాగస్వామి తమ భవిష్యత్ ప్రణాళికల గురించి, ఆఫీసులో జరిగిన విషయాల గురించి లేదా దైనందిన జీవితంలోని చిన్న చిన్న విషయాల గురించి కూడా మీతో పంచుకోవడం మానేశారా? ఇంట్లో ముఖ్యమైన సమస్య వచ్చినప్పుడు లేదా మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందని చర్చించాలనుకున్నప్పుడు.. వారు ఆ విషయాన్ని దాటవేస్తూ ఉంటే అది ఆందోళన కలిగించే విషయం. సమస్యల నుండి పారిపోవడం వల్ల బంధం మరింత ఉక్కిరిబిక్కిరి చేసేదిగా మారుతుందని తెలిపారు.

నియంత్రణ
ప్రేమ పేరుతో భాగస్వామిపై ఆధిపత్యం చలాయించడం లేదా వారిని పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడం టాక్సిక్ రిలేషన్ షిప్ కి పరాకాష్ట. ప్రతి మనిషికీ వారికంటూ కొంత వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఏ బట్టలు వేసుకోవాలి? ఎవరిని కలవాలి?, ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటి విషయాల్లో మీ భాగస్వామి మీకు నిబంధనలు పెడుతుంటే అది ప్రేమ కాదు.. నియంత్రణ. ఇలాంటి వాతావరణంలో మీకు ఊపిరాడనట్లుగా, జైలులో బతుకుతున్నట్లుగా అనిపించడం ఖాయం.
నలుగురిలో చులకన చేస్తూ అవమానించడం
ఒక బంధాన్ని నిలబెట్టేది పరస్పర గౌరవమే. ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వాటిని నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలి. కానీ మీ భాగస్వామి కోపం వచ్చినప్పుడల్లా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ముందు మిమ్మల్ని కించపరుస్తూ అవమానిస్తే.. దాన్ని అస్సలు సహించకండి. పదే పదే నలుగురిలో చులకన చేయడం అనేది మీ ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంది.



Click it and Unblock the Notifications
