Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
ఏ ఇంట్లో అయినా భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణంగా ఒకే కారణం వల్ల రావు. చిన్న చిన్న సమస్యలు కలిసి ఉద్రిక్తతకి దారితీస్తాయి. క్రమంగా ఇవి వారి మధ్య దూరాన్ని పెంచుతాయి. ముఖ్యంగా పండుగల సమయంలో దంపతుల మధ్య కలహాలు చోటుచేసుకోవడం చూస్తుంటాం. అయితే వాటికి కారణాలేంటి.. ఎలా పరిష్కరించుకోవాలి.. నిపుణుల సలహాలు చూద్దాం..

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇంటిల్లిపాదికీ ఆనందం, షాపింగ్, కలిసి గడపడం ఇలా అన్ని రకాల మార్పులను ఒక్కసారిగా తీసుకువస్తుంది. అయితే ఈ సమయంలోనే దంపతుల మధ్య ఉద్రిక్తతలు, చిన్నపాటి వాదనలు కూడా చోటుచేసుకుంటాయి. పండుగ సమయంలో పెరిగే బాధ్యతలు, షాపింగ్ బడ్జెట్‌ల, కుటుంబంతో గడిపే సమయం, అంచనాలు ఇలా అన్ని విధాలుగా ఇద్దరి మధ్యా ఒత్తిడిని పెంచుతాయి. కాగా, పండుగ రోజుల్లో దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలపై వాదనలు పెరిగితే, దాని వెనుక ఈ ఐదు సాధారణ కారణాలు ఉండవచ్చని నిపుణులు ఉంటున్నారు.

అభిప్రాయ భేదాలు
పండుగ సందర్భాల్లో వేడుకలకి సంబంధించి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ సమస్యని పరిష్కరించుకోవాలంటే.. ముందుగా మీ ఖర్చులను ప్రణాళిక చేసుకోవడం ముఖ్యం. ఒకరిపై ఒకరు గెలవడానికి ప్రయత్నించే బదులు ఒకరి బాధలను ఒకరు అర్థం చేసుకుని తదుపరి చర్యలు తీసుకోవడం మంచిది. ఒకవేళ గొడవ ముదురుతున్నట్లుగా అనిపిస్తే కాసేపు శాంతంగా ఉండి.. తర్వాత చర్చించుకోండి.
షాపింగ్ బడ్జెట్
పండుగ సీజన్‌లో బట్టలు, బహుమతులు, ఇంటి అలంకరణ సామగ్రి, ప్రయాణం, ఆహారం ఇలా రకరకాలుగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వేర్వేరు అభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది. అందుకే చిన్న చిన్న కొనుగోళ్లు కూడా వాదనికి దారితీస్తాయి. అందుకే ముందుగానే దానికి అనుగుణంగా బడ్జెట్ నిర్ణయించుకోవడం మంచిది. అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఇలా జాబితాను తయారుచేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.

ఎవరి కుటుంబంతో గడపాలి..
పండుగల సమయంలో దంపతుల మధ్య ముందుగా మొదలయ్యే సమస్య ఎవరింటికి వెళ్లాలి. భార్యాభర్తలు తమ తమ కుటుంబాలతో సమయం గడపాలని కోరుకోవడం సహజం. ప్రతి ఏడాది ఒకే ఇంటికి వెళ్తుంటే.. మరో కుటుంబానికి తక్కువ ప్రాధాన్యత లభిస్తోందని భావించవచ్చు. దీంతో అసంతృప్తి పెరుగుతుంది. ఈ క్రమంలో విభేదాలు తలెత్తకుండా ముందుగానే షెడ్యూల్ తయారుచేసుకుని ఇరు కుటుంబాలతో సమయం గడిపేలా నిర్ణయించుకోండి.

ఇంటి పనుల భారం
పండుగలు వస్తున్నాయంటే ముఖ్యంగా ఉండేది ఇల్లు శుభ్రం చేయడం. రకరకాల పిండి వంటలు, అతిథుల కోసం ఏర్పాట్లు, షాపింగ్‌తో బిజీగా గడుపుతారు. అయితే ఈ పనులన్నీ ఒక్కరిపైనే పడితే అలసట, చిరాకు పెరుగుతుంది. దంపతులు పనుల్లో భాగం పంచుకోవడం లేదా కుటుంబీకుల సహాయం తీసుకుంటే అందరూ రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు.
అంచనాల వ్యత్యాసాలు
పండుగల సమయంలో చాలావరకు కుటుంబీకులతో గడపాలని కోరుకుంటారు. అయితే మీ భాగస్వామికి అలా రొమాంటిక్‌గా బయటకు వెళ్లి సమయం గడపాలనే ఆశ ఉండొచ్చు. దీనిపై ముందుగానే మాట్లాడుకోవడం మంచిది. ప్రతిరోజూ ఒకరికోసం మరొకరు సమయం కేటాయించుకోవడం ద్వారా మీ మధ్య ఉల్లాసంగా, సంతోషంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications