Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఇలా మాట్లాడితే ఎవరినైనా అట్రాక్ట్ చేయొచ్చు, ఎలాగో తెలుసా
ఎదుటివారిని మాటల ద్వారా ఆకట్టుకోవచ్చు. ఇక్కడ శారీరక రూపం అనేదానికి ఎలాంటి వాల్యూ లేదు. కేవలం మాట్లాడే తీరుతో ఎదుటివారిని ఆకర్షించవచ్చు. మరి ఎలా మాట్లాడితే ఎదుటివారిని ఆకర్షించవచ్చో తెలుసుకుందామా..
ఎదుటివారికి నచ్చేలా ఉండటం అనుకున్నంత సులువేం కాదు. అది అసలు సాధ్యం కాదు. ఎందుకంటే కొందరు గడ్డం ఉన్న వాళ్లంటే ఇష్టపడతారు. మరికొందరు క్లీన్ షేవ్‌తో ఉన్నవాళ్లంటే ఇష్టపడతారు. కొందరికి చబ్బీ చబ్బీ అమ్మాయిలంటే ఇష్టం, మరికొందరికి నాజుగ్గా ఉండే అమ్మాయిలను తెగ చూసేస్తుంటారు. అందుకే ఎదుటివారికి నచ్చేలా ఉండటం సులువేం కాదు, అసలు సాధ్యమే కాదు. కానీ మనలోని కొన్ని లక్షణాలు చాలా మందిని ఆకర్షిస్తాయి. కొన్ని పద్ధతులు, కొన్ని మాటలు, మాట్లాడే తీరు చాలా మందికి నచ్చుతుంది.

ఎదుటివారిని మాటల ద్వారా ఆకట్టుకోవచ్చు. ఇక్కడ శారీరక రూపం అనేదానికి ఎలాంటి వాల్యూ లేదు. కేవలం మాట్లాడే తీరుతో ఎదుటివారిని ఆకర్షించవచ్చు. మరి ఎలా మాట్లాడితే ఎదుటివారిని ఆకర్షించవచ్చో తెలుసుకుందామా..

ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఎలా ఉండాలని పరిశోధనలు చెబుతున్నాయంటే..
నలుపు జుట్టు:
నలుపు రంగు జుట్టు ఉన్న వారిని, అందులో మంచి హెయిర్ స్టైల్ ఉన్న వారిని చాలా మంది ఇష్టపడతారట. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎక్కువ మంది నలుపు రంగు, మంచి స్టైల్‌ను ఇష్టపడతారని 2018లో టంపా యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ నేచురల్ అండ్ హెల్త్ సైన్సెస్ నిపుణుల అధ్యయనంలో తేలింది.
కంటిపాప రంగు:
మగవారికి కంటిపాప రంగు నీలం ఉంటే మహిళలకు చాలా ఇష్టమట. అలాగే హాజెల్ రంగులో ఉండే కంటిపాపలు ఉన్న మహిళలంటే పురుషులు చాలా ఇష్టపడతారని 2021లో కాంటాక్ట్ లెన్స్ రిటైలర్ లెన్ స్టోర్ యూకేలో జరిపిన అధ్యయనంలో తేలింది.
హ్యూమర్:
అలాగే లైఫ్ హ్యాపెన్స్ ఇన్సూరెన్స్ అధ్యయనంలో హ్యూమర్‌గా ఉంటూ, తెలివితేటలు కనబరిచే వారిని, ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న పురుషులను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారని తేలింది.
పైన పేర్కొన్న అధ్యయనాల ప్రకారం నల్లని జుట్టు, నీలి లేగా హాజెల్ రంగు కళ్లు, హ్యూమర్, ఆర్థిక భద్రత ఇలాంటివి ఉంటే చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇందులో చాలా అంశాలు మన చేతుల్లో ఉండవు. అవి పుట్టుకతో రావాల్సిందే.
కానీ ఇప్పుడు చెప్పబోయేది మన శ్రమపైనే ఆధారపడి ఉంటుంది. అదే మాటతీరు. మాట్లాడే తీరుకు చాలా మంది ఆకర్షితులవుతారని పలు అధ్యయనాల్లో తేలింది. ఎలా మాట్లాడితే ఎదుటివారిని ఆకర్షించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మాట్లాడే విధానంతో ఎదుటి వారికి ఆకర్షించొచ్చు:
మాట్లాడే తీరుతో ఎదుటి వారిని ఆకర్షించవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. మంచి మాట తీరుతో ఎదుటి వారిని అట్రాక్ట్ చేయవచ్చు. చాలా మంది వ్యక్తులు ప్రత్యేకమైన ఆక్సెంట్/యాస అంటే ఇష్టపడతారట. భాష ఉచ్ఛారణతో ఎదుటివారిని ఆకర్షించవచ్చని లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ప్రిప్లై 2922లో జరిపిన అధ్యయనంలో తేలింది. యూఎస్‌లో పరిశోధన చేయగా 90 శాతం మంది వ్యక్తులు ఎదుటివారి యాసకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తేలింది.
మర్యాటపూర్వకంగా మాట్లాడటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన నైపుణ్యం. ఎదుటివారిని గౌరవించడం, గౌరవం తీసుకోవడం తెలిసి ఉండాలి. అలాగే వారు మాట్లాడటానికి సమయం ఇవ్వాలి. మనమే మాట్లాడుతూ పోతే వాళ్లు చెప్పాలనుకున్నదానికి సమయం ఉండదు.

మొదట మొదలుపెట్టడం:
ఎదుటి వారిని మాట్లాడించాలంటే మనం ముందు మాట్లాడాలి. చిన్న హలోతో ప్రారంభించవచ్చు. అర్థవంతమైన సంభాషణ నుండి మొదలుపెట్టడం మంచిది. దీనికోసం రిహార్సల్స్ చేయాల్సిన అవసరం లేదు, రోజూ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. సందర్భాన్ని, సమయాన్ని బట్టి మాట కలపాలి.
సీరియస్ సందర్భంలో జోకులు వేయడం, హ్యూమర్‌గా సాగుతున్న సందర్భాన్ని ఏదో సీరియస్ అంశం వైపు మళ్లించడం రెండూ మంచిది కాదు. ఎదుటి వారి మూడ్, సమయం సందర్భంతో మెలగడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications