Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సెక్స్ సమయంలో ఈ సమస్యలు కామన్.. ఆందోళన వద్దు, శాంతంగా పనికానివ్వండి
శృంగారం అనేది ప్రేమకు మరో రూపం. మనకు బాగా ఇష్టమైన వాళ్లను.. ముఖ్యంగా భాగస్వాములపై మన ప్రేమను సెక్స్ తోనే ఎక్కువగా చూపిస్తుంటాం. ఇది చాలా మంచి పద్ధతి. సెక్స్ వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. కానీ సెక్స్ చేస్తున్నప్పుడు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. సామాన్యంగా ఎక్కువ మంది జంటలు ఎదుర్కునే ఐదు సమస్యలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. అంచనాలు పెంచేసుకుంటున్నారా:
స్త్రీ పురుషుల మధ్య సాన్నిహిత్యం స్థాయిని ప్రభావితం చేసే సెక్స్ గురించి అనేక అపోహలు ఉన్నాయి. అశ్లీల సినిమాలు చూసి తాము కూడా అలాగే చాలా సేపు చేసుకోవాలనుకుంటారు. తమ పురుషాంగం పరిమాణాన్ని చూసుకొని ఆందోళన చెందుతారు.
2. గర్భం దాల్చడం:
శృంగారం చేసుకుంటే ఎక్కడ గర్భం వస్తుందేమోనని చాలా జంటలు భయపడుతుంటాయి. ఇలా భయపడుతూ సెక్స్ చేసుకుంటే ఏమాత్రం ఎంజాయ్ చేయలేరు. గర్భనిరోధకం విషయంలో భాగస్వాములిద్దరూ బాధ్యత వహించడం చాలా ముఖ్యం. అప్పుడే పిల్లలు వద్దనుకుంటే ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.
3. ఫోర్ ప్లే:
ఫోర్ ప్లే లేకుండా సెక్స్ చేసుకోవడం మంచిది కాదు. ఫోర్ ప్లే అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా స్త్రీలో కోరికలు పెంచాలంటే ఫోర్ ప్లే చేయడం తప్పనిసరి. సెక్స్ ను ఇద్దరూ బాగా ఎంజాయ్ చేయాలంటే స్త్రీని ఉత్తేజపరచాలి. అది ఫోర్ ప్లే వల్లే సాధ్యం అవుతుంది. సెక్స్ చేసుకునేముందు.. భాగస్వాములిద్దరూ ఒకరినొకరు ఉత్తేజపరుచుకునేందుకు ట్రై చేయాలి.
4. పర్ఫార్మెన్స్‌పై ఆందోళన:
చాలా మంది పురుషులు త్వరగా స్కలనం జరుగుతుందేమోనని చాలా భయపడిపోతుంటారు. దాని గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతారు. కొంతమంది వ్యక్తులు కొన్ని సమయాల్లో సెక్స్‌కు దూరంగా ఉండటానికి ప్రధాన కారణాలలో ఈ భయం ఒకటి. మనిషి తన పర్ఫార్మెన్స్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే.. ఎంజాయ్ చేయలేడు.
5. సెక్స్ చేస్తుండగా నొప్పి:
సెక్స్ చేస్తున్నప్పుడు ఏర్పడే నొప్పిని డిస్స్పరేనియా అని కూడా పిలుస్తారు. ఇది వివిధ కారణాల వల్ల కలుగుతుంది. ఫోర్ ప్లే సరిపోకపోవడం, పెల్విక్ కండరాలు బిగుతుగా ఉండడం వల్ల నొప్పి వస్తుంది. యోనిలో గాయం, ఇన్ఫెక్షన్ వంటివి ఉన్నా ఇలాగే నొప్పి వస్తుంది. నొప్పి మరీ ఎక్కువ అనిపిస్తే గైనకాలజిస్ట్ ను కలవడం మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications