Latest Updates
-
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే!
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.!
తులసి మొక్కను లక్ష్మీదేవిగా ఆరాధించడం హిందూ సంప్రదాయంలో అనాదిగా కొనసాగుతూ వస్తోంది. దాదాపు ప్రతి ఇంట్లో తులసీ మాత పూజ తప్పనిసరిగా ఉంటుంది. శక్తి స్వరూపిణిగా భావిస్తూ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సుఖశాంతులు కలుగజేయాలని పూజిస్తారు. అయితే ఇంట్లో ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు మొదటగా ఆ ప్రభావం తులసి మొక్కపై కనిపిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి ఆ ప్రభావాలు ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇక్కడ చూద్దాం..

మీ ఇంటి ఆవరణలోని తులసి మొక్క అసాధారణంగా కనిపిస్తే ఇంట్లో సమస్యలకు సంకేతంగా భావించాలని వాస్తు నిపుణులు అంటున్నారు. తులసి మొక్కలో కనిపించే కొన్ని మార్పులు మీ ఇంట్లో సమస్యలు తలెత్తబోతున్నాయనేది సంకేతంగా హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఎండిపోవడం
దీపారాధన సమయంలో ముందుగా తులసి మొక్కను తప్పనిసరిగా చెంబుడు నీళ్లు సమర్పిస్తారు. ఎప్పటికప్పుడు సంరక్షణ చేపడుతుంటారు. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా తులసి మొక్క ఎండిపోతే అది శుభశకునం కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. అకస్మాత్తుగా ఎండిపోతే అది తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి, అనారోగ్యానికి సంకేతం కావచ్చు. ఈ ప్రభావం ఇంట్లోని పాజిటివ్ వైబ్రేషన్స్‌ని తొలగించి ప్రతికూల శక్తిని పెంచుతుంది.
రంగు మారడం
ఇంట్లో తులసి ఆకులు పసుపు రంగులోకి మారడం లేదా నిరంతరం ఆకులు రాలిపోవడం జరిగితే అశుభ పరిణామాలకు సంకేతంగా పండితులు చెబుతున్నారు. కుటుంబంలో కలహాలు, మానసిక ఒత్తిడి, ప్రతికూల శక్తిని సూచిస్తుందని అంటున్ననారు. కాలంతో సంబంధం లేకుండా ఆకులు రాలడం మొదలైనట్లయితే కుటుంబీకుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు.

బూజు, కీటకాలు
సాధారణంగా తులసి మొక్కకు ఎలాంటి బూజు, కీటకాలు, పురుగు వంటివి పట్టవు. కానీ అకస్మాత్తుగా తులసి మొక్క కుళ్లిపోవడం, బూజు పట్టడం, కీటకాలు రావడం.. మీ జాతక గ్రహంలోని దుష్ప్రభావానికి, పితృ శాపానికి సంకేతంగా భావించాలని పండితులు సూచిస్తున్నారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా గణనీయమైన నష్టాలు సంభవిస్తాయనేది సంకేతంగా భావించాలి.
మీ ఇంట్లోనూ తులసి మొక్కలో ఇలాంటి ప్రభావాలు కనిపిస్తే వాస్తు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. వారి సూచనల మేరకు దోష నివారణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
