Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.!
కొంతమందికి టూర్లు, షికార్లకు వెళ్లాలని ఎంత సరదా ఉన్నా జర్నీ తలుచుకోగానే వణుకు పుడుతుంది. అందుకు కారణం.. బస్సు లేదా కారు ఎక్కగానే వెంటనే వాంతులు చేసుకుంటారు. ఇక ఘాట్ రోడ్లపై జర్నీ చేసేటప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. కడుపులో వికారం, తల తిరగడం, చెమటలు పట్టడం, వాంతులు ఇలా పలు సమస్యలతో ప్రయాణాన్ని ఆస్వాదించలేరు. ఇందుకు పరిష్కారంగా కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

జర్నీలో వాంతులు కావడం అనారోగ్యం కాకపోయినా.. ఇది సంతోషంగా గడపాల్సిన క్షణాలను పోగొడుతుంది. కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడపలేరు. మీరు కూడా కారు లేదా బస్సు ఎక్కిన వెంటనే వాంతులు, వికారంతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాలను పాటించవచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
అల్లంతో మేలు
మీ జర్నీకి ముందు చిన్న అల్లం ముక్కను నమలడం లేదా అల్లం టీ తాగడం ద్వారా వాంతుల బాధ నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు. ఇది సహజంగా కడుపులో వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం మిఠాయి తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.

ఖాళీ కడుపుతో జర్నీ
కొందరు వాంతులు అవుతాయనే భయంతో జర్నీ చేసే ముందు ఏమీ తినరు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఖాళీ కడుపుతో ప్రయాణం కడుపులో వికారాన్ని కలిగించి పులసరం బయటకు వచ్చేస్తుంది. అందుకే జర్నీకి ముందు తేలికపాటి భోజనం చేయడం మేలు. ప్రయాణానికి ముందు ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి.
వెనుక సీట్లలో కూర్చోవద్దు..
కారు లేదా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ముందు సీట్లలో కూర్చోవడానికి ట్రై చేయండి. వెనుక సీట్లలో కూర్చోవడం ద్వారా స్పీడ్ బ్రేకర్లు, మలుపుల వద్ద కడుపులో వికారం తలెత్తే అవకాశం ఉంటుంది.

నిమ్మకాయ, పుదీనా
నిమ్మకాయ లేదా పుదీనా టీ, వాటి వాసన కడుపులో వికారాన్ని తగ్గిస్తుంది. జర్నీ చేసేటప్పుడు వీటిని దగ్గర ఉంచుకోవడం మేలు. వీటితో పాటు జర్నీకి ముందు సరిపడా నిద్ర ఉండేలా చూసుకోండి. సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించండి. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోండి. ఘాటైన వాసనలు, పరిమళాలకు దూరంగా ఉండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
