Latest Updates
-
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా..
పిల్లల్లో బలాన్ని పెంచే ’రైస్ కేక్’.. గుడ్డు, చక్కెర లేకుండా ఎంతో టేస్టీగా.!
సాధారణంగా కేక్ అనగానే పైన ఫుల్‌గా క్రీమ్, ఎగ్, షుగర్, లోపల స్పాంజీగా ఉండటం గుర్తొస్తుంది. అయితే కొందరు డైట్ అంటూ వీటిని దూరం పెట్టేస్తారు. కానీ ఇవేమీ లేకుండా హెల్తీగా బియ్యం, అటుకులు, బెల్లంతో ఎంతో టేస్టీగా రైస్ కేక్ చేసుకోవచ్చు. ఇది పిల్లల్లో బలాన్ని పెంచడమే కాదు.. బీపీ, షుగర్ పేషెంట్లు కూడా మితంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సింపుల్‌గా, త్వరగా ఈ కేక్ రెసిపీ పూర్తవుతుంది.

రైస్ కేక్ తయారీ విధానం
బియ్యం- కప్పు
అటుకులు- పావు కప్పు
పచ్చి కొబ్బరి- పావు కప్పు
ఏలకులు- మూడు
జీలకర్ర- అర టీస్పూన్
ఉప్పు- పావు టీస్పూన్
నీళ్లు- కప్పు
బెల్లం- ఒకటిన్నర కప్పు
వంట సోడా- అర టీస్పూన్
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి- పావు కప్పు
ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం లేదా సోనామసూరి బియ్యాన్ని రెండు సార్లు కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. అదేవిధంగా అటుకులను కూడా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
తర్వాత మిక్సీ బౌల్ తీసుకుని అందులో బియ్యం, అటుకులు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఏలకులు, జీలకర్ర, ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కప్పు నీళ్లు పోసుకుని మరోసారి మెత్తగా, బరకగా లేకుండా రుబ్బుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని బెల్లం వేసి అందులో కాసిన్ని నీళ్లు పోసి కరిగేవరకు స్టవ్‌పైన చిన్న మంట పైన కాగనివ్వాలి.
అనంతరం బియ్యం పిండిలో ఈ బెల్లం పానకాన్ని పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అందులో కొద్దిగా వంటసోడా కలుపుకోవాలి.

చివరిగా స్టవ్‌పైన మందపాటి కుక్కర్ లేదా గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు మంట పెద్దగా ఉంచి 10 సెకన్ల తర్వాత బియ్యం, బెల్లం మిశ్రమాన్ని పోసుకోవాలి. 30 సెకన్ల పాటు పెద్ద మంటపైన అలాగే ఉంచిన తర్వాత చిన్న మంటకు సరిచేసుకోవాలి.
గిన్నెపైన మూత పెట్టి ఆవిరి పోకుండా బరువు పెట్టి 15 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఒక టూత్ పిక్ సాయంతో కేక్ పైన గుచ్చినట్లయితే అంటుకోకుండా వస్తుంది. అప్పుడే కేక్ తయారైనట్లు.
చల్లారిన తర్వాత కేక్ అంచులను గరిటె సాయంతో కదిలించి ఒక ప్లేట్‌లోకి బోర్లించాలి. కేక్ మృదువుగా వచ్చేస్తుంది. అంతే ఎంతో హెల్తీ, టేస్టీగా ఉండే రైస్ కేక్ రెడీ. సాయంత్రాలు స్నాక్స్‌గా పిల్లలకు వీటిని చేసి పెట్టొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
