Latest Updates
-
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.!
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.!
భార్యాభర్తలు శారీరకంగా కలిసిన తర్వాత తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీని వల్ల యూరినరీ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఫలితంగా మూత్రంలో మంట, రక్తం పడటం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా భార్యాభర్తల ప్రైవేట్ భాగాల వద్ద దురద, చికాకు వంటివి కలిగి అసౌకర్యాన్ని కలగజేస్తాయి. ఈ క్రమంలో కలయిక తర్వాత దంపతులు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే ఇన్‌ఫెక్షన్ సమస్య ఉండదని గైనకాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు.

యూరిన్‌కి వెళ్లడం
దంపతులు కలయిక తర్వాత తప్పనిసరిగా వీలైనంత త్వరగా మూత్ర విసర్జన చేయాలి. దీని వల్ల యూరినరీ ఇన్‌ఫెక్షన్ రిస్క్ తప్పుతుంది.
వ్యక్తిగత శుభ్రత
భార్యాభర్తలు కలయిక ముందు, తర్వాత.. ప్రైవేట్ భాగాల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యం. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కఠినమైన సబ్బులు, సువాసన ఎక్కువగా ఉండేవి వాడకూడదు. శుభ్రత పాటించడం ద్వారా చికాకు వంటివి రాకుండా ఉంటాయి.
కండోమ్ డిస్పోజ్
దంపతులు కండోమ్ వాడుతున్నట్లయితే కలయిక అనంతరం వెంటనే దానిని డిస్పోజ్ చేయండి. దానిని మళ్లీ వాడకూడదు.
ఈ లక్షణాలపై నిర్లక్ష్యం వద్దు
కలయిక తర్వాత ప్రైవేట్ భాగాల్లో మంట, దురద కలిగినా, అసాధారణంగా స్రావం జరిగినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కావచ్చు. వెంటనే గైనకాలజిస్టు నిపుణులను సంప్రదించాలి.

రిలాక్సేషన్
కలయిక అనంతరం భార్యాభర్తలు కాసేపు రిలాక్స్ అవ్వండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా కండరాల నిస్సత్తువలు సహజంగా ఉంటాయి.
హైడ్రేషన్
దాహం వేసినా, బాడీ డీహైడ్రేడెట్‌గా అనిపించినా పుష్కలంగా నీరు తాగండి. దీని ద్వారా శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
శుభ్రమైన కాటన్ లోదుస్తులను మాత్రమే ధరించండి. దీని వల్ల ప్రైవేట్ భాగాల్లో చెమట, తేమ రాకుండా పీల్చుకుంటుంది. ఇన్‌ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. ఏ మాత్రం అసౌకర్యం, కలయికలో ఇబ్బందులు అనిపించినా సొంత నిర్ణయాలు తీసుకోకండి. భాగస్వామితో బలవంతంగా కాకుండా ప్రేమతో ఉంటూ శారీరక సాంగత్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి.
ఎమోషనల్ బాండింగ్
కలయిక ముందే కాదు తర్వాత కూడా దంపతుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ముఖ్యం. భాగస్వామితో బలవంతంగా కాకుండా ప్రేమతో ఉంటూ శారీరక సాంగత్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి. కాసేపు మీ భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. ప్రేమ, ఆప్యాయతలను పంచుకోండి. దీని వల్ల మీ రిలేషన్‌షిప్ మరంత బలపడి మీ సెక్సువల్ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది. ఇక, సంతానం కోసం ప్రయత్నిస్తున్న భార్యాభర్తలు మాత్రం.. కలయిక ముందు, తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలపై గైనకాలజిస్టు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
