Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
Relationship Tips: నిజమైన ప్రేమ అంటే శారీరక సంబంధమేనా.. అసలు ప్రేమ అంటే ఏంటి?
ప్రేమ అంటే శారీరక సంబంధమే అనే భావనలో పడిపోతుంటారు ప్రేమికులు. కానీ నిజంగానే ప్రేమంటే శారీరక సంబంధమేనా.. ప్రేమకు అసలైన అర్థం ఇదేనా కాదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమ.. ఈ పేరుకు చాలా మందికి అర్థం తెలియదు. అంతే కాదు ఒక అమ్మాయిని చూడగానే ఆమె అందం, ఆమె కళ్లు చూసి ఇష్టపడిపోతుంటారు చాలా మంది. చూసేందుకు బాగుంటే చాలు ఆమె వెనకాల పడి.. ఆమెను ప్రేమలో దింపే వరకూ వదలరు. అలాగే అమ్మాయిలు కూడా ఓ అబ్బాయి చూసేందుకు స్టైల్ గా కనిపించి, మొహం ఫెయిర్ గా ఉండి.. అందంగా కనిపిస్తే చాలనుకుంటారు. అందరి ముందు తమ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు చాలా అందంగా ఉంటే చాలని కోరుకుంటారు. ఇలాగే తమ లవ్ అండ్ లైఫ్ పార్టనర్ లను ఎంచుకుంటుంటారు.

ఇలా అబ్బాయి లేదా అమ్మాయి ఆకర్ణణకు లోనై ప్రేమలో పడిపోయిన వారంతా కాలక్రమేణా లైంగిక ఆకర్షణగా మారుతుంది. ఇలా ప్రేమ అంటే శారీరక సంబంధమే అనే భావనలో పడిపోతుంటారు ప్రేమికులు. కానీ నిజంగానే ప్రేమంటే శారీరక సంబంధమేనా.. ప్రేమకు అసలైన అర్థం ఇదేనా కాదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అలా అనుకుంటే పొరబడినట్లే:
ప్రేమికులు ఇద్దరూ శారీరక సంబంధమే తమ ప్రేమ అనుకొని తరచుగా కలుసుకోవడమే ప్రేమ అనుకుంటే తప్పే. ఇది అసలు ప్రేమే కాదు. శారీరక సంబంధానికి సంబంధించి మీది కేవలం ఆకర్షణ మాత్రమే. ప్రేమ అంటే సెక్స్ మాత్రమే కాదు. ప్రేమ అనేది మనసులోని ఓ భావన. ఇద్దరి మనుసుల్లోనూ ఇదే భావన కల్గితే.. శారీరక సంబంధం లేకపోయినా జీవితాంతం మీరు కలిసుండగలమనే భావ ఉంటే అది నిజమైన ప్రేమ. అలా శారీరక సంబంధం వద్దని కాదు. అలాంటివేమీ లేకపోయినా మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలిని మీరు వదిలేయకపోవడమే అసలైన ప్రేమ. కానీ శారీరక సంబంధం లేకపోతే వాళ్లు మీకు వద్దని భావిస్తే అది నిజమైన ప్రేమ కాదు. నిజంగా మీ ఇద్దరికీ అదే కావాలని అనిపిస్తే మాత్రం అది ఆకర్షణే. అంటే మీ శరీరానికి వారి శరీరం అవసరం. నిజమైన ప్రేమ శారీరక సంబంధాన్ని మాత్రమే కోరుకోదనే విషయం మీరు గుర్తించాలి.

అలా చేయకపోతే ప్రేమ అనిపించుకోదు:
అలాగే మీరిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా, ఒకరినొకరు చూసుకోకపోయినా అది కూడా ప్రేమ అనిపించుకోదు. ప్రేమ అంటే శారీరక సంబంధం తర్వాత కూడా మనసు విప్పి మాట్లాడుకోవాలని కోరుకుంటుంది. ఒకరినొకరు చూస్తూ ఒకరినొకరు అర్థం చేసుకోవడమే అసలైన ప్రేమ. ప్రేమకు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీ ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ సరిగ్గా లేదంటే మీ మధ్యం బంధం బలంగా లేదని అర్థం.

అలా చేయకపోయినా ప్రేమ ఉన్నట్లే:
మీరిద్దరూ ఏకాంతంగా కలిసి ఉన్నప్పుడు... పడక గదిలోకి వెళ్లాలని తెగ ఆతృత పడిపోతుంటారు. కానీ అలా పోకపోయినా.. చాలా కాలం మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినా మీరు సంతోషంగా ఉన్నారంటే అది ప్రేమే. నిజంగా ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ ఉందంటే శారీరక సంబంధం ఉన్నా లేకపోయినా వారి బంధంలో ఎలాంటి తేడా ఉండదు. శారీరక బంధంతో కాస్త ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. ప్రేమలో ఎలాంటి తేడా ఉంటుంది.



Click it and Unblock the Notifications