For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల వారు ఆ విషయంలో ‘తగ్గేదే లే’ అంటారట...! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

|

ఈ లోకంలో ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం బలంగా ఉండాలంటే.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. ఏవైనా పొరపాట్లు జరిగితే, ఇద్దరూ సారీ చెప్పుకోవాలి. కొన్ని చిన్న చిన్న విషయాలను చూసీ చూడనట్టు వదిలేయాలి.

ముఖ్యంగా చాలా విషయాల్లో రాజీపడాల్సి ఉంటుంది. మనకు ఎంత ఇష్టమైనా.. భాగస్వామికి నచ్చకపోతే వాటిని సైతం త్యాగం చేయాల్సి ఉంటుంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు బంధాల కోసం విశ్వాసాలను, విలువలను వదిలేయరట. అలాంటి రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం...

అబ్బాయిలతో 'ఆ కార్యం'లో ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...!

మేష రాశి..

మేష రాశి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారు ఎక్కువగా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారట. వీరు ఏ పని అయినా మనసు పెట్టి చేస్తారట. అందుకనే వీరు ఎలాంటి పనులనైనా సులభంగా పూర్తి చేస్తారట. అంతేకాదు వీరు చాలా విషయాల్లో మొండిగా ఉంటారట. అదే సమయంలో భాగస్వామి కోసం, వారి కలల విషయంలో రాజీ పడమంటే.. అస్సలు తగ్గరట. అవసరమైతే తమ బంధాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడతారట.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు ఏ పని అయినా ఒక ప్రణాళిక ప్రకారం జరగాలని భావిస్తారట. ఏదైనా సరే తమ ఇష్టప్రకారమే జరగాలని భావిస్తారట. వారి పనిలో ఎలాంటి పొరపాటు జరగకూడదని, ఎప్పటి పని అప్పుడే జరిగిపోవాలని కోరుకుంటారట. ఇక భాగస్వామి విషయంలో కూడా అంతా తమకు అనుకూలంగా ఉండాలని ఊహించుకుంటారట. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా.. తమ రిలేషన్ షిప్ కు ఎండ్ కార్డ్ వేస్తారట.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి సామాజిక సేవ చేయడమంటే మహా ఇష్టం. అందుకోసం తమ సొంత ఖర్చులను సైతం ఉపయోగిస్తారట. ఇందుకు తమ భాగస్వామి ఏదైనా అభ్యంతరం చెబితే అస్సలు సహించరట. రిలేషన్ షిప్ లో వీరిపై పూర్తిగా ఆధారపడటం వంటివి కూడా ఇష్టపడరట. తమ భాగస్వామి కూడా తమలాగే ఆలోచించాలని, కోరుకుంటారట. అలా లేకపోతే, తమ భాగస్వామిని వదులుకోవడానికి ఏ మాత్రం సంకోచించరట.

‘నా మరదలిని మరచిపోలేకపోతున్నా.. తన మీదే ద్యాసంతా.. కానీ నా భార్య...'

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు బంధాలకు, స్నేహానికి ఎంతో విలువనిస్తారు. అయితే వీరు భాగస్వామితో ఎక్కువగా గడుపుతూ.. కుటుంబసభ్యులు, స్నేహితులను కలిసేందుకు సమయం దొరక్కపోతే మాత్రం అస్సలు సహించరు. అలాంటి వారితో బంధాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపరు. కేవలం ఒక్కరి కోసం అందరినీ వదులుకోడానికి సిద్ధపడరు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు తమ ఇష్టాలకు, కోరికలకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల గురించి ఆలోచించడం.. వారి గురించి పట్టించుకోవడం అనేది వీరికి ఇష్టముండదు. ముఖ్యంగా తమ భాగస్వామి గురించే అనుక్షణం ఆలోచిస్తూ ఉండాలంటే.. వీరికి ఇష్టముండదు. వీరి వ్యక్తిగత విషయాలకే తొలి ప్రాధాన్యత ఇస్తారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు పెట్స్ ను బాగా ఇష్టపడతారు. అదే సమయంలో తమ భాగస్వామి కూడా పెంపుడు జంతువులను ఆసక్తి చూపాలని భావిస్తారు. ఒకవేళ వీరి భాగస్వామికి ఇలాంటివి నచ్చకపోతే.. వీరి బంధాన్ని తెంచుకోవడానికి ఏ మాత్రం ఆలస్యం చేయరు.

ఇలాంటి మగాళ్లతో జాగ్రత్త సుమా...! లేదంటే మీ జీవితంలో నరకమే...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు బంధం విషయంలో కొన్ని కలలు కంటారు. ముఖ్యంగా తమ భాగస్వామి ఎలా ఉండాలి.. ఎలాంటి పనులు చేయాలి.. ఎవరితో ఎలా వ్యవహరించాలి.. అని కొన్ని పద్ధతులను పెట్టుకుంటారు. వాటి ప్రకారమే తమ భాగస్వామి నడుచుకోవాలని భావిస్తారు. ఒకవేళ అలాంటి వాటికి ప్రతికూలంగా ఉంటే.. మాత్రం వీరి బంధానికి బ్రేకప్ చెప్పేస్తారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి రొమాన్స్ అంటే చాలా ఇష్టం. అయితే వీరు ఆ విషయంలో ఏ మాత్రం రాజీ పడరట. ముఖ్యంగా తమ భాగస్వామి అలాంటి వాటిపై ఆసక్తి చూపకపోతే, వారి బంధం నుండి నిర్మోహమాటంగా బయటకు వచ్చేస్తారట. వీరి కోరికలను తమ భాగస్వామి అర్థం చేసుకోకపోతే, చాలా బాధపడతారట.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి జర్నీ అంటే బాగా ఇష్టమట. అయితే వీరి భాగస్వామికి ఇలాంటివి ఇష్టం లేకపోతే.. వారి కోసం ఇలాంటి వాటిని త్యాగం చేయలేరట. ముఖ్యంగా వీరు ఎక్కడికెళ్దామన్నా.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే వారితో వీరు ఎక్కువ కాలం కలిసి ఉండరట. ఎవరైతే సాహసం, లాంగ్ జర్నీ వంటివి చేయాలనుకుంటారో అలాంటి వారితోనే బంధాన్ని కొనసాగిస్తారట.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు ఆర్థిక పరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి భాగస్వామి కూడా డబ్బుకు విలువ ఇవ్వాలని కోరుకుంటారట. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వీరిద్దరూ ఎక్కడికైనా కలిసి వెళితే.. ప్రయాణంలో సైతం ఖర్చులలో షేర్ చేసుకోవాలని భావిస్తారట. అయితే ఖర్చుల విషయంలో భాగస్వామి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మాత్రం చాలా బాధపడతారట.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి బంధాల విషయంలో చాలా పట్టింపులు ఉంటాయట. ముఖ్యంగా భాగస్వామి కోసం వీరికి ఇష్టమైన వాటిని అస్సలు వదులుకోరట. అలాంటి విషయాల్లో అస్సలు రాజీ పడరట. ఒకవేళ తమ భాగస్వామి ఇష్టాల విషయంలో విన్నవించుకుంటే.. వారిని వదిలించుకుంటారు తప్ప.. వీరు మాత్రం వెనక్కి తగ్గరట.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. వీరు తమ మానసిక ప్రశాంతత కోసం ఎలాంటి విషయాల్లోనూ త్యాగం చేయడానికి సిద్ధపడరట. వీరిని గౌరవించే వారంటే బాగా ఇష్టమ. అలాంటి వారితోనే బంధాన్ని ఎక్కువగా కొనసాగిస్తారట. వీరికి గౌరవం ఇవ్వని వారితో వీరు చాలా దూరంగా ఉంటారట.

English summary

What Your Zodiac Sign Refuses to Sacrifice for a Relationship In Telugu

Here we are talking about the what your zodiac sign refuses to sacrifice for a relationship in Telugu. Read on
Story first published: Thursday, April 15, 2021, 8:00 [IST]