Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Valentine Day 2022:ప్రేమికుల రోజున పార్ట్నర్ నుండి ఎక్కువగా ఏం కోరుకుంటారంటే...!
వాలెంటైన్స్ డే సందర్భంగా మీ పార్ట్నర్ మీ నుండి ఎక్కువగా ఏమి ఆశిస్తారో తెలుసుకోండి.
ప్రేమలో పడిన వారికి ప్రతిరోజూ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదే ప్రేమికుల రోజు(Valentines Day)న మరింత ప్రత్యేకంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈరోజున తమ మనసుకు నచ్చిన వ్యక్తికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుందని చాలా మంది కపుల్స్ నమ్ముతారు.

ఈ నేపథ్యంలోని ప్రేమికుల రోజున తన ప్రియుడు లేదా ప్రియురాలు తమ నుండి ఏం ఆశిస్తారోనని.. వారికి ఎలాంటి బహుమతిలిస్తే.. బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వాలెంటైన్స్ డే రోజున ఎలాంటి గిఫ్టులిస్తే మీ పార్ట్నర్ సంతోషిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఎలాంటి కానుక ఇస్తే..
సాధారణంగా వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. చాలా మంది కపుల్స్ బ్యూటిఫుల్ రింగ్స్, ఫొటో ఫ్రేమ్స్, మెన్స్ వాలెట్స్, బెల్టులు, క్యూట్ రింగ్స్, జ్యువెలరీ సెట్స్ లో లవ్ కార్డ్స్ వంటివి ఇస్తుంటారు. అయితే మీరు అందరిలా కాకుండా మీ భాగస్వామికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటే.. ఏదైనా బహుమతిని మీరే స్వయంగా తయారు చేసి ఇస్తే.. వారి మనసుకు బాగా నచ్చుతుంది. కాబట్టి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ భాగస్వామి మెచ్చే బహుమతిని ఇచ్చే ప్రయత్నం చేయండి. రిస్ట్ వాచ్, టై, వాలెట్ వంటి వాటిని గిఫ్టుగా ఇస్తే బాగుంటుందని మీ పార్ట్నర్ కోరుకుంటారు.

లవ్ లెటర్స్..
స్మార్ట్ ఫోన్ల కాలంలో.. వాట్సాప్, టెలిగ్రామ్ మెసెజ్ వంటివి పంపుకునే కాలంలో లవ్ లెటర్స్ ఏంటని సర్ ప్రైజ్ అవుతున్నారా? మీ మనసులోని భావాలను పదాలుగా మార్చి పలికిస్తే.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇదే సందర్భంలో తమ ప్రేయసి తమను ఎందుకు లవ్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటారు. అది కూడా లవ్ లెటర్ ద్వారా. అందుకే ఈ ప్రేమికుల రోజున మీ ప్రేయసికి లేదా ప్రియుడికి లవ్ లెటర్ ఇవ్వండి. వారిని ఆశ్చర్యపరచండి.

సరదాగా గడపాలి..
ప్రేమికుల రోజున తమ ప్రేయసితో లేదా ప్రియుడితో చాలా సరదాగా గడపాలని కోరుకుంటారు. అబ్బాయిలైతే తమ ప్రియురాలితో కలిసి పార్కులకు వెళ్లడం, షాపింగ్ మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేయడం లేదా సినిమాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఇంకా కొందరైతే వాలెంటైన్స్ డేను కొంత రొమాంటిక్ గా గడపాలని ఆశిస్తారు. అయితే మీరు ప్రేమికుల రోజున మరింత ప్రత్యేకం కావాలంటే మీరు కాస్త రొమాంటిక్ గా మారొచ్చు. అయితే కరోనా జాగ్రత్తలు పాటించడం మాత్రం మరచిపోవద్దు.

తియ్యని పదార్థాలు..
మనలో చాలా మంది తమ లవర్ కు ఎక్కువగా చాక్లెట్లు ఇస్తుంటారు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు చాక్లెట్స్ ను బాగా ఇష్టపడతారు. అయితే తమ ప్రియురాలు కూడా తమకు తియ్యని చాక్లెట్లను గిఫ్టుగా ఇస్తే ఎంతో బాగుంటుందని అనుకుంటారు. ఎవరికైనా మనం చాక్లెట్ ఇస్తున్నామంటే.. వారు మనకెంత ముఖ్యమో తెలియజేస్తున్నట్టే. మరి మీ పార్ట్నర్ మీకెంత ముఖ్యమో తెలియాలంటే.. వారికిష్టమైన చాక్లెట్ ను గిఫ్టుగా ఇచ్చేయండి.

ఇష్టమైన రుచులు..
ప్రేమికుల రోజున మీ ప్రియుడి లేదా ప్రియురాలి మనసు గెలుచుసుకోవాలంటే.. మీరు కచ్చితంగా మంచి బహుమతి లేదా ఖరీదైన గిఫ్టులే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పార్ట్నర్ కు ఇష్టమైన వంటకాన్ని రుచి చూపిస్తే చాలు. ఆ అద్భుతమైన వంటకాన్ని మీ చేత్తో రుచి చూపిస్తే.. ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆశిస్తారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రేమికుల రోజున వారి కోరికను తీర్చేయండి.

ఏకాంతంగా గడపాలని..
వాలెంటైన్స్ డే అంటే ప్రత్యేకంగా సెలవులేమీ ఉండవు. డైలీ బిజీ లైఫ్ లోనూ ఎలాంటి మార్పులు ఉండవు. అయితే లవర్స్ ఇద్దరూ కలిసి ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపాలని కోరుకుంటారు. అందుకే వాలెంటైన్స్ డే రోజున తమ ప్రియుడు లేదా ప్రియురాలితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ పార్టీ వంటివి ప్లాన్ చేయాలి. అంతేకాదు వారికి నచ్చిన మెనూలోనే టెస్టీ రెసిపీలను రెడీ చేయండి. అలా మీరిద్దరూ ఏకాంతంగా గడిపేలా ప్లాన్ చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు.
సాధారణంగా వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. చాలా మంది కపుల్స్ బ్యూటిఫుల్ రింగ్స్, ఫొటో ఫ్రేమ్స్, మెన్స్ వాలెట్స్, బెల్టులు, క్యూట్ రింగ్స్, జ్యువెలరీ సెట్స్ లో లవ్ కార్డ్స్ వంటివి ఇస్తుంటారు. అయితే మీరు అందరిలా కాకుండా మీ భాగస్వామికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటే.. ఏదైనా బహుమతిని మీరే స్వయంగా తయారు చేసి ఇస్తే.. వారి మనసుకు బాగా నచ్చుతుంది. కాబట్టి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ భాగస్వామి మెచ్చే బహుమతిని ఇచ్చే ప్రయత్నం చేయండి.



Click it and Unblock the Notifications