For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నాకు పెళ్లై పదేళ్లవుతున్నా..తనని తాకనివ్వడం లేదు.. ఏం చేయాలి..’

|

ఇటీవలి కాలంలో కరోనా కారణంగా చాలా మంది ఆ కార్యాన్ని ఆస్వాదించారని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు మాత్రం రతి క్రీడ పట్ల చాలా మంది ఆసక్తి చూపడం లేదట. భార్యభర్తలిద్దరిలోనూ క్రమంగా లైంగిక పరమైన కోరికలు తగ్గిపోతున్నాయట.

అందుకు మారుతున్న లైఫ్ స్టైలే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే మీ లైఫ్ స్టైల్ లో మార్పు కారణంగా వచ్చే మార్పులు చిన్నవిగానే కనిపించినా.. అవి మీ సెక్స్ లైఫ్ ప్రభావితం చేయడంలో ముందుంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

సాధారణంగా ఆలుమగలిద్దరిలోనూ అలాంటి కోరికలు ఎందుకు తగ్గుతాయి.. వారు ఆ కార్యంపై ఎందుకు ఆసక్తిని తగ్గించుకుంటారనే విశేషాలతో పాటు.. ఓ వివాహిత తన భాగస్వామితో ఎదురైన సమస్యల గురించి ఏమి చెప్పారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Wife and Husband Problems:భార్యలు కలయిక పట్ల ఆసక్తి చూపకపోవడానికి కారణాలేంటో తెలుసా...

పెళ్లై పదేళ్లయినా..

పెళ్లై పదేళ్లయినా..

హాయ్ ‘నాపేరు రాణి(పేరు మార్చాం). నేను డిగ్రీ చదివాను. చదువుకునే రోజుల్లోనే నా క్లాస్ మేట్ తో ప్రేమలో పడిపోయాను. మా ఇద్దరి పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాలేదు. నాకు పెళ్లై పది సంవత్సరాలు అవుతోంది. పెళ్లికి ముందు తను నన్ను వదిలి అస్సలు ఉండే వాడు కాదు. అయితే పెళ్లి తర్వాత తను కనీసం నన్ను తాకడం లేదు. అసలు తనకు ఆ కార్యంపై ఆసక్తి ఉందా లేదా అనే విషయం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పి కలయికను వాయిదా వేస్తుంటాడు.

జీవితాంతం ఇలాగే గడపాలా?

జీవితాంతం ఇలాగే గడపాలా?

మా ఇద్దరి వివాహ జీవితంలో నా భర్త నన్ను కేవలం ఒకట్రెండు సార్లు మాత్రమే తాకాడు. అది ఎప్పుడు తాకాడనే విషయం కూడా నాకు గుర్తు లేదు. అయితే ఇంత సమయం గడుస్తున్నా తనతో అలాగే ఉండాలంటే నాకు చాలా కష్టంగా ఉంటోంది. నేను జీవితాంతం ఇలాగే ఉండాలంటే మాత్రం నా వల్ల కాదు. నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలా? నా ఈ సమస్యకు సరైన పరిష్కారం చెప్పగలరు' అంటూ ఓ వివాహిత తన సమస్యను నిపుణులకు చెప్పుకున్నారు. ఇందుకు నిపుణులు ఏమి సమాధానం ఇచ్చారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమ లేకుండా..

ప్రేమ లేకుండా..

ప్రస్తుత కాలంలో చాలా మంది భార్యభర్తలు ప్రేమ, రొమాన్స్ లేకుండానే బతికేస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారం కూడా మీ చేతుల్లోనే ఉంది. వాటిని పక్కాగా ప్రయత్నించి.. మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు. దీంతో మీరు మీ సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు.

కపుల్స్ ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారా?

ప్రేమిస్తున్నారా లేదా?

ప్రేమిస్తున్నారా లేదా?

మీ వివాహ జీవితంలో ప్రేమ లేదంటున్నారు కాబట్టి.. ముందు తనని ఓ విషయం గురించి కచ్చితంగా అడగండి. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ.. ఇప్పుడెందుకు లేదు.. మీ గురించి తనకు ఏదైనా అభ్యంతరాలున్నాయా? ముఖ్యంగా పడకగదిలో ఎలాంటి అచ్చటా, ముచ్చటా జరగడం లేదు కాబట్టి, నిజంగా తనకు ఆ కార్యంపై ఆసక్తి ఉందా లేదా అనే విషయాలను తెలుసుకోండి.

సెక్స్ సమస్యలు..

సెక్స్ సమస్యలు..

కొన్నిసార్లు పురుషులకు సెక్స్ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఆ కార్యం గురించి ఎక్కువ ఆందోళన చెందడం, ఒత్తిడిగా ఫీలవ్వడం లేదా సమయం లేకపోవడం, ఇతర కారణాల వల్ల కూడా మీకు పడకగదిలో సరైన సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. అలాంటి సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో మీరు నిపుణులకు వ్యక్తిగతంగా కలిసి సలహాలు తీసుకోవాలి.

కలిసే ఉండాలి..

కలిసే ఉండాలి..

పెళ్లి అంటేనే ఆలుమగల కలయిక. వారు జీవితాంతం కలిసే ఉండాలి. ఒకవేళ తను ఏదైనా సెక్స్ సంబంధిత సమస్య గురించి బాధపడుతున్నా లేదా ఇంకేదైనా సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. వాటినీ మీరే అర్థం చేసుకోవాలి. ముందుగా ఆ సమస్య నుండి బయట పడేందుకు మార్గం వెతకాలి. ఒకరికొకరు ఇద్దరు భావోద్వేగత మద్దతు ఇచ్చుకోవాలి.

అందుకు ప్రోత్సహించాలి..

అందుకు ప్రోత్సహించాలి..

ముఖ్యంగా ఆ కార్యంపై వారంతట వారికే ఆసక్తి కలిగేలా మీరే ప్రయత్నించాలి. ఇందుకోసం తన ఎదుట ఎక్స్ పోజింగ్ చేయడం, సెక్సీ డ్రస్సులు వేసుకోవడం.. అప్పుడప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం వంటివి చేయాలి. వీటితో తన పనికి సంబంధించి మీ వంతు సహాయం చేస్తూ ఉండాలి. అన్నింటికీ మించి మీరు వారి నుండి ఏమి ఆశించకుండా కేవలం సంతోషం కోరుకుంటున్నట్లు తెలిసేలా చేయాలి.

సర్ ప్రైజ్ చేయండి..

సర్ ప్రైజ్ చేయండి..

పడకగదిలో మీ శ్రీవారు ప్రవేశించాక వారిని సర్ ప్రైజ్ చేసేందుకు ప్రయత్నించండి. వారికి ఎన్ని టెన్షన్లు ఉన్నా.. అవన్నీ మరచిపోయేలా చిన్న చిన్న గిఫ్టులు ఇవ్వండి. అవి కూడా చాలా చిలిపిగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు కిస్సింగ్ లిప్స్ ఉన్న మొబైల్ పౌచ్, రతిక్రీడకు సంబంధించిన డైలాగులున్న టీషర్టులు.. ఇలా ఏవైనా వారికిచ్చి వారిలో లైంగిక పరమైన కోరికలను కలిగించొచ్చు.

English summary

Ways To Build Strong Relationship With Your Partner in Telugu

Here are these ways to build strong relationship with your partner in Telugu. Take a look
Story first published: Wednesday, August 25, 2021, 16:38 [IST]