Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ భాగస్వామి మీతో శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారా? లేదా? ఇలా తెలుసుకోవచ్చు..
భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికమూ ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. అది ఏ విషయంలో అయినా సరే. కానీ చాలా మంది తమ జీవిత భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉంటే లోపలే ఉంచుకుంటారు తప్ప వారికి చెప్పి పరిష్కరించుకోరు.
ముఖ్యంగా పడకగది విషయాలను అయితే అస్సలే పంచుకోరు. తమ జీవిత భాగస్వామి తమకు నచ్చినా నచ్చకపోయినా వారితోనే కలిసి జీవిస్తుంటారు. సెక్స్ పరంగా కూడా.. ఏదో చేయాలి కాబట్టే చేస్తున్నాం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు.

మీ భాగస్వామి మీతో ఇలా ప్రవర్తిస్తే.. కొందరికి అర్థం అవుతుంది. మరికొందరికి అర్థం కాదు. మేం కింద చెప్పిన విధంగా మీ భాగస్వామి ప్రవర్తిస్తే మాత్రం వారితో మీతో సెక్స్ జీవితాన్ని సంతృప్తిగా జీవించలేరనే అర్థం.
ఆసక్తి, ఉత్సాహం లేకపోవడం:
మీ జీవిత భాగస్వామి మీతో సెక్స్ చేస్తున్నప్పుడు ఇష్టాన్ని చూపించకపోవచ్చు. అలాగే ఉత్సాహంగా కూడా కనిపించకపోవచ్చు. ముఖ్యంగా తరచుగా మీతో సెక్స్ లో పాల్గొనడానికి ఇష్టం చూపించకపోవచ్చు. వారు మీతో దూరంగా ఉండడానికి ఇష్ట పడుతున్నారని మీకు వెంటనే అర్థం అవుతుంది.
మనసులోని మాటలు చెప్పలేకపోవడం:
మీ భాగస్వామి వారి కోరికలు, ప్రాధాన్యతలు, లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన.. భయాలు, ఆందోళనలను గురించి మీతో చెప్పకోవచ్చు. వారిలో కల్గుతున్న భావాలను, ఫీలింగ్స్ ను మీతో చెప్పడం మానేయవచ్చు. ఇది మీ పట్ల సంతృప్తి లేకపోవడాన్ని సూచిస్తుంది.

శారీరక అసౌకర్యం లేదా నొప్పి:
మీ భాగస్వామి సెక్స్ సమయంలో శారీరక అసౌకర్యానికి లేదా ఏదైనా నొప్పి కల్గుతున్న భావిస్తుండవచ్చు. కండరాలు బిగుసుకుపోవడం, వింకింగ్ చేయడం లేదా నిర్దిష్ట స్థానాలు లేదా కార్యకలాపాలను నివారించడం వంటివి.
ఇలాంటి వాటికి మీ భాగస్వామి ఫీలైతున్నట్లయితే వారు మిమ్మల్ని ఆస్వాదించడం లేదని అర్థం. కాబట్టి మీరు కూడా వారి అసౌకర్యానికి గల కారణం తెలుసుకునేందుకు వైద్యుడి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
భావప్రాప్తి కల్గకపోవడం:
సెక్స్ చేసుకుంటున్నప్పుడు, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పుడు మీ భాగస్వామి భావప్రాప్తిని అనుభవించకపోవచ్చు. సెక్స్ చేస్తున్నప్పుడు వారు అసంతృప్తిగా ఉండడం మీరు గమనించవచ్చు. ఇలా జరిగితే వారు అనుకున్నంతగా సెక్స్ చేయలేకపోవడమే, భావ ప్రాప్తి కల్గకముందే ఆగిపోవడమో జరుగుతున్నట్లు అర్థం.
సాన్నిహిత్యం లేదా భావోద్వేగ కనెక్షన్ లేకపోవడం:
సెక్స్ అనేది శారీరక చర్య మాత్రమే కాదు. భావోద్వేగం కూడా. లైంగిక కార్యకలాపాల సమయంలో లేదా తర్వాత మీ భాగస్వామి మీతో మనసు విప్పి మాట్లాడితే మంచిది. అలా జరగకపోయినా వారు మిమ్మల్ని దగ్గరకు తీసుకోకపోయినా అంటే కౌగిలింతలు, ముద్దులు వంటివి చేయకపోయినా మిమ్మల్ని వారు ఆస్వాదించలేకపోతున్నారని అర్థం.



Click it and Unblock the Notifications