Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఈ రాశుల స్త్రీలు చాలా రొమాంటిక్.. మీ ప్రియురాలు లేదా భార్య ఉందా చూస్కోండి
దాంపత్యంలో అయినా, ప్రేమ వ్యవహారంలో అయినా శృంగారభరితంగా ఉండటం చాలా కీలకం. రొమాంటిక్ గా ఉండే వ్యక్తులతో సమయం గడపడం చాలా బాగుంటుంది. చిన్న చిన్న పనుల్లో కూడా రొమాన్స్ చొప్పించి ఆకట్టుకోవడం అందరి వల్ల సాధ్యం కాదు. సంబంధంలో రొమాంటిక్ గా ఉండటం చాలా కీలకమని చెబుతుంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. రొమాంటిక్ గా ఉంటే సంబంధంలో సాన్నిహిత్యం పెరగడంతో పాటు భార్యాభర్తల మధ్య దాపరికాలు చెరిగిపోయి, అన్ని విషయాలు ఒకరికొకరు పంచుకుంటారని అంటారు.

అయితే రొమాన్స్ అనగానే అదేదో పురుషులకు మాత్రమే సంబంధించిన సబ్జెక్ట్ అనుకుంటారు చాలా మంది. కానీ శృంగారంలో, శృంగారభరితంగా ఉండటంలో స్త్రీ, పురుషులు ఇద్దరి పాత్ర కూడా కీలకమే. అయితే కొన్ని రాశి చక్ర మహిళలు పురుషుల కంటే కూడా రొమాంటిక్ గా ఉంటారు. ఆ రాశులు ఏవో, అందులో మీ ప్రియురాలిది లేదా మీ భార్య రాశి ఉందో లేదో చూడండి.
మీనరాశి:
మీనరాశి వారు ప్రేమ స్వభావులు. అంటే వీరు ప్రేమించడంలో ప్రత్యేకంగా వ్యవహరిస్తారు. ప్రేమను చూపించేందుకు కొత్త దారులు వెతుకుతారు. శృంగారం కూడా ప్రేమను వ్యక్తీకరించేందుకు ఉత్తమమైన మార్గం కాబట్టి ఈ రాశి మహిళలు రొమాంటిక్ గా ఉంటూ తమ ప్రేమను, కోరికను వ్యక్తపరుస్తారు. మీనరాశి వారు శృంగారభరితంగా ఉంటూ భాగస్వామిలో ఉత్సాహాన్ని, కోరికను తీసుకువస్తారు. మీనరాశి వారు మానసికంగా, భావోద్వేగంగా బలంగా ఉంటారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశి వారు ప్రియమైన వారి అవసరాలను తీర్చడంపై ఎప్పుడూ దృష్టి పెడతారు. మంచి వాతావరణాన్ని, రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తారు. కర్కాటక రాశి స్త్రీలు తమ ప్రేమను శృంగారం ద్వారా వ్యక్తీకరించడాన్ని ఇష్టపడతారు. అదే కోరుకుంటారు.
తులారాశి:
తులారాశి స్త్రీలు సహజంగానే శృంగారానికి, అందానికి ఎక్కువగా ఆకర్షితులవుతారు. చెప్పలేనంత ప్రేమను శృంగారం ద్వారా వ్యక్తీకరిస్తారు. ప్రియుడితో, భర్తతో సున్నితమైన, లైంగిక సంబంధాన్ని కోరుకుంటారు. ప్రియుడి లేదా భర్త చేసే శృంగారభరిత చర్యలను బాగా ఇష్టపడతారు. రొమాంటిక్ గా ఉండటంతో పాటు భర్తలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. భర్తలను సమ్మోహన పరచడంలో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.
వృషభ రాశి:
వృషభ రాశి స్త్రీలు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఏదైనా పని చేస్తే దానికి రొమాంటిక్ టచ్ ఇస్తారు. ఇంద్రియాలను తట్టిలేపే శక్తి వీరికి ఉంటుంది. ఆ నైపుణ్యం వీరికి సహజంగా వచ్చేస్తుంది. ప్రేమ సంబంధమైనా, వివాహ సంబంధమైనా శారీరక సాన్నిహిత్యానికి ఎక్కువ విలువ ఇస్తారు. వారు తమ భావాలను వ్యక్తీకరించడానికి, ఇష్టాన్ని, ప్రేమను, కోరికను తెలియజెప్పడానికి వీరు శృంగారాన్నే ఎంచుకుంటారు. శృంగార కళలో వీరికి సహజంగానే నైపుణ్యం ఉంటుంది. రొమాన్స్‌లో తమ ఆనందంతో పాటు భాగస్వామి సుఖాన్ని కోరుకుంటారు.
సింహరాశి:
సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇతర విషయాల్లో ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తారో శృంగార విషయంలోనూ అలాగే ఉంటారు. శృంగారభరితంగా ఉండటానికి ఇష్టపడతారు. ఏమాత్రం సిగ్గు పడకుండా భర్తతో, ప్రియుడితో రొమాంటిక్ గా ఉంటారు. రొమాంటిక్ గా ఉండటంతో పాటు అలా ఉండటాన్ని ఇష్టపడతారు. సింహరాశి వారు ఇష్టాన్ని, ప్రేమను, వ్యామోహాన్ని వ్యక్తం చేయడానికి శృంగారాన్ని ఆశ్రయిస్తారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications