Latest Updates
-
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్
ఈనాటి దాంపత్యానికి ఆదర్శంగా నిలిచే ఆనాటి ప్రేమకథలు.. ఒక్కో కథలో ఒక్కో పాఠం.!
కాలం మారుతున్న కొద్దీ వైవాహిక జీవితంలో వివిధ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో చాలావరకు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, బంధం విచ్ఛిన్నమవడానికి దారితీస్తున్నాయి. అయితే దంపతుల మధ్య అనుబంధం ఎలా ఉండాలనేది మన పురాణ గాథల్లో కొన్ని కథలు ఉదహరిస్తున్నాయి. ఆ కథలను ఆదర్శంగా తీసుకుంటే దాంపత్య బంధం ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా అన్నోన్యంగా ఉంటుంది. ఆ కథలేంటి.. ఆ గాథల ద్వారా ఈనాటి జంటలు నేర్చుకోవాల్సిన, పాటించాల్సిన విషయాలేంటి ఇక్కడ చూద్దాం..

శకుంతల- దుష్యంతుడు
హిందూ ఇతిహాసాల్లో శకుంతల- దుష్యంతుడి కథ చిరస్మరణీయం. భార్యాభర్తల మధ్య అపార్థాలు ఎప్పుడూ వారి బంధానికి ముగింపు కాదని వారి కథ తెలియజేస్తుంది. కణ్వ బుుషి కుమార్తె శకుంతల- దుష్యంత మహారాజు ప్రేమించుకుంటారు. ఆ సమయంలో ఆమెకు ఉంగరం తొడుగుతాడు. కానీ బుుషి శాపం వల్ల దుష్యంతుడు శకుంతలను మర్చిపోతాడు. కొంతకాలం తర్వాత ఉంగరం దొరకడంతో ఆయనకు గతం అంతా గుర్తుకువస్తుంది. తిరిగి ఇద్దరూ కలుసుకుంటారు. ఒక బంధంలో ఓర్పు, సత్యం ఎంత ప్రధానమో తెలియజేస్తుంది. నమ్మకం, భావోద్వేగాలు భార్యాభర్తల బంధానికి అతిపెద్ద బలం.

రుక్మిణీకృష్ణులు
వ్యక్తిగత ఆనందకరమైన జీవితానికి సొంత నిర్ణయాలు ఎంత కీలకమో రుక్మిణీ కళ్యాణం తెలియజేస్తుంది. రుక్మిణి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె తండ్రి వివాహం నిర్ణయిస్తారు. దీంతో ఆమె శ్రీకృష్ణునికి ఒక సందేశం పంపుతుంది. తనతో పాటు తీసుకువెళ్లమని అభ్యర్థించడంతో ఆ పరమాత్ముడు ఆమెను గౌరవంగా తనతో తీసుకువెళతారు. వారిద్దరూ వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెడతారు. భార్యాభర్తల సంబంధం గౌరవం, పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉండాలని ఈ కథ తెలియజేస్తుంది. జీవిత భాగస్వామిని ఎంచుకునే అధికారం యువతీయువకులకు ఉండాలి. ఇందుకు ధైర్యం ఎంతో ఉండాలి.
నల- దమయంతి
భార్యాభర్తలు కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలని నిరూపించే కథ నల- దమయంతిల వైవాహిక జీవితం. స్వయంవరంలో నలుడిని దమయంతి ఎంచుకుంటుంది. అయితే పలు కారణాల వల్ల నలుడు రాజ్యాన్ని కోల్పోయి కష్ట సమయాలు ఎదుర్కొంటున్నా దమయంతి భర్తను వదిలిపెట్టదు. ఇద్దరూ కలిసి వారి జీవితాన్ని పునరుద్ధరించుకుంటారు. ఆర్థిక, వ్యక్తిగత సవాళ్లకు ఎదురీదుతూ కష్ట సమయాల్లో భాగస్వామికి అండగా నిలవాలని వీరి బంధం తెలియజేస్తుంది. బంధంలో సహనం, సహకారం ముఖ్యమని అర్థం చేసుకోవాలి.

ఉష- అనిరుద్ధ
ఉష- అనిరుద్ధల కథ కేవలం ప్రేమ గురించి మాత్రమే కాదు. ఒకరిపై ఒకరికి విశ్వాసం, ధైర్యానికి అద్దం పడుతుంది. ఒకరోజు ఉష తన కలలో కనిపించిన యువకుడిని చూసి ప్రేమలో పడుతుంది. అతను శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధగా గుర్తిస్తుంది. వీరి మధ్య ప్రేమ కారణంగా బాణాసురుడు, శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం జరిగి.. పోరాటంలో గెలిచిన తర్వా ఉష- అనిరుద్ధలు కలుసుకుంటారు. దాంపత్య బంధంలో ప్రేమతో పాటు బాధ్యత కూడా అవసరమని.. కుటుంబానికి, పరిస్థితులను సమన్వయం చేసుకోవాలని తెలియజేస్తుంది. సహనం, ధైర్యంతో సవాళ్లను పరిష్కరించుకోవాలి.
సావిత్రి- సత్యవాన్
హిందూ పురాణాల్లో అత్యంత ఆదర్శవంతమైన స్ఫూర్తి దాయకమైన కథ సతీ సావిత్రి- సత్యవాన్‌ల కథ. అంకితభావం, నమ్మకానికి నిదర్శనం వీరి బంధం. సత్యవాన్ అల్పాయుష్కుడని సావిత్రికి ముందే తెలిసినా అతడిని మనువాడుతుంది. పెళ్లి తర్వాత సత్యవాన్ మరణిస్తే.. తన భర్త కోసం యమ ధర్మరాజుని చేరుకుని తన తెలివితేటలు, పట్టుదలతో సత్యవాన్‌ను తిరిగి ప్రాణం పోసి దక్కించుకుంటుంది. ప్రేమలో గౌరవానికి, మానసిక బలానికి ఈ బంధం ఉదాహరణ. సానుకూలమైన ఆలోచనలు, ఓర్పు, అవగాహన, కష్ట సమయాల్లో కలిసికట్టుగా నిలబడాలని తెలియజేస్తుంది.
ప్రతి భార్యాభర్తల మధ్య సంబంధం, పరిస్థితులు భిన్నంగా ఉంటుంది. ఈ పౌరాణిక గాథలను స్ఫూర్తిగా తీసుకుని బంధంలో ఎదురయ్యే సవాళ్లను, ఒడుదొడుకులను పరిష్కరించుకోవాలి. ఆరోగ్యకరమైన సంభాషణ, గౌరవం, అంగీకారం, నమ్మకం ఉంటే ఆ బంధం కలకాలం పదిలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications