Latest Updates
-
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.? -
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.!
ఈ సెక్స్ సీక్రెట్స్‌ను భార్యలు తమ భర్తలతో కూడా చెప్పరు, అవేంటో తెలుసా?
భార్యాభర్తల మధ్య దాపరికాలు, సీక్రెట్స్ లాంటివి ఉండకూడదని అందరూ చెప్పేమాట. ముఖ్యంగా శృంగార సంబంధిత విషయాల్లో మనసులో ఏదనిపిస్తే అది చెప్పాలని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తుంటారు. కోరికలు, ఆశలు, అవసరాలు, ఫాంటసీల గురించి నిర్మొహమాటంగా చెప్పాలని, అప్పుడు శృంగారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చని అంటారు. సెక్స్ సమయంలో ఏదైనా కావాలనిపించినా, కొత్తగా ట్రై చేయాలనిపించినా ఏదీ దాచుకోకుండా భార్యాభర్తలు ఒకరితో ఒకరు చెప్పుకోవాలని అంటారు.
అయితే శృంగారం విషయంలో భార్యలు తమ భర్తల నుంచి కొన్ని సీక్రెట్స్ దాచిపెడుతుంటారట. ఈ విషయాన్ని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. చాలా మంది మహిళలు భర్తతో ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ, ఇతర విషయాల్లో అన్ని విషయాలు పంచుకున్నా.. శృంగారంలో మాత్రం కొన్ని సీక్రెట్స్ దాస్తుంటారని తేలింది. సెక్స్ అంశం వచ్చే సరికి మహిళలు దాచే ఆ సీక్రెట్స్ ఏంటో కూడా నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులను బట్టి సీక్రెట్స్ మారుతుండవచ్చు కానీ ఎక్కువ మందికి సాధారణంగా ఉండే సీక్రెట్స్ మాత్రం ఇవేనట.

ఎక్స్‌తో సెక్స్ గురించి:
ఈమధ్యకాలంలో చాలా మందికి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. వారి మధ్య ఫిజికల్ రిలేషన్‌షిప్ ఉండటం కూడా సాధారణం అయిపోయింది. అయితే భార్యలు తమకు గతంలో లవర్ ఉండేవాడని భర్తలతో చెప్పుకున్నప్పటికీ.. వారితో జరిపిన శృంగారం గురించి ఏ విషయాన్ని కూడా చెప్పరట. వారితో సెక్స్ ఎంత సంతృప్తిగా ఉండేదని అస్సలు చెప్పరట. భర్తతో శృంగార సమయంలో తమ ఎక్స్ ల గురించి ఆలోచించినప్పటికీ ఆ ఆలోచనల గురించి చెప్పరట మహిళలు.
హస్త ప్రయోగం:
చాలా మంది స్త్రీలకు శృంగారంపై అవగాహన ఉంటుంది. వారు తరచూ హస్త ప్రయోగం కూడా చేసుకుంటారు. సెక్స్ సమయంలో అయినా, శృంగార విషయాలు చర్చించుకునేటప్పుడు అయినా తాము హస్త ప్రయోగం చేసుకునే వారిమని మాత్రం భర్తలతో చెప్పుకోరట. హస్త ప్రయోగం విషయాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరట.
ఇష్టం లేకపోయినా చెప్పరు:
పడగ్గదిలో భర్తల పనితీరుతో స్త్రీలు చాలా సార్లు అసంతృప్తి చెందుతారు. అయితే ఆ విషయాన్ని మాత్రం భర్తలతో చెప్పరట. తాము సెక్స్ లో సంతృప్తి చెందలేదని, భర్తల పనితీరు బాగోలేదని చెప్పరట. దీని వల్ల వారి ఆత్మవిశ్వాసం తగ్గుతుందని, లేనిపోని సమస్యలను సృష్టించుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ఈ విషయాలను దాచిపెడతారట.
క్లైమాక్స్ తృప్తి:
పురుషులకు శృంగారంలో తొందరెక్కువ. అలాగే వారు తమ సంతోషాన్నే చూసుకుంటారు. స్త్రీలకు సంతృప్తి కలుగుతుందా, భావప్రాప్తి కలిగిందా అనేది చాలా మంది పట్టించుకోకుండా మధ్యలోనే శృంగారాన్ని కానిచ్చేసి పక్కకు తిరిగి పడుకుంటారు. ఏ స్త్రీ అయినా సెక్స్ సమయంలో క్లైమాక్స్ కు చేరడానికి చాలా సమయం తీసుకుంటారు. భావప్రాప్తి చెందడానికి కూడా సమయం పడుతుంది. ఒకవేళ వారు భావప్రాప్తి పొందకపోయినా ఆ విషయాన్ని భర్తలకు చెప్పరట.
సెక్స్ డ్రైవ్:
పురుషులతో పోలిస్తే స్త్రీలలో సెక్స్ డ్రైవ్ చాలా ఎక్కువ. చాలా సేపు శృంగారం చేయగలరు. చాలా మంది స్త్రీలు హై ఇంటెన్సిటీ సెక్స్ ను చాలా సేపు ఆస్వాదించగలరు. కానీ పురుషులకు అంత సెక్స్ డ్రైవ్ ఉండదు. అయినప్పటికీ వారి అసంతృప్తి గురించి భర్తలకు చెప్పరట.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications