Latest Updates
-
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.!
మీతో ఇతరులు హ్యాపీగా ఉండాలంటే.. ఈ 5 విలువైన సలహాలు పాటించాల్సిందే.!
బంధమేదైనా ఒకరికొకరు కలిసి ఉండటమే కాదు. వారి మధ్య సంతోషం, ఒకరిపై ఒకరికి గౌరవం, అభిమానం ఉండాలి. మీతో ఉంటే సంతోషంగా ఉంటామనే అనుభూతి ఎదుటి వ్యక్తిలో కలిగితే చాలు ఇక ఆ బంధానికి విలువ కట్టలేరు. స్నేహమైనా, ప్రేమ అయినా, పెళ్లి అయినా.. ఇద్దరు వ్యక్తుల మధ్య అనురాగం, సంతోషం పదిలంగా ఉండాలంటే మనస్తత్వ నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

ఒకరితో అనుబంధం అనేది అంత త్వరగా ఏర్పడదు. ప్రతి మనిషిలోనూ ఎదుటి వ్యక్తికి నచ్చే కొన్ని గుణాలు ఉంటాయి. వాటి ద్వారానే ఇద్దరి మధ్యా బంధం బలోపేతం అవుతుంది. ఫ్రెండ్‌షిప్‌లోనూ మనల్ని సపోర్ట్ చేసే, మనల్ని సంతోషంగా ఉంచే వ్యక్తులకే దగ్గరవుతాం. ప్రేమ అయినా ఇలాంటి గుణాల ద్వారానే వికసిస్తుంది. ఇక పెళ్లి బంధంలో భాగస్వామితో జీవితాన్ని వీలైనంతగా మధురంగా, సంతోషంగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి
ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, భాగస్వామి అయినా వారితో ప్రతి క్షణాన్ని మీమీ పరిధుల్లో ఆస్వాదించండి. ఎంజాయ్ చేయండి. కానీ ఆ సంతోషాలకు, ఆ జ్ఞాపకాలకు మరింతగా అతుక్కుపోకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. దీని ద్వారా మున్ముందు భావోద్వేగపరంగా ఒక్కోసారి కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది.

వినండి కానీ..
ఎదుటి వ్యక్తి మీతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, ఆసక్తికర విషయాలు పంచుకోవాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా వారు చెప్పేది వినండి. కానీ వారు చెప్పే మాటల ద్వారా వారిని జడ్జ్ చేయకండి. అడక్కుండానే సలహాలు ఇవ్వకండి. వారు మీ నుంచి ఏదైనా సహాయం కోరిన సందర్భాల్లో మీ అభిప్రాయం, తీర్పు చెప్పండి.
ప్రేమించండి కానీ
ఎదుటి వ్యక్తితో మీరు ప్రేమలో ఉన్నప్పుడు వారిని మనస్ఫూర్తిగా ప్రేమించండి కానీ.. వారిపైనే పూర్తిగా ఆధారపడకూడదని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకరితో మరొకరు కలిసి చేసే ప్రయాణమే జీవితం కానీ.. వారిపైనే పూర్తి ఆధారపడకూడదు. మీకంటీూ వ్యక్తిగత ఇష్టాలు, లక్ష్యాలు ఉండాలి.
ఆశించకండి..
మీకు ఇష్టమైన వారికి ఏదైనా బహుమతి, సర్‌ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇవ్వండి. కానీ వారు మీకు ఏదైనా ఇవ్వాలనే ఆశ, ఆలోచన కానీ అంచనాలు కానీ పెట్టుకోకుండా. ఎలాంటి స్వార్థం లేకుండా ఇచ్చే కానుక మీ బంధాన్ని బలపరుస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
రాజీపడకండి
ఎదుటి వ్యక్తిలో లోపాలను అర్థం చేసుకోండి కానీ మనస్పర్థలు వచ్చినప్పుడు, మీ లోపాలను ఎత్తిచూపినప్పుడు వారితో మీరు రాజీపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుని మెలగడం సరైనదే.. కానీ మీ అభిరుచులను చంపుకొని, మీ లోపాలను ఎత్తి చూపి మిమ్మల్ని నిరాశకి గురిచేసే పరిస్థితులు ఏర్పడితే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
బంధమేదైనా నమ్మకం, గౌరవం, అభిమానం, ప్రేమ, ఆప్యాయత, మద్దతు ఇవన్నీ సమపాళ్లలో ఉండాలి. అప్పుడే ఏళ్లు గడిచినా ఆ బంధం కొత్తగానే ఉంటుంది. మీ వ్యక్తిగత స్వేచ్ఛకి, అభిప్రాయాలకు భంగం వాటిల్లకుండా చేస్తుంది. తల్లిదండ్రులు, పిల్లలు మినహా ఏ బంధాన్నైనా ఎంచుకునే అధికారం, స్వేచ్ఛ మనకి ఉంటుందనే విషయాన్ని గమనించి మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను ఆచితూచీ ఎంచుకోవాలని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
