గాయత్రి మంత్రం ఎందుకంత శక్తివంతమైనది ? విశిష్టత ఏంటి ?

By Swathi

ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మంత్రం గాయత్రి మంత్రం. ఈ మంత్రానికి చాలా విశిష్టత ఉంది. ఈ మంత్రం జపించేటప్పుడు చాలా నియమ, నిష్టలతో, ప్రశాంతమైన మనసుతో స్మరించాలి. ఈ మంత్రాన్ని రోజులో మూడు సమయాలలో మాత్రమే జపించాలని వేదాలు చెబుతున్నాయి.

ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

gayathri mantra

ఈ గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి అంతర్హితమై ఉంటుందని చెబుతారు. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు, శక్తి చేకూరుతాయని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాదు గాయత్రి మంత్రం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. అసలు ఈ గాయత్రి మంత్రం ఎలా జపించాలి ? గాయత్రి మంత్రం ద్వారా పొందే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

గాయత్రి మంత్రం ప్రయోజనాలు

గాయత్రి మంత్రం ప్రయోజనాలు

గాయత్రి మంత్రం చాలా పవర్ ఫుల్ మంత్రంగా భావిస్తారు. వేదాలలో రాసిన ఈ మంత్ర స్మరణ ద్వారా శారీరక, మానసిక ప్రభావం ఉంటుందని చెబుతారు.

అద్భుతమైన శక్తి

అద్భుతమైన శక్తి

ఈ గాయత్రి మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంది. దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రం జపిస్తారు. దేవుడి ఆశీస్సులు, సామాజిక ఆనందం, సంపద కోసం ఈ మంత్రం జపిస్తారు.

ఏ సమయంలో

ఏ సమయంలో

ఈ మంత్రం జపించడానికి రోజూ మూడు సందర్భాలు ముఖ్యంగా చెబుతారు. సంధ్యాసమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్రం జపించవచ్చు.

ఎలా జపించాలి

ఎలా జపించాలి

సమయాన్ని పక్కనపెడితే.. ఈ మంత్రం జపించాలనుకునే వాళ్లు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో, మనుసు నిర్మలంగా చేసుకుని.. నిశ్శబ్దంగా గాయత్రి మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా చదవకూడదు.

అర్థం

అర్థం

ఈ మంత్రాన్ని జపించేటప్పుడు చేతిలో రుద్రాక్ష మాల పట్టుకుని స్మరించడం ద్వారా మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మంత్రం జపించడం ద్వారా నిజాన్ని తెలుసుకోగలుగుతారని అర్థం. అలాగే మనలోని తెలివి తేటలను మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అర్థాన్ని వివరిస్తుంది.

భక్తి

భక్తి

గాయత్రి మంత్రం జపించడం ద్వారా మనలోని భక్తి మరింత పెరుగుతుంది. భక్తి పెరిగిన తర్వాత దేవుడు మీ స్మరణ వింటాడు.

శకునం

శకునం

చాలా మంది కొన్ని సందర్భాల్లో శకునం బాగోలేక అనారోగ్యం పాలవుతుంటారు. అలాంటప్పుడు గాయత్రి మంత్రం జపించడం ద్వారా అలాంటి కీడు, శకునం నుంచి బయటపడతారు.

వారసులకు

వారసులకు

గాయత్రి మంత్రం జపించడం వల్ల భవిష్యత్ లో మీ వారసులు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వాళ్లు మంచి సిరిసంపదలు పొందుతారు.

ఐశ్వర్యం

ఐశ్వర్యం

ఎవరైతే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారో వాళ్ల కుటుంబంలో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ మంత్రం స్మరించడం ద్వారా మీ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది.

పిల్లలకు

పిల్లలకు

గాయత్రి మంత్రం అందరికీ మంచిది. అయితే.. చిన్న పిల్లలకు అయితే మరింత ప్రయోజనకరం. రోజూ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల పిల్లల్లో తెలివి పెరుగుతుంది. వాళ్లు అనుకున్నది సాధించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు.

శత్రువు

శత్రువు

శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే.. ప్రతి మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజు ఎరుపు దుస్తులు ధరించి ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించేటప్పుడు దుర్గా దేవిని స్మరించాలి. ఇలా చేయడం వల్ల మీకు శత్రుభయం నుంచి విముక్తి కలుగుతుంది.

వివాహం

వివాహం

ఒకవేళ మీ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్నా, పెళ్లి కుదరకుండా ఉన్నా.. ప్రతి సోమవారం పసుపు రంగు దుస్తులు ధరించి 108 సార్లు గాయత్రి మంత్రం స్మరించాలి. ఇలా గాయత్రి మంత్రం జపించేటప్పుడు పార్వతీ దేవిని మననం చేసుకోవాలి. ఇలా చేస్తే.. త్వరలోనే మీ పెళ్లి భాజా మోగుతుంది.

అనారోగ్యం

అనారోగ్యం

దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడాలంటే.. ఈ మంత్రాన్ని ఏదైనా మంచి రోజు జపించాలి. ఒక కుండ నిండా తాజా నీటిని తీసుకుని పక్కన పెట్టుకుని, ఎరుపు రంగు వస్ర్తంపై కూర్చుని ఈ మంత్రం జపించాలి. మంత్ర జపం పూర్తయిన తర్వాత ఆ నీటిని తాగాలి.

MOST READ:మీరు తిన‌కూడ‌ని అత్యంత అనారోగ్య‌క‌ర‌మైన ఆహారాలివే..!!

చర్మ సౌందర్యం

చర్మ సౌందర్యం

రోజూ క్రమం తప్పకుండా.. గాయత్రి మంత్రం చదువుతూ ఉంటే.. మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు

క్రమం తప్పకుండా గాయత్రి మంత్రం జపిస్తూ ఉండటం వల్ల మీలో ఉండే చెడు ఆహారపు అలవాట్లు తొలగిపోతాయి. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకుంటారు.

కంటి సమస్యలు

కంటి సమస్యలు

మీరు ఒకవేళ కంటి సమస్యలతో బాధపడుతుంటే.. మీకు గాయత్రి మంత్రం సహాయపడుతుంది. కంటి చూపు సమస్యలు, కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా.. గాయత్రి మంత్రం స్మరించడం ద్వారా దూరమవుతాయి.

జ్ఞానోదయం

జ్ఞానోదయం

గాయత్రిమంత్రం జపించడం వల్ల మనలో భక్తిని, దేవుడిపై మనసుని లగ్నం చేయడమే కాకుండా.. జ్ఞానోదయం కలిగిస్తుంది.

ఆధ్యాత్మికత

ఆధ్యాత్మికత

గాయత్రి మంత్రం జపించడం వల్ల మీలో ఆధ్యాత్మిక సంతృప్తిని, దైవ సంబంధమైన ప్రశాంతతను కల్పిస్తుంది. మీ జీవితంలోనే అన్ని రకాల కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది.

ఇది గాయత్రి మంత్రానికి ఉన్న గొప్ప శక్తి. కాబట్టి నిత్యం కనీసం ఒకసారైనా గాయత్రి మంత్రం స్మరించుకోవడం అలవరుచుకోండి.

Desktop Bottom Promotion