For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తిన‌కూడ‌ని అత్యంత అనారోగ్య‌క‌ర‌మైన ఆహారాలివే..!!

By Swathi
|

ఈ ప్రపంచంలో అన్నింటి కంటే ఆరోగ్యకరమైనవి వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఈ సంగతి అందరికీ తెలిసిందేలే అనుకుంటున్నారా ? నిజమే.. కానీ వీటిని తినడానికి ఎంత మంది ఇష్టపడుతున్నారు. అన్ హెల్తీ ఫుడ్ తినడానికే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే.. అత్యంత అనారోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసా ? జంక్ ఫుడ్ అంటే ఇండియన్స్ కి ఎంతకంత క్రేజ్ షుగరీ, టేస్టీగా ఉండే ఆహారాలనే పిల్లలు, పెద్దలు ఆవురావురు మంటూ లాగించేస్తారు.

జంక్ ఫుడ్ ని ఇష్టపడినంత వేరే ఏ ఆహారాలను ఇష్టపడరు. మరీ ఈ ఫుడ్ హెల్తీయేనా ? కాదు. 50 శాతం కంటే ఎక్కువ మంది ఈ జంక్ ఫుడ్ కారణంగానే చనిపోతున్నారని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వీటన్నింటికీ.. ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకీ ఈ అన్ హెల్తీ ఫుడ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..

ప్రాసెస్డ్ మీట్స్

ప్రాసెస్డ్ మీట్స్

ప్రాసెస్డ్ మీట్స్ తీసుకోవ‌డం వ‌ల్ల 42 శాతం హార్ట్ డిజీస్ ల రిస్క్ పెరుగుతుంద‌ట‌. అమెరికాలో ఎక్కువ‌గా మ‌ర‌ణాల‌కు ప్రాసెస్డ్ మీట్సే కార‌ణ‌మ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

చీజ్ బర్గర్స్

చీజ్ బర్గర్స్

చీజ్ బర్గర్స్ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయి. వీటిల్లో ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాట్, సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అస్సలు ఆరోగ్యకరం కాదు. కాబట్టి ఎక్కువ మోతాదులో వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగి గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి.

రిఫైన్డ్ ఫ్లోర్

రిఫైన్డ్ ఫ్లోర్

కేక్స్, బిస్కెట్స్, స్నాక్స్ లో ఎక్కువ‌గా రిఫైన్డ్ ఫ్లోర్ వాడ‌తారు. ఇలాంటి ఆహారాల వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి, మెట‌బాల‌జంపై దుష్ర్ప‌భావం చూపుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వెంట‌నే ఆక‌లిగా అనిపిస్తుంది.

సోడా, షుగరీ డ్రింక్స్

సోడా, షుగరీ డ్రింక్స్

సోడా, షుగరీ డ్రింక్స్ అంటే ఇష్టపడని వాళ్లు బహుశా ప్రస్తుత జనరేషన్ లో ఉండరేమో. చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ డ్రింక్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వీటిల్లో న్యూట్రీషనల్ వ్యాల్యూస్ ఏమాత్రం ఉండవు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు ఉంటుంది.

ఐస్ క్రీం

ఐస్ క్రీం

ఐస్ క్రీముల్లో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ లెవెల్స్ ఉంటాయి. శాచురేటెడ్ ఫ్యాట్, షుగ‌ర్, క్యాల‌రీలు ఉంటాయి. హై శ్యాచురేటెడ్ ఫ్యాట్ వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతాయి.

ఫ్రైడ్ ఫుడ్స్

ఫ్రైడ్ ఫుడ్స్

డీప్ ఫ్రై చేసిన ఎలాంటి ఆహార పదార్థాలలోనైనా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ మిలియన్స్ మంది ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇష్టపడతారు. అవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. కానీ.. ఫ్యాట్ కూడా చాలా ఎక్కువే. బరువు తగ్గాలి అనుకుంటే.. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి దూరంగా ఉంటే రిజల్ట్స్ మీకే తెలుస్తాయి.

English summary

List of the Unhealthiest Foods in the World

List of the Unhealthiest Foods in the World. Growing up, almost every kid in the world was probably told to stay clear of junk foods and eat more of fruits and vegetables instead.
Story first published: Monday, March 7, 2016, 19:23 [IST]
Desktop Bottom Promotion