Latest Updates
-
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.!
Akshay Tritiya 2023: మీ రాశిని బట్టి అక్షయ తృతీయ రోజున కొనాల్సినవి ఇవే...!
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అంటే ఏప్రిల్ లేదా మే నెలలో అక్షయ తృతీయ పండుగ వస్తుంది.

ఈ ఏడాది 2023లో ఏప్రిల్ 22వ తేదీ ఈ పండుగ వచ్చింది. ఈరోజును హిందువులు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈరోజున షాపింగ్ చేయడం చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఈరోజున బంగారం, వెండి వంటి వస్తువులను కొనడం వల్ల తమ ఇంటికి శ్రేయస్సు లభిస్తుందని.. తమ ఆదాయం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని నమ్ముతారు.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి అక్షయ తృతీయ రోజున ఏ వస్తువును కొనుగోలు చేయాలి.. ఎలాంటి వాటిని కొంటే.. మీకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.. ఏ వస్తువులను దానం చేస్తే మీకు ప్రయోజనాలు లభిస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
అక్షయ తృతీయ రోజున ఈ రాశి వారు బంగారంతో తయారు చేసిన ఏదైనా చిన్న వస్తువును కొనుగోలు చేయాలి. ఒకవేళ మీకు ఇది సాధ్యం కాకపోతే, మీరు రాగితో చేసిన ఒక వస్తువును కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటు మీరు తప్పనిసరిగా గోధుమలను దానం చేయాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున వెండి లేదా వెండితో తయారు చేసిన నాణెన్ని కొనుగోలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున మీరు ఎవరికైతే బట్టలు, ఆహారం అవసరముంటాయో వారికి అవి దానం చేస్తే అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

మిధున రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున వెండి ఆభరణాలు మరియు కొత్త బట్టలు కొనుగోలు చేయాలి. మీ ఇంట్లో శాంతి, ఆహ్లదకరమైన వాతావరణం కోసం మూంగ్ దాల్ దానం చేయాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున వెండిని కొనుగోలు చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున మీరు ఆకలితో ఉన్న వ్యక్తులకు ఆహారాన్ని అందించాలి.

సింహ రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బంగారం ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు బంగారం కొనడం సాధ్యం కాకపోతే, మీరు పేదలకు పండ్లు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు బాధలు తగ్గిపోతాయి.

కన్య రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున వెండి నాణేలు, ఉక్కు పాత్రలు కొనుగోలు చేయాలి. మీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు కోసం మిఠాయిలు(Sweets) దానం చేయాలి.

తుల రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున వెండి నాణేలు కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున మీరు ఓ పేద కుటుంబానికి తెల్లని వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున రాగి పాత్రను కొనుగోలు చేస్తే మంచిగా ఉంటుంది. ఒక వేళ మీకు బంగారం కొనగలిగే సామర్థ్యం ఉంటే, మీరు బంగారం ఆభరణాలను కూడా కొనొచ్చు. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున బంగారం నగలు కొనడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈ పవిత్రమైన రోజున ఆలయంలో కంది పప్పు లేదా పెసరపప్పు వంటివి సమర్పించాలి. దీని వల్ల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున వెండి నాణేలు లేదా నగలు కొనడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ఇనుమును దానం చేస్తే ఫలితం ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బంగారం ఆభరణాలను కొనుగోలు చేసి, భాగస్వామికి బహుమతులుగా ఇవ్వాలి. అలాగే బ్రాహ్మాణులకు ఆహారం అందించాలి.

మీన రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున ఎలాంటి ఆభరణాలు అయినా కొనుగోలు చేయొచ్చు. దీని వల్ల మీరు చాలా ప్రయోజనం పొందుతారు. అలాగే మీరు ఎవరైనా పేదవారికి ఆహారాన్ని అందించాలి.



Click it and Unblock the Notifications
