Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
దేవుడికి హారతి ఎలా ఇవ్వాలో తెలుసా?..పూజ పూర్తయ్యాక ఈ మంత్రం చదివితేనే సంపూర్ణ ఫలం!
హిందూ సంప్రదాయంలో భగవంతుని ఆరాధనలో హారతికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. మనం ఎంత ఘనంగా ఉపచారాలు చేసినా, పూజాది కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి లేదా అమ్మవారికి సమర్పించే హారతితోనే ఆ పూజకు ఒక పరిపూర్ణత చేకూరుతుంది.
కానీ హారతి ఇచ్చేటప్పుడు పాటించాల్సిన సరైన విధివిధానాలు, ఆ తర్వాత చదవాల్సిన మంత్రం గురించి మనలో చాలామందికి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

హారతికి కావలసిన పాత్రలు (హారతి పళ్లేలు)
హారతి ఇవ్వడానికి ఎప్పుడూ రెండు వేర్వేరు హారతి పాత్రలను సిద్ధం చేసుకోవాలి. మొదటిది ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఇచ్చే హారతికి, రెండవది కర్పూర హారతికి ఉపయోగించాలి. కర్పూర హారతిని ఎప్పుడూ పూజ చివరలో మాత్రమే ఇవ్వాలి.
కర్పూరం ఎలాగైతే తనను తాను పూర్తిగా కరిగించుకుని భగవంతుని ముందు వెలుగునిస్తుందో, అలాగే మనలోని అహంకారాన్ని, గర్వాన్ని భగవంతుని పాదాల చెంత పూర్తిగా కరిగించి సమర్పించుకోవాలి అనడానికి ఇది ఒక అద్భుతమైన ప్రతీక.
హారతి ఇచ్చే పవిత్రమైన క్రమం
హారతి ఇచ్చేటప్పుడు ఇష్టమొచ్చినట్లుగా తిప్పకూడదు. దీనికి ఒక పవిత్రమైన క్రమం ఉంది. హారతి పళ్లాన్ని ఎప్పుడూ దేవుని ముందు గాలిలో ఓం(OM) ఆకారాన్ని లిఖిస్తున్నట్లుగా తిప్పుతూ సమర్పించాలి. హారతిని దేవుని విగ్రహానికి ఎన్నిసార్లు, ఏయే భాగాల వద్ద ఇవ్వాలంటే..
స్వామివారి పాదాల దగ్గర: 4 సార్లు
బొడ్డు దగ్గర: 2 సార్లు
ముఖం దగ్గర : 1 సారి
శిరస్సు నుండి పాదాల వరకు (సంపూర్ణ శరీరానికి): 7 సార్లు
మొత్తంగా లెక్కించుకుంటే ఇది 14 సార్లు అవుతుంది. ఈ సంఖ్య సృష్టిలోని 14 భువనాలకు (ఏడు ఊర్ధ్వ లోకాలు, ఏడు అధో లోకాలకు) ప్రతీక. అంటే సమస్త లోకాలను ఏలే ఆ జగన్నాథునికి మన భక్తిని, ప్రాణాన్ని ఈ 14 హారతుల రూపంలో సమర్పించుకుంటున్నామని అర్థం.
పూజను సంపూర్ణం చేసే క్షమాపణ మంత్రం
మనం ఎంత నిష్ఠతో పూజ చేసినా, మానవులం కాబట్టి తెలియక కొన్ని తప్పులు దొర్లవచ్చు. మంత్రోచ్ఛారణలో గానీ, పూజా విధానంలో గానీ లోపాలు జరగవచ్చు. ఇలా తెలిసి చేసినా, తెలియక చేసినా దోషం అంటకుండా ఉండాలంటే పూజ పూర్తయ్యాక దేవుని ముందు సాష్టాంగ నమస్కారం (తల నేలకు ఆనించేలా) చేస్తూ ఈ కింది శ్లోకాన్ని తప్పక పఠించాలి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన..
యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తద్ అస్తు మే.
శ్లోకం అర్థం: ఓ స్వామీ నిన్ను స్తుతించడానికి సరైన మంత్రాలు చదవడం నాకు రాదు. నిన్ను పూజించే సరైన ఆగమ, శాస్త్ర విధానాలు నాకు తెలియవు. నాలో నిశ్చలమైన, స్వచ్ఛమైన భక్తి కూడా లోపించే ఉంది. ఓ దేవా నాకున్న ఈ కొద్దిపాటి జ్ఞానంతో, నా చిన్ని మనసుతో నేను చేసిన ఈ ఆరాధనను స్వీకరించు. ఇందులో ఉన్న లోపాలను మన్నించి, నా ఈ పూజను పరిపూర్ణమైనదిగా ఆశీర్వదించు తండ్రీ అని అర్థం.



Click it and Unblock the Notifications
