Latest Updates
-
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఆగస్టు 19 నుంచి ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి! -
జుట్టు రాలడం తగ్గాలంటే.. వారానికోసారి ఈ కరివేపాకు ఎగ్ రైస్ తినాల్సిందే!..లంచ్ బాక్స్ కి బెస్ట్ -
ఇంట్లోనే పక్కా హోటల్ స్టైల్ వెజ్ కుర్మా.. రెస్టారెంట్ చెఫ్ లు వాడే సీక్రెట్ ఇదే! -
ఏ కూరగాయలు, పండ్లు తినాలి? సద్గురు చెప్పిన ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యే ఉండదు! -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.! -
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.!
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
నల్లటి డ్రెస్ వేసుకున్నప్పుడు భుజాలపై రాలే తెల్లటి పొట్టు మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? చుండ్రు.. నేడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అత్యంత సాధారణ సమస్య.
అయితే చుండ్రు మరీ ఎక్కువగా ఉంటే జుట్టు రాలిపోయి చివరకు బట్టతల వస్తుందనే భయం చాలా మందిలో ఉంటుంది. నిజంగానే చుండ్రు బట్టతలకు దారితీస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారెో ఇక్కడ చూడండి.

చుండ్రు - జుట్టు రాలడం.. అసలు నిజం ఇదే
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. చుండ్రు నేరుగా జుట్టు రాలడానికి లేదా బట్టతలకు కారణం కాదు. కానీ చుండ్రు వల్ల తలపై తీవ్రమైన దురద వస్తుంది. ఆ దురదను తట్టుకోలేక తల గోకడం వల్ల కేశ కుదుళ్లు దెబ్బతింటాయి. దీనివల్ల కొంత మేర జుట్టు రాలుతుంది కానీ పూర్తిగా బట్టతల మాత్రం రాదు. అయితే ముందే ఆండ్రోజెనిక్ అలోపేసియా(స్త్రీ, పురుషుల్లో జన్యుపరంగా వచ్చే బట్టతల సమస్య) ఉన్నవారిలో మాత్రం చుండ్రు ఈ జుట్టు రాలే ప్రక్రియను మరింత తీవ్రతరం చేస్తుంది.
అసలు చుండ్రు ఎందుకు వస్తుంది?
మన జుట్టును శుభ్రం చేసుకునే అలవాట్లు లేదా లోపలి చర్మ సమస్యల వల్ల చుండ్రు రావచ్చని డాక్టర్ సౌమ్య వివరిస్తున్నారు. ముఖ్యంగా మలాసెజియా అనే ఫంగస్ వల్లే ఎక్కువ మందిలో ఈ సమస్య తలెత్తుతుంది. సహజంగానే మన తల మీద ఉండే ఈ ఫంగస్.. ఒక్కోసారి అతిగా పెరిగిపోయి చర్మానికి చికాకు కలిగిస్తుంది. దీనివల్ల చర్మ కణాలు వేగంగా వృద్ధి చెంది, ఆ చనిపోయిన కణాలు తెల్లటి పొరలుగా (చుండ్రుగా) రాలిపోతాయి.
మీకు చుండ్రు ఎందుకు వస్తుందో కచ్చితంగా తెలియకపోతే, సొంత వైద్యం కంటే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం బెటర్. తలస్నానం అతిగా చేస్తున్నారా లేక తక్కువగా చేస్తున్నారా? లేదా తల పొడిబారడం లాంటి ఇతర సమస్యలు ఉన్నాయా అనేది వారు సులభంగా గుర్తిస్తారు.
చుండ్రుకు చెక్ పెట్టే అద్భుత పరిష్కారాలు
మెడికేటెడ్ షాంపూల వాడకం: సాధారణ షాంపూల వల్ల చుండ్రు తగ్గకపోతే, మెడికేటెడ్ షాంపూలను వాడాలి. పైరిథియోన్ జింక్, సాలిసిలిక్ యాసిడ్, కీటోకోనజోల్ లేదా సెలీనియం సల్ఫైడ్ ఉన్న షాంపూలను ఎంచుకోవాలి. సమస్య తీవ్రత తక్కువగా ఉంటే వీటిని కొన్ని వారాల పాటు వాడితే సరిపోతుంది. లేత రంగు జుట్టు ఉన్నవారు సెలీనియం సల్ఫైడ్ ఉన్న షాంపూలకు దూరంగా ఉండటం మంచిది.
కురులకు తేమను అందించండి
చుండ్రును వదిలించుకునే క్రమంలో తల చర్మం పొడిబారకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న షాంపూలు వాడినప్పుడు జుట్టు త్వరగా పొడిబారుతుంది. కాబట్టి ప్రతిసారీ తప్పనిసరిగా కండిషనర్ ను ఉపయోగించి కురులకు అవసరమైన తేమను అందించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
