ఏ కూరగాయలు, పండ్లు తినాలి? సద్గురు చెప్పిన ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యే ఉండదు!

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్.. సోషల్ మీడియా వేదికగా ప్రజలకు శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల తరచుగా అవగాహన కల్పిస్తుంటారు. ఆయన చెప్పే అద్భుతమైన విషయాల్లో ఒకటేమిటంటే..మన శరీరానికి, బుద్ధికి ప్రధానమైన యంత్రం మన జీర్ణవ్యవస్థే.

మన పేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటే, మనం శారీరకంగా అంత చురుకుగా ఉంటాం, మానసికంగా అంత ప్రశాంతంగా ఉంటాం. కానీ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది గ్యాస్ట్రిక్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి టైంలో మన పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సద్గురు కొన్ని అద్భుతమైన, సహజసిద్ధమైన ఆహార నియమాలను సూచిస్తున్నారు.

Sadhguru s Ultimate Guide to Gut Health Best Vegetables and Fruits To Eat Goodbye to Gastric Issues

పేగుల ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేసే పండ్లు, కూరగాయలు

బూడిద గుమ్మడికాయ
సద్గురు దృష్టిలో ఇదొక అత్యంత శక్తివంతమైన ఆహారం. ప్రతిరోజూ ఉదయం పరగడుపున బూడిద గుమ్మడికాయ రసం తాగితే, పేగులు లోపలి నుండి పూర్తిగా శుభ్రపడతాయి. పొట్టలో మంట తగ్గిపోయి, హానికరమైన బ్యాక్టీరియా నాశనమవుతుంది.

బొప్పాయి, అరటిపండు
బొప్పాయిలో ఉండే సహజ ఎంజైమ్‌ లు మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే బాగా పండిన అరటిపండు తినడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు తగిన పోషణ లభిస్తుంది.

నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు
సొరకాయ, దోసకాయ వంటి కూరగాయల్లో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. ఇవి పొట్టను చల్లబరుస్తాయి. పేగుల లోపలి పొరను మృదువుగా మార్చి, జీర్ణక్రియను సమతుల్యం చేస్తాయి.

ఆకుకూరలు
పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను చీపురులా ఊడ్చి బయటకు పంపేస్తాయి.

ఉసిరి, నిమ్మకాయ
శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో వీటికి మించినవి లేవు. ఇవి జీర్ణరసాలను ఉత్తేజపరిచి జీర్ణశక్తిని పెంచుతాయి.

ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్!ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్!

జీర్ణశక్తిని పదింతలు చేసే సద్గురు జీవనశైలి చిట్కాలు

పచ్చి ఆహారానికి పెద్దపీట

మీరు రోజూ తినే ఆహారంలో కనీసం 30 నుండి 40 శాతం వరకు ఉడికించని పచ్చి పండ్లు, తాజా కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి.

బాగా నమిలి తినండి

సద్గురు చెప్పే అత్యంత ముఖ్యమైన నియమం ఇది. మనం తినే ప్రతి ముద్దను కనీసం 24 నుండి 32 సార్లు నమలాలి. ఇలా చేయడం వల్ల మన నోట్లోనే సగం జీర్ణప్రక్రియ పూర్తవుతుంది. లాలాజలంతో బాగా కలిసిన ఆహారం పేగులకు భారాన్ని తగ్గిస్తుంది.

నీరు తాగే విధానం - భోజన విరామం

భోజనం చేసిన వెంటనే గటగటా నీళ్లు తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఇది జీర్ణక్రియ మంటను చల్లార్చి, అరుగుదలను నెమ్మదింపజేస్తుంది. అలాగే, ఒక భోజనానికి, మరో భోజనానికి మధ్య కనీసం 5 నుండి 6 గంటల విరామం తప్పనిసరి. అప్పుడే పేగులు తమను తాము శుభ్రం చేసుకోగలుగుతాయి.

రాత్రి పూట తేలికపాటి భోజనం
నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి. రాత్రిపూట బరువైన ఆహారాలకు బదులుగా, తేలికగా ఉడికించిన కూరగాయలు తీసుకోవాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, August 17, 2026, 7:18 [IST]
Desktop Bottom Promotion