Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్!
శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రోజూ మొదటి నైవేద్యం మట్టి కుండలోనే ఎందుకు పెడతారు ?
శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యం మట్టికుండలో ఎందుకు
వజ్ర వైఢూర్యాలతో, మరకత మణి మాణిక్యాల నడుమ తులతూగే శ్రీవేంకటేశ్వరుడు రోజూ స్వీకరించే ప్రసాదం తయారు చేసే పాత్ర ఏమై ఉంటుంది? వెండి, బంగారు గిన్నెల్లో వండుతారని అనుకుంటాము కదా! కానే కాదు. ఆ మహిమాన్వితుడు కూడా అందరిలానే మామూలు మట్టి కుండలో వండిన ప్రసాదమే స్వీకరిస్తాడు ఇప్పటికీ. అందులోనూ కట్టెలపొయ్యి మీద వండితేనే ఆయనకి అత్యంత ఇష్టం. ఇది వందల ఏళ్లనాటి ఆచారం.
సంపద పెరిగినా ఆయన అభిరుచి మారలేదు. ఒళ్ళంతా బంగారమే అయినా ఆయన మనసు మమతల మట్టే. శ్రీవారి సన్నిధికి ఆగ్నేయంలో అన్నప్రసాద తయారీ శాల ఉంది. అక్కడ కట్టెల పొయ్యి మీద మట్టికుండలో రోజూ ప్రసాదం తయారుచేస్తారు. దీనిని ఓడు ప్రసాదం అని కూడా అంటారు. ఇక్కడ తయారుచేసిన దద్ద్యోజనం స్వామివారికి నైవేద్యంగా పెడుతారు. తోమాల, అర్చన అనంతరం స్వామి ప్రసాదం స్వీకరిస్తాడు.
తొలుత పుష్కరిణి వద్దవున్న వరాహస్వామికి ప్రసాద నైవేద్యం సమర్పించిన తరువాతనే స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. ఇదే విధంగా రాత్రి వేళలలో కూడా నైవేద్య కార్యక్రమం ఉంటుంది. వంటశాల వద్ద స్వామివారి తల్లి అయిన వకుళమాత పర్యవేక్షణలో ప్రసాదాల తయారు చేస్తారు. ఏ బిడ్డకైనా అమ్మ చేతి వంట రుచే కదా నచ్చేది. మరి మొదటి నైవేద్యం కట్టెల పొయ్యిలో సరే, మరి మట్టి కుండలోనే ఎందుకు పెడుతారు అంటే ఈ కథ చదవాల్సిందే...

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
ఇది వరకు తిరుమలలో "తొండమాన్ చక్రవర్తి" అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట - స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
స్వామి వారికి చిరాకు వేసి తొండమాన్ చక్రవర్తికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడు సమర్పించినవే అన్నాడట.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
అప్పుడు తొండమాన్ తన మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీరు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెల్లాడుట.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
అప్పుడు భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి, కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు. కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు. అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు.వాటి వల్ల నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా "గోవింద" నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి అనేవాడుట?

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట, వీడేమో - అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు, నేనేమో - నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను. ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
భీముడు అన్నం తినే ముందు మట్టి తో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానం లోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్నిభీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
ఇప్పటికి స్వామి వారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?
సారాంశం: ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి. ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు. సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాయన. ఈశ్వరా ఇదంతానీ సృష్టే తండ్రి, నేను నీకు ఏమైనా ఇవ్వగాలనా అని అనుకోవాలుట. మరి నిజమే కదండీ.



Click it and Unblock the Notifications