Latest Updates
-
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు..
ఇంటికి నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి..
'నరుని కంటికి నల్లరాయి కూడా పగులును'అనేది ఒక నానుడి. అవును..నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్ని శక్తి ఉంటుంది. అందుకే దేవాలయం ప్రతిష్ట జరిగిన తర్వాత దేవతా మూర్తిని ముందుగా భక్తులకు అద్దంలో దర్శించిన తర్వాత నిజదర్శనం చేస్తారు . నర దృష్టి ఇంట్లో అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి బాధలకు గురిచేయును. ఈర్ష్య, అసూయ, ద్వేషాదులు మనిషి అభివృద్ధిని ఒక్కసారిగా కుంటుపడేలా చేస్తాయి. ఈ నరఘోష యంత్రం ధరించిన వారికి పది దిక్కుల యొందు ఎవరు ఏ దిక్కు నుంచి ఘోచించిన దృష్టి తగలకుండా కాపాడును. వారి కను దృష్టి తిరిగి వారికే తగిలేలా చేయును.
అయితే నరదృష్టిని నివారించడానికి శుభ దృష్టి గణపతినే కన్ను దృష్టి గణపతి, దిష్టి గణపతి అని కూడా అంటారు. నివాస స్థలాలలో, వ్యాపార ప్రదేశాలలోనూ స్వామి వారి పటాన్ని ఉంచడం వల్ల తీవ్రమైన నదదృష్టి, నరఘోష నుండి కాపాడబడతాము. అదెలాగో చూద్దాం..

ఇంటికి నర దృష్టి పోగొట్టే దృష్టి గణపతి..
శాస్త్రీయ దృష్టితో గమనించినట్లైతే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించడతాయి.

దృష్టి గణపతి రూపం:
శుభ దృష్టి గణపతి కలశ కిరీటాన్ని, మూడు కన్నులను కలిగి ఉంటారు. అష్ట భుజాలతో (ఎనిమిది చేతులతో) ఉంటాడు.

దృష్టి గణపతి రూపం:
కుడివైపున నాలుగు చేతులతో త్రిశూలాన్ని , ఖడ్గాన్ని , చక్రాన్ని, అంకుశాన్నీ ధరించి ఉంటాడు.

దృష్టి గణపతి రూపం:
ఎడమవైపున అగ్నిని , గదని, శంఖాన్ని పాషాన్ని కలిగి ఉండి సింహవాహనుడై దేదీప్యమానంగా వెలుగొందుతాడు.

శుభదృష్టి గణపతిని ఎక్కడ ఉంచాలి:
శుభ దృష్టి గణపతిని ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ముందువైపున ఉంచాలి. .

శుభదృష్టి గణపతిని ఎక్కడ ఉంచాలి:
వ్యాపార సంష్టాలు, సముదాయాల మరియు ఇళ్ళలో సింహద్వారానికి పైన బయటివైపున ఉంచాలి. బయటి నుంచి ఇంట్లోకి వచ్చే వారికి కనబడే విధంగా ఉండాలి.

అలాగే నరదోష యంత్రం ధరించాలి:
ఈ యంత్రంలో ఉండే పది త్రిశూలాలు, పది దిక్కుల నుండి వచ్చే నరఘోషను దృష్టి దోషాన్ని , ప్రయోగదోషాలను , ఈర్ష్య అసూయలను పారద్రోలుతుంది.

అలాగే నరదోష యంత్రం ధరించాలి:
అష్టదిక్పాలకులు అనుగ్రహం కలుగచేసి, మట్టిలో నుంచి దోషాలను హరించి ఆయుర్ధాయము ఇంటికి పూర్వవైభం చేకూర్చుతుంది.

అలాగే నరదోష యంత్రం ధరించాలి:
గృహంకు ప్రవేశ ద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే.. అది నరఘోష లేదా నరదృష్టి నుంచి వచ్చే అనార్థాలను, అడ్డంకులను ఇంటి బయటకే పంపించి వేస్తుంది.

అలాగే నరదోష యంత్రం ధరించాలి:
ఈ యంత్రం ఫలం గాలి, చీడ, పీడ సమస్త ప్రయోగ దోషాలను హరించి, ఆరోగ్యం ప్రశాంతతను చేకూర్చును. విజయవంతంగా అభివృద్ధి పథంలో నడిపించును. నర ఘోష నుంచి మిమ్ముల్ని రక్షిస్తుంది.



Click it and Unblock the Notifications